ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగం మానేసి వ్యవసాయం చేస్తున్నారు. కంప్యూటర్లను పక్కనబెట్టి.. నాగలి పట్టుకుంటున్నారు. పుట్టిన ఊళ్లోనే వ్యవసాయం చేస్తూ.. సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ధీటుగా ఆదాయం పొందుతున్నారు. మీరు కూడా ఉద్యోగం మానేసి వ్యవసాయం చేయాలనుకుంటున్నారా? సంప్రదాయ పంటలను పండిస్తే.. పెద్దగా లాభం ఉండదు. కాస్త వినూత్నంగా ఆలోచిస్తే.. సిరులు పండించవచ్చు. లక్షలు సంపాదించవచ్చు. అలాంటి ఓ అద్భుతమైన ఐడియా (Business Idea)ను ఇవాళ తీసుకొచ్చాం. అదే నల్ల గోధుమల సాగు (Black Wheat Farming). ఈ రోజుల్లో చాలా మంది నల్ల గోధుమలను పండించి.. అధిక ఆదాయం పొందుతున్నారు. మార్కెట్లో నల్ల గోధుమ ధర చాలా ఎక్కువ. సాధారణ గోధుమల కంటే నల్ల గోధుమలను 4 రెట్లు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. వాస్తవానికి వీటి సాగుకు ఎక్కువ ఖర్చు అవుతుంది. అయినప్పటికీ ధర ఎక్కువగా ఉండడం వల్ల.. అధిక లాభాలను సంపాదించవచ్చు.
సాధారణంగా నల్ల గోధుమలను ఎక్కువగా రబీ సీజన్లో సాగు చేస్తారు. నవంబర్ నెలలో విత్తనాలు నాటితే మంచి దిగుబడి వస్తుందని చాలా మంది రైతులు చెబుతున్నారు. నల్ల గోధుమలకు తేమ చాలా ముఖ్యం. నవంబరు, అంతకంటే ముందే విత్తనాలను నాటుకోవాలి. నవంబర్ తర్వాత నల్ల గోధుమలను విత్తడం వల్ల దిగుబడి తగ్గుతుంది.
Stock market: లక్షకు రూ.90 లక్షల లాభం.. ఈ స్టాక్‌తో ఏడాదిలోనే కోటీశ్వరులైన సామాన్యులు
నల్ల గోధుమల్లో పిగ్మెంట్ ఆంథోసైనిన్ (Pigment Anthocyanin) ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సాధారణ గోధుమలతో పోల్చితే ప్రత్యేకంగా ఉంటుంది. తెల్ల గోధుమలలో ఆంథోసైనిన్ కంటెంట్ 5 నుండి 15 ppmగా ఉంటే... నల్ల గోధుమలలో దాని కంటెంట్ 40 నుంచి 140 ppm వరకు ఉంటుంది. ఈ కారణం వల్లే అవి నల్లగా కనిపిస్తాయి. నల్ల గోధుమలలో ఉండే ఆంత్రోసైనిన్ సహజసిద్ధమైన యాంటీ- ఆక్సీడెంట్, యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది. ఇది గుండెపోటు, క్యాన్సర్, మధుమేహం, మానసిక ఒత్తిడి, మోకాళ్ల నొప్పులు, రక్తహీనత వంటి వ్యాధులను నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ ఆంత్రోసైనిన్ నల్ల గోధుమల్లో పెద్ద పరిమాణంలో లభిస్తుంది.
నల్ల గోధుమలలో అనేక పోషకాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఐరన్ చాలా ఎక్కువ. ఈ గోధుమలు క్యాన్సర్, రక్తపోటు, ఊబకాయం, షుగర్ రోగులకు ఒక వరం లాంటివి. అంతే కాకుండా వీటిని తినడం వల్ల
రక్తహీనత సమస్య తగ్గుతుంది. కంటిచూపు కూడా పెరుగుతుంది. అందువల్ల నల్ల గోధుమలను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తారు.
Business Idea: రూ.2 లక్షలతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి.. నెలకు రూ.50 వేల వరకు ఇన్ కమ్
మార్కెట్లో నల్ల గోధుమలు క్వింటాల్‌కు రూ.7000-8000 వరకు అమ్ముడవుతుండగా, సాధారణ గోధుమలు క్వింటాల్‌కు రూ.2,000 మాత్రమే పలుకుతున్నాయని మీడియా కథనాలు చెబుతున్నాయి. సాధారణ గోధుమల కంటే నల్ల గోధుమ దిగుబడి కూడా మెరుగ్గా ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం.. ఒక ఎకరా భూమిలో 30 క్వింటాళ్ల నల్ల గోధుమలను ఉత్పత్తి చేయవచ్చు. మార్కెట్లో ఒక క్వింటాల్ నల్ల గోధుమ ధర 8వేలు ఉందనుకుందాం. అప్పుడు 30 క్వింటాళ్లకు రూ. 2,40,000 ఆదాయం వస్తుంది. మీరు మూడు ఎకరాల్లో సాగుచేస్తే.. దాదాపు 7 లక్షల వరకు రాబడి వస్తుంది. ఇంకా అధిక మొత్తంలో సాగుచేస్తే.. ఇంకా ఎక్కువే సంపాదించవచ్చు.
(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Business, Business Ideas, Farmer