హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Ideas: ఈ పండును సాగుచేస్తే రైతులకు డబ్బే డబ్బు.. లక్షల్లో ఆదాయం

Business Ideas: ఈ పండును సాగుచేస్తే రైతులకు డబ్బే డబ్బు.. లక్షల్లో ఆదాయం

Business Ideas: నల్లజామ చాలా వెరైటీగా ఉంటుంది. ఆకులతో పాటు పండులోని గుజ్జు కూడా ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఒక్కో పండు 100 గ్రాముల బరువు వరకు పెరుగుతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

భారతదేశం వ్యవసాయ ఆధారితదేశం. వ్యవసాయ (Agriculture)  రంగంలో ఇక్కడ అపారమైన అవకాశాలున్నాయి. ఐతే అందరూ పండించే పంటలు కాకుండా.. కాస్త భిన్నమైన వాణిజ్య పంటలను పండిస్తే.. రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది. భారీగా ఆదాయం సమకూరుతుంది. మీరు కూడా వ్యవసాయం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని భావిస్తున్నారా? ఐతే మీ కోసమే మంచి బిజినెస్ ఐడియా (Business Ideas)ను తీసుకొచ్చాం. ఖరీదైన పంటల్లో నల్ల జామ(Black Guava Farming) ఒకటి. నల్ల జామను సాగుచేస్తే.. రైతులకు భారీగా ఆదాయం వస్తుంది. అందువల్లే మనదేశంలో గత కొన్నేళ్లుగా నల్ల జామ సాగు బాగా పెరిగింది. తక్కువ ఖర్చుతోనే పంటను సాగుచేసి.. ఎంత మంది లక్షలు సంపాదిస్తున్నారు.

నల్లజామ చాలా వెరైటీగా ఉంటుంది. ఆకులతో పాటు పండులోని గుజ్జు కూడా ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఒక్కో పండు 100 గ్రాముల బరువు వరకు పెరుగుతుంది. చూసేందుకు కూడా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. శీతల ప్రాంతాల్లో చాలా బాగా పెరుగుతాయి. చీడ పీడల బాధ కూడా ఉండదు. ఎలాంటి వ్యాధులు కూడా సోకవు. నల్లజామ పండులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇందులో అవసరమైన పోషకాలు, యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో అతి పెద్ద లక్షణం ఏంటంటే.. ఇది వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేస్తుంది. ఇందులోని యాంటీ ఏజింగ్ గుణాలు.. యవ్వనంగా ఉండేందుకు దోహదపడతాయి. అందుకే మార్కెట్లో నల్ల జామ పండ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా రేటు కూడా బాగా వస్తోంది.

Vedanta: లక్ష రూపాయల ల్యాప్‌టాప్ రూ.40 వేలకే! ధరల భారీ తగ్గింపు!

బీహార్‌ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నల్ల జామ రకాన్ని సృష్టించారు. అనంతరం దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో కూడా దీనిని పండిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌, యూపీలోని పలు ప్రాంతాల్లో కూడా రైతులు ఈ పంటను సాగుచేస్తున్నారు. దేశంలో ఆకుపచ్చ, పసుపు రంగులో ఉండే జామకాయలు మాత్రమే మార్కెట్లో కనిపించేవి. కానీ ఇప్పడు పెద్ద పెద్ద నగరాల్లో ముదురు ఎరుపు రంగులో ఉండే జామ పండ్లు కూడా లభిస్తున్నాయి. మార్కెట్లో ఒక్కో పండు ధర రూ.50 వరకు పలుకుతోంది. మీరు కూడా ఈ పంటను పండిస్తే.. భారీగా ఆదాయం వస్తుంది. ఈ పంట సాగు గురించి మీ సమీపంలోని అగ్రికల్చర్ కాలేజీకి వెళ్లి అధికారులను సంప్రదిస్తే.. మరిన్ని వివరాలను అందజేస్తారు.

(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)

First published:

ఉత్తమ కథలు