BUSINESS GOLD PRICE MAY BREACH RS 65000 IN NEXT 12 MONTHS BUT JEWELLERY INDUSTRY HIT DUE TO PANDEMIC AND ITS AFTER EFFECTS MK
Gold Rate: కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత బంగారం ధర ఇదే...పసిడిప్రియులకు గుడ్ న్యూస్...
(ప్రతీకాత్మక చిత్రం)
కరోనా వ్యాధి తగ్గుముఖం పట్టిన తర్వాత మాత్రం బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పడతాయని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన యూరోపియన్ దేశాలు, అలాగే, అమెరికా తమ పసిడి నిల్వలను మార్కెట్లో విక్రయించేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థలో మందగమనం కారణంగా బంగారానికి వినియోగదారుల డిమాండ్ బాగా పడిపోయింది. దీంతో బంగారు ఆభరణాల రేటు గణనీయంగా తగ్గుతుందని ఆభరణాల పరిశ్రమ అభిప్రాయపడింది. కాని కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఏర్పడిన అనిశ్చితి కారణంగా భారతదేశం మరియు గ్లోబల్ బులియన్ మార్కెట్లలో బంగారం కొత్త రికార్డులను తాకుతూ పెరుగుతోంది. అయితే దీనికి కారణం లేకపోలేదు. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో పతనం దెబ్బకు సురక్షిత పెట్టుబడి ఎంపికగా బంగారం వైపు మదుపుదారుల దృష్టి పడింది. దీంతో మదుపుదారులు గోల్డ్ ఫ్యూచర్లపై విపరీతంగా పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో ఔన్స్ బంగారం వెల 2 వేల డాలర్ల సమీపంలో ట్రేడవుతున్నాయి. శుక్రవారం 2 వేల డాలర్ల స్థాయికి గోల్డ్ ఫ్యూచర్స్ పెరిగాయి. ఇక రిటైల్ మార్కెట్ విషయానికి వస్తే ముంబైలో బంగారం 10 గ్రాములకు 50,919 రూపాయలుగా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాములకు 51,946 రూపాయల స్థాయికి చేరుకుంది.
ప్రతీకాత్మకచిత్రం
ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ హౌస్‌హోల్డ్ కౌన్సిల్ (ఎఐఇజిజెడిసి) చైర్మన్ అనంత్ పద్మనాభన్ మాట్లాడుతూ “డిమాండ్ ఇప్పటికే మందగించింది. ఆర్థిక వ్యవస్థలో మందగమనం, నిరుద్యోగం, సామాజిక దూరం, కోవిడ్ -19 లాక్ డౌన్ కారణంగా, సాధారణ రోజులలో 20 నుండి 25 శాతం వ్యాపారం మాత్రమే జరుగుతోంద”ని వాపోయారు.
ధరలు తగ్గుదల కోసం జనం ఎదురుచూపులు...
ఇదిలా ఉంటే శ్రావణ మాసం, అలాగే రానున్న దసరా, దీపావళి ఫెస్టివల్స్ సందర్భంగా సాధారణంగా బంగారం కొనుగోళ్లు జోరందుకుంటాయి. అయితే లాక్ డౌన్ కారణంగా ఎక్కువగా వివాహాలు జరగడం లేదు. దీంతో ప్రజలు వివాహం కోసం కూడా షాపింగ్ చేయడం లేదని పద్మనాభన్ అన్నారు. బంగారం ధరల హెచ్చుతగ్గులు ఆగి స్థిరంగా ఒక రేటు వద్ద కొనసాగినప్పుడు మాత్రం కొనుగోలు చేయాలని, ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు.
ప్రపంచ బంగారు మండలి (డబ్ల్యుజిసి) మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా) సోమసుందరం పిఆర్ మాట్లాడుతూ బంగారం ధర రూ .50 వేలకు మించి ఉండటం ఒక కీలక పరిణామమే...అయితే బంగారంపై పెట్టుబడి పెట్టిన వారు సంతోషంగా ఉన్నారు. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. 2019 జనవరి నుండి బంగారం ధరలు 60 శాతం పెరిగాయి. ఇది ఆగస్టు, 2019 నుండి బంగారం చాలా లాభపడింది. డాలర్ ఆల్-టైమ్ గరిష్టాన్ని దాటనప్పటికీ, బంగారం దాని ఆల్-టైమ్ హై వద్ద ఉంది.
(ప్రతీకాత్మక చిత్రం)
ఇదిలా ఉంటే సరిగ్గా ఏడాది క్రితం ఇదే నెలలో బంగారం ధర ఎంత ఉన్నా కొనడం మానొద్దని ప్రముఖ ఇన్వెస్టర్ మార్క్ మొబియస్ స్పష్టం చేశారు. భవిష్యత్‌లో అన్ని లాభాలు ఉంటాయని స్పష్టం చేశారు. క్రిప్టోకరెన్సీల దూకుడు పెరుగుతున్నా, వాటిని నమ్మలేమని చెప్పారు. బంగారంపై పెట్టుబడులు మేలని మొబియస్ స్పష్టం చేశారు. పెట్టుబడుల్లో కనీసం పదిశాతమైన విలువైన లోహాల కొనుగోలుకు కేటాయించాలని ఆయన సూచించారు. అయితే ఇప్పుడు ఆయన మాట నిజం అయ్యింది. సరిగ్గా ఏడాది క్రితం బంగారం తులం 35 వేలుగా ఉంటే ప్రస్తుతం అది రూ. 50 వేలు దాటింది. అంటే లక్ష పెట్టుబడి పెడితే సుమారు రూ. 50 వేల దాకా లాభం వచ్చేది.
కోవిడ్ -19 దృష్టాంతంలో వినియోగదారుల డిమాండ్ తక్కువగా ఉందని పూణే ప్రధాన కార్యాలయ ఆభరణాల బ్రాండ్ పిఎన్ గాడ్గిల్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సౌరభ్ గాడ్గిల్ అన్నారు. ప్రజలు బంగారానికి సంబంధించిన చిన్న వస్తువులను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అయితే, పెట్టుబడి కోణం నుంచి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ సమయంలో బంగారం పెట్టుబడిదారులలో సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా మిగిలిందని ఆయన అన్నారు.
(ప్రతీకాత్మక చిత్రం)
బంగారం 65 వేల రూపాయలకు చేరుతుంది
కోవిడ్ -19 సంక్షోభం మరియు అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కారణంగా రాబోయే 12 నెలల్లో బంగారం మరింత పెరుగుతుందని గాడ్గిల్ అంటున్నారు. "రాబోయే 12 నెలల్లో దేశీయ మార్కెట్లో బంగారం 10 గ్రాములకు 65,000 రూపాయల స్థాయిలో ఉంటుందని తాము అంచనా వేస్తున్నామని. అంతర్జాతీయ మార్కెట్లో, ఔన్స్ బంగారం 2,500 డాలర్లను తాకుతుందని అంచనా వేశారు.
(ప్రతీకాత్మక చిత్రం)
కరోనా వ్యాక్సిన్ వస్తే బంగారం ధర ఇదే...
కరోనా వ్యాధి తగ్గుముఖం పట్టిన తర్వాత మాత్రం బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పడతాయని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన యూరోపియన్ దేశాలు, అలాగే, అమెరికా తమ పసిడి నిల్వలను మార్కెట్లో విక్రయించేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే కనుక జరిగితే భారత్, చైనా లో పసిడి డిమాండ్ పెరిగే చాన్స్ ఉందని, అప్పుడు ధరలు దిగివస్తాయని అంతా అంచనా వేస్తున్నారు. అయితే ఇదంతా జరగాలంటే కరోనా వ్యాక్సిన్ ఎంత త్వరగా వస్తే అంత మంచిదని అంచనా వేస్తున్నారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.