BURGER MAKER SOLD HIS HOUSE AND INVESTED MONEY IN CRYPTO NOW HE IS RICHER THAN MARK ZUCKERBERG MK
Changpeng Zhao: ఇల్లు అమ్మేసి..బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టిన..బేకరీ ఉద్యోగి...నేడు ప్రపంచ కుబేరుల్లో ఒకడు...
Changpeng Zhao
మెక్ డొనాల్డ్ అనే బర్గర్లు తయారు చేసే కంపెనీలో ఉద్యోగి క్రిప్టో మార్కెట్లో ప్రవేశించి ప్రపంచ కుబేరుల సరసన చేరాడు. తాను ఉంటున్న సొంత ఇంటిని సైతం అమ్మేసి క్రిప్టో మార్కెట్లోకి ప్రవేశించిన ఆ యువకుడు ఈ రోజు గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్, ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ కన్నా కూడా ధనవంతుడు అయ్యాడు. అతడు మరెవరో కాదు మెక్‌డొనాల్డ్ ఉద్యోగి చాంగ్‌పెంగ్ జావో (Changpeng Zhao).
క్రిప్టో కరెన్సీ రాత్రి రాత్రే కుబేరులను చేసేస్తోంది. అంతేకాదు ఇందులో పెట్టుబడి పెట్టిన మదుపరులకు కళ్లు బైర్లు కమ్మే లాభాలు ముట్టచెబుతోంద. దశాబ్దాల తరబడి వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకున్న వాళ్లు సైతం క్రిప్టో కరెన్సీ పుణ్యమా అని నెలల వ్యవధిలోనే అపర కుబేరులు అవుతున్నారు. తాజాగా మెక్ డొనాల్డ్ అనే బర్గర్లు తయారు చేసే కంపెనీలో ఉద్యోగి క్రిప్టో మార్కెట్లో ప్రవేశించి ప్రపంచ కుబేరుల సరసన చేరాడు. తాను ఉంటున్న సొంత ఇంటిని సైతం అమ్మేసి క్రిప్టో మార్కెట్లోకి ప్రవేశించిన ఆ యువకుడు ఈ రోజు గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్, ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ కన్నా కూడా ధనవంతుడు అయ్యాడు. అతడు మరెవరో కాదు మెక్‌డొనాల్డ్ ఉద్యోగి చాంగ్‌పెంగ్ జావో (Changpeng Zhao). బినాన్స్ క్రిప్టో కరెన్సీ వ్యవస్థాపకుడు అయిన జావో సంపద 96 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. Binance కాయిన్ గత సంవత్సరం దాదాపు 1,300 శాతం పెరిగింది.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో గత నెలలో, అతని పేరు అపర కుబేరుల జాబితాలో కనిపించింది. ఈయన గతంలో మెక్‌డొనాల్డ్స్‌లో బర్గర్ ఫ్లికర్ సాఫ్ట్వేర్ డెవలపర్ గా పనిచేశాడు. అయితే ప్రస్తుతం కెనడా పౌరసత్వం కలిగి ఉన్న జావో (Changpeng Zhao), చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో జన్మించాడు. అతని తండ్రి యూనివర్సిటీలో ప్రొఫెసర్. 12 సంవత్సరాల వయస్సులో, జావో తన కుటుంబంతో కెనడాకు పయనమయ్యాడు.
క్రిప్టో ప్రపంచంలో జావోని CZ అని పిలుస్తారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లి అబుదాబి రాజకుటుంబంతో జావో సమావేశమై పార్టీలు చేసుకోవడమే కాదు. దుబాయ్‌లో ఓ అపార్ట్మెంట్ మొత్తం కొనేశాడు. అదే సమయంలో, జావో సంపద 96 బిలియన్ డాలర్లు దాటేసింది.(Binance)
క్రిప్టోలో పెట్టుబడి పెట్టడానికి అపార్ట్మెంట్ అమ్మేశాడు..
జావో క్రిప్టో ప్రయాణం 2013 స్టార్ట్ అయ్యంది. డబ్బు సంపాదించడానికి జావో 2013లో BTC చైనా అప్పటి CEO బాబీ లీ , రాన్ కావోతో షాంఘైలో ఓ స్నేహపూర్వక భేటీ ద్వారా ప్రారంభం అయ్యింది. వారి నికర విలువలో 10% బిట్‌కాయిన్‌లో పెట్టమని జావో వారిద్దరినీ ప్రోత్సహించాడు. కొంతకాలం దానిని అధ్యయనం చేసిన తరువాత, అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు , బిట్‌కాయిన్ లో పెట్టుబడి కోసం తన అపార్ట్మెంట్ సైతం విక్రయించాడు.
2017లో జావో బినాన్స్ని స్థాపించాడు , అది త్వరలోనే క్రిప్టో పవర్ హౌస్‌గా మారింది. జావో తన చేతిపై కంపెనీ లోగోను కూడా టాటూగా వేయించుకున్నాడు. బినాన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయనున్నాడు అనే అంశంపై త్వరలో ప్రకటన వెలువడుతుందని జావో నవంబర్‌లో తెలిపారు. ఆఫ్‌షోర్ , పన్ను ఆదాకు ప్రసిద్ధి చెందిన కేమాన్ దీవులలో ఏర్పాటు చేస్తున్నామని సంస్థ తన చట్టపరమైన ఫైలింగ్ లో పేర్కొంది.
బైనాన్స్ టెస్లా , అమెజాన్లను అధిగమించవచ్చు
నవంబర్‌లో వాల్ స్ట్రీట్ జర్నల్ జావో సంస్థ నికర విలువ 300 బిలియన్ డాలర్లు దాటవచ్చని పేర్కొంది. అంటే టెస్లా వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ , అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌లను జావో అధిగమించగలడు. మస్క్ 282 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నారు. బెజోస్ 192 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.