Amazon: అమెజాన్ ఫెస్టివల్ సేల్​లో ట్రూ వైర్​లెస్​ ఇయర్​బడ్స్​పై బంపరాఫర్​​.. రూ.10 వేలలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్​పై ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం (image: Nothing)

టీడబ్ల్యూఎస్​ ఇయర్‌ బడ్స్, స్పీకర్లు, మరిన్ని ఆడియో ఉత్పత్తులపై అమెజాన్ డీల్స్, డిస్కౌంట్‌లను అందిస్తోంది. రూ. 10 వేలలోపు లభిస్తున్న ఏఎన్​సీ ఇయర్‌ బడ్స్‌పై ఓ లుక్కేయండి.

  • Share this:
ఈ కామర్స్​ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Amazon great Indian Festival ) సేల్​ను అక్టోబర్ 3 (October 3)న ప్రారంభించింది. నెల రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సేల్ (sale) నవంబర్ 3 వరకు కొనసాగనుంది. ఈ సేల్​లో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్ (Electronic) ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు (discounts) అందిస్తోంది. మరోవైపు, TWS ఇయర్‌బడ్స్ (ear buds), స్పీకర్లు, మరిన్ని ఆడియో ఉత్పత్తులపై అమెజాన్ డీల్స్, డిస్కౌంట్‌లను కూడా అందిస్తోంది. రూ. 10 వేలలోపు లభిస్తున్న ఏఎన్​సీ ఇయర్‌బడ్స్‌ ANC earbuds)పై ఓలుక్కేయండి.

సోనీ WF-XB700

ఆడియో ఉత్పత్తుల విషయంలో సోనీ (Sony) అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా కొనసాగుతోంది. అమెజాన్​ ఫెస్టివల్​ సేల్​లో సోనీ WF-XB700పై డిస్కౌంట్ (discount)​ పొందవచ్చు. దీని అసలు ధర రూ .12,999 వద్ద ఉండగా.. అమెజాన్‌ (Amazon)లో దీన్ని రూ. 6,039 వద్ద కొనుగోలు (buy) చేయవచ్చు. అదనంగా, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు (axis bank credit card)తో కొనుగోలుపై రూ .1500 తగ్గింపు కూడా పొందవచ్చు. సోనీ WB-XB700 నాణ్యమైన సౌండ్​ అవుట్​పుట్​ అందిస్తుంది. WF-XB700లో 12mm డ్రైవర్ యూనిట్‌తో కూడిన WF-XB700ను అమర్చింది. ఈ సోనీ ఇయర్​ఫోన్లు IPX7 డస్ట్​, వాటర్​ రెసిస్టన్స్​ కలిగి ఉంటాయి. వీటిని జిమ్ (gym) చేసే సమయంలో, ఈత కొట్టేటప్పుడు (swimming) కూడా ధరించవచ్చు.

జబ్రా ఎలైట్ 75 టి

ఉత్తమ ఏఎన్​సీ ఇయర్‌ఫోన్​ (ANC earphone)ను కొనాలనుకునే వారికి జాబ్రా ఎలైట్ 75 టి ఒకటి. ఈ ట్రూ వైర్​లెస్​ ఇయర్‌బడ్స్​ (true wireless earbuds) 50 శాతం తగ్గింపుతో వస్తుంది. దీని అసలు ధర రూ .15,999 వద్ద ఉండగా.. ఇప్పుడు అమెజాన్ ఫెస్టివల్​ సేల్​లో రూ .7999 వద్ద కొనుగోలు చేయవచ్చు. రూ. 10 వేలలోపు ఇవి బెస్ట్​ ఇయర్​ఫోన్లు (best earphones)గా చెప్పవచ్చు.ఈ ఇయర్‌ఫోన్లు క్వాలిటీ సౌండ్ (quality sound)​, బ్యాటరీ లైఫ్​తో వస్తాయి. ఏఎన్​సీని ప్రారంభించడానికి సౌండ్+ యాప్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది.

సెన్‌హైజర్ CX 400BT

అమెజాన్‌ ఫెస్టివల్​ సేల్​లో సెన్‌హైజర్ CX 400BT స్మార్ట్​ఫోన్​ (smart phones)పై భారీ డిస్కౌంట్​ అందిస్తోంది. దీని అసలు ధర రూ .16,990 వద్ద ఉండగా.. రూ. 8990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అదనంగా, 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా రూ. 450 అదనపు డిస్కౌంట్ (additional discount)​ లభిస్తుంది. ఈ ఇయర్‌ఫోన్లలో 7mm డైనమిక్ డ్రైవర్లు, మెరుగైన సౌండ్ క్వాలిటీ (sound quality) కోసం ఎస్​బీసీ, ఏఏసీ, ఆప్ట్​ ఎక్స్​ వంటి సపోర్ట్ ఫీచర్ల (support features)ను అందించింది.

ఇవి కూడా చదవండి:  ఆన్‌లైన్‌లో డబ్బులు పోగొట్టుకున్నారా? 10 రోజుల్లో వెనక్కి పొందొచ్చు ఇలా


జీవిత కాల కనిష్ఠానికి తగ్గిన గృహ రుణాలపై వడ్డీ రేట్లు... ఏ బ్యాంకులో ఎంతో తెలుసుకోండి


చైనా హైపర్‌సోనిక్ గ్లైడ్ క్షిపణి ప్రయోగం..? అంతరిక్ష రంగంలో ఆధిపత్యమే లక్ష్యంగా డ్రాగన్​ దూకుడు

Published by:Prabhakar Vaddi
First published: