Discount On Cars In Rural Areas: కారు కొంటున్నారా...అయితే పది వేల డిస్కౌంట్ పొందండిలా...

ప్రతీకాత్మకచిత్రం

రుతుపవనాలు సక్రమంగా రావడంతో వర్షపాతం ఈ సంవత్సరం చక్కగా నమోదైంది. అంతే కాదు, బ్యాంకుల అందిస్తున్న చౌక రుణాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల నుంచి కార్ల విక్రయాలు పెరిగినట్లు ఆటో పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

  • Share this:
    రుతుపవనాలు సక్రమంగా రావడంతో వర్షపాతం ఈ సంవత్సరం చక్కగా నమోదైంది. అంతే కాదు, బ్యాంకుల అందిస్తున్న చౌక రుణాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల నుంచి కార్ల విక్రయాలు పెరిగినట్లు ఆటో పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఫెస్టివల్ సీజన్ సందర్భంగా పండుగల సందర్భంగా ఇటీవల కార్ల విక్రయాలు 10-15 శాతం స్థాయిలో పుంజుకున్నట్లు తెలియజేశాయి. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామాల నుంచి డిమాండ్‌ అధికంగా కనిపిస్తున్నట్లు వెల్లడించాయి. గ్రామ ప్రాంతాల నుంచి తొలిసారి కార్లు కొంటున్నవారి వాటా 5 శాతం పెరిగి 54 శాతాన్ని తాకింది. పట్టణాలలో అయితే ఈ సంఖ్య 48 శాతానికి చేరింది. ప్రధానంగా ఈకో వ్యాన్లు, ఆల్టో, వ్యాగన్‌ ఆర్ వంటి చిన్న కార్లకు డిమాండ్‌ పెరిగింది.

    అయితే కరోనా లాక్ డౌన్ తర్వాత కార్ల కంపెనీలు అమ్మకాలు పెంచుకోవడానికి వాహన కంపెనీలు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించాయి. కరోనా కల్లోలం కారణంగా పట్టణ మార్కెట్, పట్టణాల ఆర్థిక స్థితిగతులు కుదేలు అయ్యాయి. అయితే గ్రామాల్లో కరోనా ప్రభావం పెద్దగా లేకపోవడం, గ్రామీణ ఆర్థిక స్థితిగతులపై కరోనా ప్రభావం తక్కువగానే ఉండటంతో అటు ఆటోమొబైల్ కంపెనీల అమ్మకాలు పెంచుకోవడానికి పల్లెబాట పట్టాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఆకర్షించడానికి మొబైల్‌ షోరూమ్స్‌ ఏర్పాటు చేశారు. రూరల్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు పెంచుకోవడానికి, కొత్త కొత్త మార్కెటింగ్‌ వ్యూహాలు అమలు చేయడానికి టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీలకు ఆయా గ్రూప్‌కంపెనీల తోడ్పాటు ఇతోధికంగా ఉపయోగపడింది.

    గ్రామీణ ప్రాంతాల్లో కార్లు కొనుగోలు చేసిన వారికి ప్రత్యేకంగా కార్పోరేట్ డిస్కౌంట్ తరహాలో డిస్కౌంట్ ఇచ్చేందుకు సైతం కార్ల కంపెనీలు ముందుకు వస్తున్నాయి. అంతేకాదు రెనాల్ట్ సంస్థ ట్రైబర్ మోడల్ కార్లు కొనుగోలు చేస్తే రూరల్ కస్టమర్స్ కు ప్రత్యేకంగా10 వేల రూపాయల కార్పోరేట్ డిస్కౌంట్ అందిస్తోంది.

    మరిన్ని వీడియోల కోసం సబ్ స్క్రయిబ్ చేయండి...



    గ్రామీణ ప్రాంతాల్లో అమ్ముడయ్యే టాప్ 10 కార్లు ఇవే...
    Alto 800 - Rs. 2.94 – 4.36 Lakh*
    Tata Tiago - Rs. 4.6 – 6.6 Lakh*
    Mahindra Bolero - Rs. 7.98 – 8.99 Lakh*
    Hyundai i10 - Rs. 5.89 – 5.99 Lakh*
    Scorpio - Rs. 12.39 – 15.99 Lakh*
    Maruti Swift - Rs. 5.19 – 8.02 Lakh*
    Ford Ecosport - Rs. 8.04 – 11.58 Lakh*
    Datsun Go - Rs. 3.99 – 6.45 Lakh*
    Renault Kwid - Rs. 2.92 – 5.01 Lakh*
    Tata Tigor - Rs. 5.75 – 7.49 Lakh*
    Published by:Krishna Adithya
    First published: