కొన్ని రోజుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) లోక్‌సభలో బడ్జెట్ 2023 (Budget 2023) ప్రవేశపెట్టున్నారు. భారత ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలు ఈ బడ్జెట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నాయి. ఫుడ్, బెవరేజెస్ ఇండస్ట్రీ కూడా ప్రభుత్వం నుంచి కొన్ని రకాల నిర్ణయాల కోసం ఎదురుచూస్తోంది. ఈ రంగానికి చెందిన నిపుణులు సమకాలీన అవసరాలను, బడ్జెట్‌లో చేర్చాల్సిన డిమాండ్‌లు తెలియజేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ లిమిటెడ్ (మెక్‌డొనాల్డ్స్ ఇండియా W&S) వైస్ చైర్మన్ అమిత్ జటియా న్యూస్18తో మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి పునరుద్ధరణ, వినియోగం పెరుగుదల ద్వారా క్విక్ సర్వీస్ రెస్టారెంట్(QSR) ఇండస్ట్రీ లాభపడిందన్నారు. QSR పరిశ్రమ రాబోయే యూనియన్ బడ్జెట్‌లో ఆర్థిక పునరుద్ధరణను ట్రాక్‌లో ఉంచే విధానాలను ఆశిస్తోందని చెప్పారు. పరిశ్రమ రంగం వృద్ధిని పెంచడంలో సహాయపడటానికి ITC (ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్)లో కొంత ఉపశమనాన్ని కలిగించాలని సూచించారు.
* జీఎస్టీ ఇలా..
ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా రెస్టారెంట్‌లపై ప్రస్తుతం 5% GST ఉందని జాటియా తెలిపారు. ఇది రెస్టారెంట్, ఫుడ్ ఇండస్ట్రీకి డిసడ్వాంటేజ్ అన్నారు. ఇతర రంగాలు ఇన్‌పుట్ క్రెడిట్‌ను తిరిగి పొందుతాయని, ఫుడ్ ఇండస్ట్రీ మాత్రమే GST ఇన్‌పుట్‌కు బాధ్యత వహించే ఏకైక పరిశ్రమగా మిగిలిందని పేర్కొన్నారు. కొన్ని ముడి పదార్థాలపై ఇంపోర్ట్ లిబరలైజేషన్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్యలు తీసుకుంటే పరిశ్రమ వృద్ధికి మరింత దోహదపడతాయని వివరించారు.
బారిస్టా కాఫీ కంపెనీ సీఈఓ రజత్ అగర్వాల్ కూడా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను తిరిగి ప్రవేశపెట్టాలని సూచించారు. ఇన్‌పుట్ క్రెడిట్ అందుబాటులో లేకపోవడమే F&B పరిశ్రమకు అతిపెద్ద నష్టమని అన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్పెషల్ ఇన్‌సెంటివ్ స్కీమ్స్, ఈజీ క్రెడిట్ ఎకో సిస్టమ్ తీసుకురావాలిన అగర్వాల్ చెప్పారు.
* మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి
ది హెల్త్ ఫ్యాక్టరీ వ్యవస్థాపకుడు, CEO వినయ్ మహేశ్వరి మాట్లాడుతూ.. దేశం అభివృద్ధికి మొత్తం F&B రంగం చాలా అవసరమని చెప్పారు. ప్రభుత్వం ఈ రంగాన్ని 2023-24కి రాబోయే యూనియన్ బడ్జెట్‌లో అగ్రస్థానంలో ఉంచడం చాలా అవసరమని తెలిపారు. ఆహార, పానీయాల ప్రాసెసింగ్ రంగానికి మద్దతు ఇవ్వడానికి MSME ఇంక్యుబేటర్ పథకం కింద నిధులను పెంచాలన్నారు. సప్లై చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రభావితం చేయడానికి PM గతి శక్తి ప్రాజెక్ట్‌ని ఉపయోగించి MSME రంగాన్ని అనుసంధానించే చర్యలను తీసుకోవాలిన కోరారు.
* ఖర్చుల భారం తగ్గించాలి
సమోసా సింగ్ సహ-వ్యవస్థాపకుడు శిఖర్ వీర్ సింగ్ మాట్లాడుతూ.. ‘లాక్‌డౌన్ ప్రభావం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. పాండమిక్ కారణంగా ఫుడ్ స్టార్టప్‌లు తమ వ్యాపార ప్రణాళికలను పునఃపరిశీలించడం, కస్టమర్ ప్రాధాన్యతలు, తగ్గిన డిమాండ్, సరఫరా, ఆందోళనలను ఉత్తమంగా పరిష్కరించడానికి అనేక మార్పులు చేయాల్సి వచ్చింది.
తమ వ్యాపారాల నిర్వహణ, కార్యకలాపాలను తిరిగి మూల్యాంకనం చేయవలసి వచ్చింది. రాబోయే బడ్జెట్ పెరుగుతున్న ఖర్చులు, తగ్గిన మార్జిన్ల దృష్ట్యా కొన్ని సడలింపులను అందిస్తుందని ఆశిస్తున్నాం. వినియోగదారుల ప్రాధాన్యతలు, కొనుగోలు విధానాలలో మార్పు, పెరుగుతున్న వ్యయాలు, ద్రవ్యోల్బణం, ఆన్‌లైన్ డెలివరీలు, మహమ్మారి ప్రేరేపిత మార్పుల నుంచి బయటపడేలా GST శాతం, నిబంధనలలో కొన్ని సడలింపులు మేలు చేస్తాయి.’ అని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget 2023, Food, Hotels