హోమ్ /వార్తలు /బిజినెస్ /

Budget 2023: బడ్జెట్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కోసం భారీగా నిధులు.. ఈ సారి ఏకంగా రూ.10 లక్షల కోట్లు..

Budget 2023: బడ్జెట్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కోసం భారీగా నిధులు.. ఈ సారి ఏకంగా రూ.10 లక్షల కోట్లు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Budget 2023: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 కేంద్ర బడ్జెట్‌(Union Budget)ను పార్లమెంట్‌లో తాజాగా ప్రవేశపెట్టారు. ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడానికి తాజా బడ్జెట్‌లో ఖర్చులను పెంచే ప్రణాళికలను ప్రకటించారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 కేంద్ర బడ్జెట్‌(Union Budget)ను పార్లమెంట్‌లో తాజాగా ప్రవేశపెట్టారు. ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడానికి తాజా బడ్జెట్‌లో ఖర్చులను పెంచే ప్రణాళికలను ప్రకటించారు. ఆమె తాజా ప్రసంగం ప్రకారం, ఈసారి బడ్జెట్‌లో లాంగ్-టర్మ్ ఆస్తులపై ఖర్చు చేసే మూలధన పెట్టుబడి (Capital Investment/Capital expenditure) కోసం రూ.10 లక్షల కోట్లు కేటాయించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈ మూలధన పెట్టుబడి 33% పెరిగింది. ఇలా పెంచడం వరుసగా మూడో ఏడాది జరుగుతోంది.

ఇది 2019-20లో చేసిన వ్యయం కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ఈ రూ.10 లక్షల కోట్లు మన జీడీపీలో 3.3%కి సమానం కావడం విశేషం. క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఈ పెరుగుదల వృద్ధి, ఉద్యోగ కల్పనను పెంచుతుంది. ఈ బడ్జెట్‌లో భారత ప్రభుత్వం క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌పై ఖర్చు చేసే మొత్తం (Effective capital spending) రూ.13.7 లక్షల కోట్లుగా అంచనా వేసింది. ఈ మొత్తం దేశ జీడీపీలో 4.5%కి సమానం.

అలానే రాష్ట్ర ప్రభుత్వాలకు 50 ఏళ్ల రుణాల రూపంలో మూలధన పెట్టుబడులకు మద్దతును ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఈ మద్దతు రాష్ట్రాలు తమ సొంత రోడ్లు, హైవేలు, రైల్వేలతో సహా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టడానికి, తమ ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచడంలో, ఉద్యోగాలను సృష్టించడానికి సహాయపడుతుంది. కోవిడ్-19 ప్రభావం తర్వాత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి ఉద్దేశించిన మునుపటి బడ్జెట్లకు అనుగుణంగా ఈసారి క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌ను పెంచడం జరిగింది.

* మాలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం

సాధారణంగా రోడ్లు, నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తాయి, ఉపాధి అవకాశాలను పెంచుతాయి. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు రియల్ ఎస్టేట్, మ్యానుఫ్యాక్చరింగ్, ఉక్కు వంటి ఇతర పరిశ్రమలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.

మూలధన వ్యయం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (MSMEs) నుంచి సేవలు, మ్యానుఫ్రాక్చర్డ్‌ ఇన్‌పుట్లకు డిమాండ్‌ను సృష్టిస్తుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల విభాగం GDPలో 8% వాటాను కలిగి ఉంది. అలానే 4 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ అతిపెద్ద ఉపాధి వనరుగా ఉంది. వృద్ధి సామర్థ్యాన్ని, ఉద్యోగాల కల్పనను పెంచేందుకు వరుసగా మూడేళ్లపాటు మూలధన వ్యయాన్ని పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.

ఇది కూడా చదవండి :  PM VIKAS, PM విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ ప్రారంభం.. వివిధ రాష్ట్రాల్లో ఈ వర్గం కిందకు వచ్చేది వీరే..

* దీర్ఘకాలంలో ప్రయోజనాలు

మూలధన పెట్టుబడుల కోసం బడ్జెట్‌ను పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రైవేట్ కంపెనీలు రోడ్లు, హైవేలు, రైల్వేలు వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పాల్గొనేందుకు అవకాశాలు పెరుగుతాయి. ఇది ప్రైవేట్ కంపెనీల అభివృద్ధికి దోహదపడే అవకాశాన్ని అందిస్తుంది.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులతో పాటు తాగునీరు, గృహనిర్మాణం వంటి సామాజిక సంక్షేమ రంగాలకు కూడా ప్రభుత్వం 2022-23లో రూ.48,000 కోట్లు కేటాయించింది. ఈ కేటాయింపులు ఈ రంగాలలో అవకాశాలను సృష్టిస్తాయి. ప్రజల క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది. మొత్తంమీద, మూలధన పెట్టుబడి కోసం పెరిగిన బడ్జెట్ ప్రైవేట్ కంపెనీలు, సాంఘిక సంక్షేమ రంగాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

First published:

Tags: Budget 2023, Central Government, Nirmala sitharaman

ఉత్తమ కథలు