హోమ్ /వార్తలు /బిజినెస్ /

Budget 2023: పర్యాటక ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్.. 50 టూరిస్ట్ డెస్టినేషన్స్ అభివృద్ధి..

Budget 2023: పర్యాటక ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్.. 50 టూరిస్ట్ డెస్టినేషన్స్ అభివృద్ధి..

Budget 2023: పర్యాటక ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్.. 50 టూరిస్ట్ డెస్టినేషన్స్ అభివృద్ధి..

Budget 2023: పర్యాటక ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్.. 50 టూరిస్ట్ డెస్టినేషన్స్ అభివృద్ధి..

Budget 2023: పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. తద్వారా అనుబంధ రంగాలకు కూడా మేలు జరుగుతుందని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman). తద్వారా అనుబంధ రంగాలకు కూడా మేలు జరుగుతుందని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని బడ్జెట్ (Budget) ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ రోజు పార్లమెంటులో 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆమె ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌ ప్రసంగంలో భాగంగా, దేశంలోని పర్యాటక అభివృద్ధి గురించి మాట్లాడారు. దేశంలో మొత్తం 50 టూరిస్ట్ డెస్టినేషన్లను సెలక్ట్ చేసి, మిషన్‌ మోడ్‌ ప్రాజెక్టుగా వాటిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగవ్వడానికి టూరిస్ట్‌ డెస్టినేషన్లు ఎంతో సహకరిస్తాయని చెప్పారు. అందుకే పబ్లిక్‌, ప్రైవేట్‌ పార్ట్నర్‌షిప్‌తో ఈ రంగ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

* 50 డెస్టినేషన్ల ఎంపిక

ఇన్నోవేటివ్‌ అప్రోచ్‌తో దేశంలో ప్రధాన ఆకర్షణలుగా ఉన్న దాదాపు 50 పర్యాటక ప్రాంతాలను ఛాలెంజ్‌ మోడ్‌ ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో వాటిని ప్రమోట్‌ చేస్తామన్నారు. వాటికి ఫిజికల్‌ కనెక్టివిటీ, వర్చువల్ కనెక్టివిటీ, టూరిస్ట్ గైడ్స్, పుడ్‌ స్ట్రీట్స్, పర్యాటకుల భద్రత.. లాంటి అన్ని విషయాలనూ ఒక ప్యాకేజీలా తీసుకుని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు.

మన దేశంలో దేశీయ పర్యాటకులతో పాటు విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షించే టూరిస్ట్‌ డెస్టినేషన్లు చాలా ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఉద్యోగాల కల్పన, వ్యాపారాల విస్తరణకు ఈ ప్రాంతాల్లో చాలా స్కోప్‌ ఉంటుందన్నారు. ఈ అవకాశాలను స్థానిక యువత అందిపుచ్చుకోవచ్చని చెప్పారు.

* యూనిటీ మాల్స్‌ ఏర్పాటుకు ప్రోత్సాహం

ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ ‘యూనిటీ మాల్‌’ ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తామని నిర్మల తెలిపారు. అక్కడ ‘వన్‌ డిస్ట్రిక్ట్‌.. వన్‌ ప్రొడక్ట్‌’ పథకం ద్వారా ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఉత్పత్తులు, హ్యాండీ క్రాఫ్ట్స్‌ తదితరాలు అందుబాటులో ఉంటాయని, ఆ రాష్ట్ర టూరిజంకి సంబంధించిన విషయాలన్నీ అక్కడ పొందుపరుస్తామని తెలిపారు.

టూరిజం రంగానికి ప్రోత్సాహకాలు ప్రకటించడంతో హాస్పిటాలిటీ సెక్టార్ కూడా హర్షం వ్యక్తం చేస్తోంది. రకరకాల వైవిద్యాలు, అందమైన ప్రకృతి, భిన్న సంసృతులు ఉన్న భారతదేశంలో టూరిజం అభివృద్ధికి చాలా స్కోప్‌ ఉంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం దానిపై అంతగా దృష్టి సారించలేదు. ప్రస్తుత బడ్జెట్‌లో మాత్రం దీనిపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు ఉందని లెమన్‌ ట్రీ, ఈఐహెచ్‌ లాంటి పెద్ద హోటల్‌ కంపెనీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి : సింగిల్ బిజినెస్ ఐడీగా పాన్‌కార్డు.. వ్యాపార అవసరాలకు ఇది ఒక్కటి చాలు..

ప్రస్తుతం కోవిడ్‌ 19 దుష్ప్రభావాల నుంచి కొద్దిగా తేరుకున్న పరిస్థితులు ఉన్నాయని అవి పర్యాటక రంగ పునరుద్ధరణకు సంకేతాలు చూపుతున్నాయని ఆర్థిక సర్వేలో కేంద్రం వెల్లడించింది. కోవిడ్‌ నిబంధనల సడలింపు, అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించడంతో కొత్త ఆర్థిక సంవత్సరంలో విదేశీ పర్యాటకుల రాక పెరిగే అవకాశాలున్నాయని తెలిపింది.

First published:

Tags: Budget 2023, Central Government, Nirmala sitharaman, Taj Mahal

ఉత్తమ కథలు