హోమ్ /వార్తలు /బిజినెస్ /

Mahila Samman Saving Certificate: మహిళలకు కేంద్రం అదిరే శుభవార్త.. కొత్త స్కీమ్ ప్రకటన!

Mahila Samman Saving Certificate: మహిళలకు కేంద్రం అదిరే శుభవార్త.. కొత్త స్కీమ్ ప్రకటన!

కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి వరాలు

కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి వరాలు

Union Budget 2023 | కేంద్ర ప్రభుత్వం మహిళలకు అదిరిపోయే స్కీమ్ తీసుకువచ్చింది. రూ . 2 లక్షల దాకా ఇన్వెస్ట్ చేసే ఫెసిలిటీ కల్పించింది. ఈ స్కీమ్‌పై అదిరిపోయే వడ్డీ అందుబాటులో ఉంచింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Nirmala Sitharaman | మహిళలకు మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త అందించింది. వీరి కోసం ప్రత్యేకమైన స్కీమ్ తీసుకువచ్చింది. సేవింగ్ సర్టిఫికెట్ పథకాన్ని ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. వడ్డీ రేటు 7.5 శాతం. అంతేకాకుండా ఈ స్కీమ్‌లో చేరిన వారు పాక్షిక విత్‌డ్రాయెల్ ఫెసిలిటీ కూడా పొందొచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రూ.2 లక్షల వరకు డబ్బులు దాచుకోవచ్చు. రెండేళ్ల పాటు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఇంకా సీనియర్ సిటిజన్స్‌కు ఊరట కలిగించే నిర్ణయం కూడా తీసుకున్నారు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఇన్వెస్ట్‌మెంట లిమిట్‌ను పెంచుతున్నట్లు ప్రకటించారు. దీన్ని రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంచారు.

అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కూడా అధిక ప్రాధాన్యం ఇచ్చింది. అగ్రికల్చర్ యాసిలరేటర్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అగ్రి స్టార్టప్స్‌ను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. యంగ్ ఎంట్రప్రెన్యూర్స్‌ను ప్రోత్సహించడం కోసం ఈ ఫండ్‌ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో అగ్రి స్టార్టప్స్ ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మలా సీతారమన్ తెలిపారు.

రైతులకు శుభవార్త.. భారీగా రుణాలు, బడ్జెట్‌లో కేంద్రం కీలక ప్రకటన!

ఇంకా అగ్రికల్చర్ క్రెడిట్ టార్గెట్‌ను పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రూ. 20 లక్షల కోట్ల టార్గెట్‌ను నిర్దేశించుకున్నట్లు తెలిపారు. గత బడ్జెట్‌లో ఈ క్రెడిట్ టార్గెట్ రూ. 18 లక్షల కోట్లుగా ఉంది. అంటే ఈసారి దాదాపు క్రెడిట్ టార్గెట్ 11.11 శాతం మేర పెరిగిందని చెప్పుకోవచ్చు. వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇదే కావడం గమనార్హం.

కేంద్రం గుడ్ న్యూస్.. అకౌంట్‌లోకి ఉచితంగా రూ.లక్ష, ఇలా చేస్తే చాలు, ఒక్క రోజే ఛాన్స్!

సమ్మిళిత వృద్ధి, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్ఛర్ ఫర్ అగ్రికల్చర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్‌మెంట్ , గ్రీన్ గ్రోత్, ఫైనాన్షియల్ సెక్టార్, సామర్థ్యాన్ని వెలికితీయడం వంటి అంశాలు ప్రాధాన్యంగా ఈ వార్షిక బడ్జెట్‌ను తీసుకువస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు చేరే విధంగా సమ్మిళిత భారతదేశాన్ని నిర్మిస్తామని తెలిపారు. అలాగే ఈ సారి బడ్జెట్‌లో మూడు అంశాలపై భారత ప్రభుత్వం దృష్టి పెడుతుందని ఆమె పేర్కొన్నారు. యువత, ప్రజలకు పుష్కలమైన అవకాశాలు కల్పించడం, జాబ్ క్రియేషన్ కోసం కృషి చేయడం, సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా చూడడం అనే అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు.

First published:

Tags: Budget, Budget 2023, Nirmala sitharaman, Women

ఉత్తమ కథలు