హోమ్ /వార్తలు /బిజినెస్ /

Budget 2023: కొత్త, పాత ఆదాయ పన్ను విధానాలకు మధ్య తేడా ఏంటీ? దేనివల్ల ఎక్కువ లాభం?

Budget 2023: కొత్త, పాత ఆదాయ పన్ను విధానాలకు మధ్య తేడా ఏంటీ? దేనివల్ల ఎక్కువ లాభం?

Budget 2023: కొత్త, పాత ఆదాయ పన్ను విధానాలకు మధ్య తేడా ఏంటీ? దేనివల్ల ఎక్కువ లాభం?
(ప్రతీకాత్మక చిత్రం)

Budget 2023: కొత్త, పాత ఆదాయ పన్ను విధానాలకు మధ్య తేడా ఏంటీ? దేనివల్ల ఎక్కువ లాభం? (ప్రతీకాత్మక చిత్రం)

Budget 2023 | పాత ఆదాయ పన్ను విధానం కొనసాగుతుంది. నూతన పన్ను విధానం (New Tax Regime) డీఫాల్ట్‌గా ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

కేంద్ర ప్రభుత్వం 2023-24 బడ్జెట్‌లో నూతన ఆదాయ పన్ను (Income Tax) విధానంలో కొన్ని మార్పులు చేసింది. వేతన జీవులకు ఊరట కల్పిస్తూ ఆదాయ పన్ను పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. ఫలితంగా రూ.7 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న ఉద్యోగులను ట్యాక్స్ నుంచి మినహాయించినట్లు అయింది. అయితే పాత ఆదాయ పన్ను విధానం అలాగే కొనసాగుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. నూతన పన్ను విధానం డీఫాల్ట్‌గా ఉంటుందని, ఆసక్తిగలవారు పాత పన్ను విధానం నుంచి కొత్త పన్ను విధానంలోకి (New Tax Regime) మారొచ్చని ఆర్థికమంత్రి సూచించారు. అయితే పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం పోలిస్తే ఎవరు ఏది ఎంచుకోవాలి అనే అంశంపై చార్టర్డ్ అకౌంటెంట్, కార్పొరేట్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ సుమీత్ మెహ్తా అందించిన వ్యాసం ఇది.

87A అంటే ఏంటి?

బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ట్యాక్స్ విధానంపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ని వివరించారు. ఈ నేపథ్యంలో సెక్షన్ 87A గురించి కాస్త తెలుసుకోవాలి. ట్యాక్స్ మినహాయింపు గురించి ఈ సెక్షన్ వివరిస్తుంది. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు రూ.12,500 వరకు ట్యాక్స్‌ డిడక్షన్‌ పొందవచ్చు. ఆదాయ పన్ను శ్లాబు ప్రకారం ఒకవేళ ఉద్యోగి సెక్షన్ 87A కింద అన్ని డిడక్షన్‌లు క్లెయిమ్‌ చేసిన తర్వాత రూ.12,500 పన్ను చెల్లించాల్సి వచ్చింది అనుకుంటే. ఈ తగ్గింపు మొత్తం చెల్లించాల్సిన పన్ను నుంచి తీసివేస్తారు. పన్ను చెల్లింపుదారు రూ.12,500 రాయితీ అందుకుంటాడు. చివరికి ఎలాంటి పన్ను చెల్లించనట్లు అవుతుంది. పన్ను చెల్లింపుదారు రూ.5 లక్షల వరకు తన ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ సౌలభ్యాన్ని సెక్షన్ 87A కల్పిస్తోంది.

Income Tax: పాత, కొత్త ట్యాక్స్ శ్లాబ్స్‌తో పన్ను ఆదా చేయండి ఇలా

budget 2023, new old tax regime comparison, new tax regime, new tax regime or old tax regime, new tax regime vs old tax regime, old tax regime, ఆదాయపు పన్ను, <a href='https://telugu.news18.com/tag/income-tax/'>ఇన్‌కమ్ ట్యాక్స్</a> , కొత్త పన్ను విధానం, పాత పన్ను విధానం, బడ్జెట్ 2023

తాజాగా ఈ పన్ను పరిమితిని ప్రభుత్వం పెంచింది. రూ.12,500 నుంచి రూ.25,000 వరకు పరిమితిని పెంచింది. అంటే ఉద్యోగి రూ.25,000 వరకు అదనంగా ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతమున్న ఆదాయ పన్ను శ్లాబుల ప్రకారం గరిష్ఠంగా రూ.5 లక్షల వార్షికాదాయం వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. ఈ విధానంలో ఉన్నవారికి చాప్టర్ VIA(సెక్షన్ 80C,80CCC, 80CCD, 80D.. etc) ప్రకారం మరికొన్ని బెనిఫిట్స్ ఉంటాయి.

Pension Scheme: రోజుకు రూ.200 మీవి కాదనుకుంటే... నెలకు రూ.50,000 పెన్షన్

budget 2023, new old tax regime comparison, new tax regime, new tax regime or old tax regime, new tax regime vs old tax regime, old tax regime, ఆదాయపు పన్ను, ఇన్‌కమ్ ట్యాక్స్, కొత్త పన్ను విధానం, పాత పన్ను విధానం, బడ్జెట్ 2023

లిమిట్‌ దాటితే పాత పన్ను విధానం మేలు

కొత్త పన్ను విధానంలో చాప్టర్ VIA బెనిఫిట్స్ ఉండవు. పాత పన్ను విధానంలో చాప్టర్ VIA బెనెఫిట్స్‌ని లెక్కించి ఉద్యోగి గందరగోళంలో పడే పరిస్థితి ఉంటుంది. కొత్త పన్ను విధానం ద్వారా పన్ను విధానాన్ని సరళీకృతం అయింది. రూ.7 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందగలిగేలా నిర్ణయం తీసుకుంది. ఫలితంగా పన్ను చెల్లింపు దారులను ఆకర్షించి, తక్కువ ఆదాయం కలిగిన ఉద్యోగులకు లబ్ధి చేకూర్చుతోంది. రూ.7 లక్షల కన్నా అధికంగా వార్షిక ఆదాయం ఉన్నవారికి పాత పన్ను విధానం కాస్త లబ్ధి చేకూర్చవచ్చుని నిపుణులు చెబుతున్నారు.

(సుమీత్ మెహ్తా చార్టర్డ్ అకౌంటెంట్, కార్పొరేట్ ఫైనాన్స్ ప్రొఫెషనల్. ఆయన CNBC Books18 పబ్లిష్ చేసిన 'డయాగ్నైజింగ్ జీఎస్టీ ఫర్ డాక్టర్స్' పుస్తక రచయిత. ఆయన వెల్లడించిన అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి.)

First published:

Tags: Budget 2023, Income tax, Personal Finance, TAX SAVING

ఉత్తమ కథలు