హోమ్ /వార్తలు /బిజినెస్ /

Budget 2023: సామాన్యులకు అందుబాటులో బడ్జెట్ డాక్యుమెంట్స్.. డౌన్‌లోడ్ చేసుకునే సింపుల్ స్టెప్స్‌ ఇవే..

Budget 2023: సామాన్యులకు అందుబాటులో బడ్జెట్ డాక్యుమెంట్స్.. డౌన్‌లోడ్ చేసుకునే సింపుల్ స్టెప్స్‌ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Budget 2023: బడ్జెట్ డాక్యుమెంట్స్ సామాన్యులకు కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. వీటిని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చో తెలుసుకోండి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

దేశంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్‌ను 2023 (Budget 2023) ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశ పెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ కావటంతో ఇప్పటికే హైప్ క్రియేట్ అయింది. ఎన్నికల తాయిలాలు, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు వంటి ప్రకటనలు రావచ్చు. వీటితో ఏయే వర్గానికి ఏయే ప్రయోజనం కలుగుతుందో అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. అయితే ఈ బడ్జెట్ డాక్యుమెంట్స్ సామాన్యులకు కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. వీటిని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చో తెలుసుకోండి.

వచ్చే బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. సాధారణంగా ఈ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటల నుంచి లోక్‌సభ TV, రాజ్యసభ TV, DD న్యూస్‌లలో లైవ్‌ ఇస్తారు. అనేక ప్రైవేట్ ఛానెళ్లు కూడా బడ్జెట్ ప్రసంగాన్ని, దానిపై సభ్యుల అభిప్రాయాలను ప్రసారం చేస్తాయి.

* స్పెషల్ యాప్‌

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రసంగం తర్వాత, మొత్తం బడ్జెట్ పత్రం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. కొన్ని సంవత్సరాల వరకు పత్రికల ద్వారా ప్రజలకు చేరిన ఈ బడ్జెట్ డాక్యుమెంట్స్, తరువాతి రోజుల్లో డిజిటల్ మాధ్యమాల రాకతో వెబ్‌సైట్స్‌ ప్రచురించేవి. ఇటీవలి కాలంలో యాప్‌ ద్వారా కూడా బడ్జెట్‌ను చూసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ఫోన్‌లోనే పూర్తిగా బడ్జెట్‌ను చదువుకుని విశ్లేషించుకోవచ్చు. ‘యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్’ ద్వారా బడ్జెట్‌ను విడుదల చేయనున్నారు. బడ్జెట్ పత్రాలను పూర్తిగా యాక్సెస్ చేసుకోవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఆండ్రాయిడ్ , ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

* యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి

ఆండ్రాయిడ్ డివైజ్ యూజర్లు Google Play Store నుంచి యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యాపిల్ ఫోన్(iOS) లేదా ఇతర యాపిల్ డివైజెస్‌లో అయితే Apple App Store నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ (www.Indiabudget.Gov.In) నుంచి కూడా డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం ఈ యాప్‌లో బడ్జెట్ 2021-22, బడ్జెట్ 2022-23కి సంబంధించిన సమాచారం ఉంది. కేటగిరీ వారీగా ఇన్ఫర్మేషన్‌ చూసుకోవచ్చు. యాప్‌ ద్వారా కావాల్సిన సమాచారాన్ని సులువుగా యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని వినియోగదారులు ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చారు.

ఇది కూడా చదవండి : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆ సాయం రూ.8వేలకు పెంచే అవకాశం..!

* ఇలా యాక్సెస్ చేయండి

ముందుగా https://www.indiabudget.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లండి. తరువాత Budget Speeches (బడ్జెట్ ప్రసంగాల)పై క్లిక్ చేయండి.

అక్కడ 2023-2024 బడ్జెట్‌ PDF(పీడీఎఫ్) ఉంటుంది. దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని చూసుకోవచ్చు. లేదా బ్రౌజర్‌లోనే ఓపెన్‌ చేసి కూడా బడ్జెట్‌ను చదువుకోవచ్చు.

వార్షిక ఆర్థిక నివేదిక (సాధారణంగా బడ్జెట్ అని పిలుస్తారు), గ్రాంట్ల డిమాండ్ (DG), రాజ్యాంగం సూచించిన ఆర్థిక బిల్లుతో సహా మొత్తం 14 బడ్జెట్ పత్రాలను యాక్సెస్ చేసుకోవచ్చు.

First published:

Tags: Budget 2023, National News, Nirmala sitharaman, Personal Finance

ఉత్తమ కథలు