హోమ్ /వార్తలు /బిజినెస్ /

Budget 2023: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్... బడ్జెట్‌లో కొన్ని మార్పులు

Budget 2023: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్... బడ్జెట్‌లో కొన్ని మార్పులు

Budget 2023: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్... బడ్జెట్‌లో కొన్ని మార్పులు
(ప్రతీకాత్మక చిత్రం)

Budget 2023: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్... బడ్జెట్‌లో కొన్ని మార్పులు (ప్రతీకాత్మక చిత్రం)

Budget 2023 | పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం (Central Government) బడ్జెట్‌లో కొన్ని మార్పులు చేయబోతుందన్న వార్తలు వస్తున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రకటించనుంది. ఈసారి బడ్జెట్ ఎలా ఉంటుందా అన్న ఆసక్తి అన్నివర్గాల్లో కనిపిస్తోంది. పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా కొన్ని మార్పులు ఉంటాయన్న వార్తలు వస్తున్నాయి. స్వచ్ఛంద ఆదాయపు పన్ను (Income Tax) ఫ్రేమ్‌వర్క్ కింద రేట్లను తగ్గించడాన్ని కేంద్ర ప్రభుత్వం (Central Government) పరిశీలిస్తోంది, కొన్ని శ్లాబ్స్‌ని సవరించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెప్పినట్టు రాయిటర్స్ కథనం పబ్లిష్ చేసింది. దీనిపై ప్రధాన మంత్రి కార్యాలయం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం 2020లో పన్ను చెల్లింపును సులభతరం చేసేందుకు కొత్తగా ఆప్షనల్ ఇన్‌కమ్ ట్యాక్స్ స్కీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ స్కీమ్ వార్షికాదాయంపై ఎలాంటి మినహాయింపులు లేకుండా నేరుగా పన్ను చెల్లించవచ్చు. అయితే ఇంటి అద్దెలు, బీమాపై మినహాయింపులు అనుమతించనందున కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ స్కీమ్ చాలా మందికి ఆకర్షణీయంగా లేదని నిపుణులు చెబుతున్నారు. కొత్త ఆదాయపు పన్ను విధానంలో మినహాయింపులు లేకపోవడంతో ఈ ఆప్షన్ అంత ఆకర్షణీయంగా లేదని, ఈ పథకాన్ని ప్రవేశపెట్టేటప్పుడు ఇది ఉద్దేశ్యం కాదని విశ్వసనీయవర్గాలు అభిప్రాయపడ్డాయి. వ్యక్తులు ప్రస్తుతం ఏ రేట్ల సెట్ కింద పన్ను విధించాలో నిర్ణయించుకోవచ్చు. కొత్త పన్ను విధానాన్ని పొందుతున్న వ్యక్తుల సంఖ్యకు సంబంధించిన డేటాను ప్రభుత్వం వెల్లడించలేదు.

Credit Card Rule: క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించవారికి కొత్త రూల్‌తో ఊరట

కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ స్కీమ్

కొత్త స్కీమ్ ప్రకారం వార్షికాదాయం రూ.2,50,000 లోపు ఉన్నవారికి ఎలాంటి పన్నులు ఉండవు. రూ.2,50,000 నుంచి రూ.5,00,000 మధ్య వార్షికాదాయం ఉంటే 5 శాతం, రూ.5,00,000 నుంచి రూ.7,50,000 మధ్య వార్షికాదాయం ఉంటే 10 శాతం + రూ.12,500 పన్నులు చెల్లించాలి. ఇక రూ.7,50,000 నుంచి రూ.10,00,000 మధ్య వార్షికాదాయం ఉంటే 15 శాతం + రూ.37,500 పన్ను, రూ.10,00,000 నుంచి రూ.12,50,000 మధ్య వార్షికాదాయం ఉంటే 20 శాతం + రూ.75,000 పన్ను, రూ.12,50,000 నుంచి రూ.15,00,000 మధ్య వార్షికాదాయం ఉంటే 25 శాతం + రూ.1,25,000 పన్ను, రూ.15,00,000 కన్నా ఎక్కువ వార్షికాదాయం ఉంటే 30 శాతం + రూ.1,87,500 పన్ను చెల్లించాలి.

SBI Account: ఎస్‌బీఐ ఖాతా నుంచి రూ.147.50 కట్... ఎందుకో తెలుసా?

పాత ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబ్స్

పాత ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబ్స్ చూస్తే రూ.2,50,000 లోపు వార్షికాదాయం ఉన్నవారికి పన్నులు ఉండవు. రూ.2,50,000 నుంచి రూ.5,00,000 మధ్య వార్షికాదాయం ఉంటే 5 శాతం ట్యాక్స్ + 4 శాతం సెస్, రూ.5,00,000 నుంచి రూ.10,00,000 మధ్య వార్షికాదాయం ఉంటే 20 శాతం పన్ను + రూ.12,500 + 4 శాతం సెస్, రూ.10,00,000 కన్నా ఎక్కువ వార్షికాదాయం ఉంటే 30 శాతం పన్ను + రూ.1,12,500 + 4 శాతం సెస్ చెల్లించాలి.

First published:

Tags: Budget 2023-24, Income tax, TAX SAVING, Union Budget 2023-24

ఉత్తమ కథలు