పన్నుల విధానాన్ని (Tax Regime) సులభతరం చేసేందుకు భారత ప్రభుత్వం ఇటీవల సంవత్సరాల్లో అనేక చర్యలు చేపట్టింది. వాటిలో భాగంగా 2020 బడ్జెట్‌లో ఇండివిడ్యువల్ ట్యాక్స్ పేయర్స్ ఎంపిక చేసుకోగల కన్సెషనల్ పెర్సనల్ ట్యాక్స్ విధానం (Concessional Personal Tax Regime) తీసుకొచ్చింది. CTR అనే పన్ను విధానం కామన్ డిడక్షన్స్, ఎగ్జమ్షన్‌లలో కొన్నింటిని వదులుకోవడం ద్వారా తక్కువ పన్ను చెల్లించడానికి ప్రజలకు ఉపయోగపడుతుంది. CTRని ఎంచుకునేటప్పుడు తప్పనిసరిగా హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC), భవిష్య నిధి (PF), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) తదితర కామన్ డిడక్షన్స్ వదులుకోవాలి. దీనికి సంబంధించి నూతన బడ్జెట్‌లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం.
TSPSC Update: ఆ పరీక్షకు సంబంధించి .. ప్రాథమిక కీ, మాస్టర్ ప్రశ్నాపత్రం, OMR పత్రాలు విడుదల..
2023 బడ్జెట్‌లో సవరణలు?
ఈ కారణాల వల్లే CTR పన్ను విధానం తీసుకొచ్చి చాలా కాలం అవుతున్నా పెద్దగా పాపులర్ కాలేదు. PFకి కాంట్రిబ్యూట్ చేయని లేదా అర్హత ఉన్న బీమా పాలసీలలో పెట్టుబడి పెట్టని ఎర్లీ ఇన్‌కమ్ ఎర్నర్స్‌కి CTR మాత్రమే ప్రయోజనకరంగా ఉండవచ్చు. అయితే తక్కువ ట్యాక్స్ రేట్స్ కోసం HRA డిడక్షన్, PF కాంట్రిబ్యూషన్ డిడక్షన్, ఆరోగ్య బీమా ప్రీమియంపై డిడక్షన్, స్టాండర్డ్ డిడక్షన్ వంటి మినహాయింపులను వదులుకోవడం ఇష్టం లేక చాలామంది దీనిని ఎంపిక చేసుకోవడం లేదు. కాబట్టి దీన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రభుత్వం పన్ను శ్లాబ్ రేట్లను అడ్జస్ట్ చేయడం, మరిన్ని డిడక్షన్స్ అందించడం వంటి మార్పులను బడ్జెట్ 2023లో పరిశీలించవచ్చు.
పన్ను శ్లాబ్ రేట్లను అడ్జస్ట్ చేయడం
ప్రభుత్వం బడ్జెట్ 2023లో CTR కింద పన్ను స్లాబ్ రేట్లను మార్చవచ్చు. ప్రస్తుత అత్యల్ప శ్లాబ్ రేటు 5% తీసేసి దానికి బదులుగా 7.5% తీసుకొచ్చి, మొదటి రూ.5 లక్షలకు ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా మార్పులు చేయవచ్చు. అలానే ప్రస్తుతం ఉన్న రూ.15 లక్షలకు బదులుగా రూ.20 లక్షల కంటే ఎక్కువ ఆదాయానికి అత్యధిక రేటును 30%కి పెంచవచ్చు.
అందుబాటులోకి మరిన్ని డిడక్షన్స్
అంతేకాకుండా ప్రభుత్వం CTRకి మారడానికి ఎక్కువ మంది పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించడానికి మరిన్ని డిడక్షన్స్ తీసుకు రావచ్చు. వేతన జీవుల కోసం రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ని.. PF, PPF, అర్హత కలిగిన జీవిత బీమా , పెన్షన్ పాలసీలు, కొత్త పెన్షన్ స్కీమ్ (NPS)లో ఉద్యోగి/సెల్ఫ్-కాంట్రిబ్యూషన్లపై డిడక్షన్‌ని అనుమతించవచ్చు. అలానే ఆరోగ్య బీమా ప్రీమియం, గృహ రుణాలపై వడ్డీకి డిడక్షన్‌ని అందించవచ్చు. పన్ను చెల్లింపుదారులు వారి పదవీ విరమణ, బీమా కోసం డబ్బులు ఆదా చేయడంలో సహాయపడటానికి ప్రభుత్వం మరిన్ని డిడక్షన్స్ అందుబాటులోకి తేవచ్చు.
ఈ డిడక్షన్స్‌లో PF, PPF, NPS, జీవిత బీమా, ఆరోగ్య బీమా డిడక్షన్స్ ప్రధానంగా ఉండొచ్చు. ఎందుకంటే భారతదేశంలోని పౌరులందరికీ ఆర్థిక భద్రత కల్పించడానికి ఇవి ముఖ్యమైనవి. మరి 2022 యూనియన్ బడ్జెట్‌లో కొత్త పన్ను విధానంలో ప్రభుత్వం ఏ మార్పులు తీసుకు వస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.