BUDGET 2022 UP TO RS 1 LAKH INCOME TAX RELIEF FOR INSURANCE PREMIUMS WHAT EXPERTS SAY GH VB
Union Budget: బడ్జెట్లో ఇన్సూరెన్స్ ప్రీమియంపై రూ.1 లక్ష వరకు పన్ను మినహాయింపు ..? నిపుణులు ఏమంటున్నారు..?
ప్రతీకాత్మక చిత్రం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitaraman) ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఆరోగ్య బీమా(Health Insurance) రంగానికి సంబంధించి కీలక మార్పులను ప్రతిపాదించనున్నట్లు సమాచారం.
అనారోగ్య సమస్యలతో ఆసుత్రికి(Hospital) వెళ్తే ఇక అంతే. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీతో ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. దీనితో చాలామందిలో ఆరోగ్య బీమాపై(Health Insurance) అవగాహన పెరిగింది. అదీగాక ప్రస్తుత కరోనా మహమ్మారి విజృంభణ పరిస్థితులు సైతం మనిషికి బీమాపై పెట్టుబడి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. అయితే ఇతర దేశాలతో పోలిస్తే.. భారతదేశంలో ఆరోగ్య బీమా చేయించుకునే వారి సంఖ్య ఇప్పటికీ తక్కువగానే ఉంటోంది. అయితే కొవిడ్ మహమ్మారి కారణంగా తలెత్తిన ఆర్థిక అనిశ్చితి నుంచి కుటుంబాన్ని రక్షించేందుకు బీమా అత్యంత ముఖ్యమైన సాధనంగా మారిందని చెప్పవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitaraman) ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఆరోగ్య బీమా(Health Insurance) రంగానికి సంబంధించి కీలక మార్పులను ప్రతిపాదించనున్నట్లు సమాచారం.
ప్రధానంగా బీమా ప్రీమియంపై లక్ష రూపాయల వరకు ఆదాయపు పన్ను(Income Tax Relief on Premium) ఉపశమనం లభించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. గతేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆరోగ్య సంరక్షణ రంగంపై బడ్జెట్లో ప్రత్యేక దృష్టి సారించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదీగాక కరోనా మహమ్మారి సంక్షోభం ఇప్పట్లో ముగిసే సూచనలు లేనందున ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు అంచనా వేస్తున్నారు.
సెక్షన్ 80సీ(Section 80C) కింద బీమా ప్రీమియం చెల్లింపు కోసం కనీసం లక్ష రూపాయల వరకు ప్రత్యేక మినహాయింపు పరిమితిని అందిస్తోంది. తద్వారా జీవిత బీమా(Life Insurance) పొందేందుకు ప్రజలను ప్రోత్సహించాలనేది ప్రభుత్వ ఆలోచన. అయితే లైఫ్ ఇన్సూరెన్స్‌పై చెల్లించే బీమా ప్రీమియంపైనా పన్ను మినహాయింపులు ఇవ్వాలని బీమా పరిశ్రమ చాలా కాలంగా విజ్ఞప్తి చేస్తూ వస్తోంది.
ఈసారి బడ్జెట్లోనైనా ఆరోగ్య బీమా ఉత్పత్తులపై GSTని తగ్గించాల్సిన అవసరం ఉందని గురించి హెచ్ఎస్బీసీ Canara- HSBC ఛీఫ్ ఫైనాన్షియల్ అధికారి రుస్తగి తెలిపారు. ఆరోగ్య బీమా ఉత్పత్తులపై 18 శాతం జీఎస్టీని విధించడం వల్ల కట్టాల్సిన ప్రీమియం భారంగా మారుతోందని నివా బుపా సీఈవో, ఎండీ కృష్ణన్ రామచంద్రన్ అభిప్రాయపడ్డారు. ఈ నిబంధన నూతనంగా పాలసీ కొనుగోలుచేసే వారికి అడ్డంకిగా మారుతోందని తెలిపారు. ఆరోగ్య బీమా పథకాలకు జీఎస్టీ తగ్గింపు వల్ల ఈ సేవలు సామాన్యులకు సులువుగా అందుబాటులోకి వస్తాయని వివరించారు.
వైద్యారోగ్య సంరక్షణను మౌలిక సదుపాయాల పరిధిలోకి తీసుకురావడం వల్ల బీమా రంగంలోకి పెట్టుబడులను ఆకర్షించవచ్చని రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సీఈఓ రాకేష్ జైన్ అన్నారు. ఈ బడ్జెట్లో.. డయాగ్నోస్టిక్ సెంటర్లు, స్పెషాలిటీ హాస్పిటల్స్, వెల్నెస్ ఫెసిలిటీస్ వంటి ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను “మౌలిక సదుపాయాల కేటగిరీ కిందకు తీసుకురావడాన్ని ప్రభుత్వం పరిగణించాలి అని జైన్ పేర్కొన్నారు. ఫలితంగా "ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్"లో పెట్టుబడులపై నియంత్రణ పెరుగుతుందని సూచించారు.
అంతేగాక పెద్దపెద్ద బీమా సంస్థలు సహా.. ఇతర మార్గాల నుంచి నిధులను సమీకరించవచ్చన్నారు. ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను తక్కువ ధరలో అందించేందుకు బీమా, ఆరోగ్య సంరక్షణ రంగం రెండూ సమానంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.