BUDGET 2022 THESE 5 BIG EXPECTATIONS ARE FOR THE IT SECTOR FROM THE BUDGET MK
Budget 2022: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు ఐటీ కంపెనీల డిమాండ్లు ఇవే...
Budget 2022
కరోనా మహమ్మారి భారతదేశంపైనే కాకుండా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపింది. ఈ మహమ్మారి బారిన పడని రంగం అంటూ ఏదీ లేదు. అయితే ఐటీ, సర్వీసెస్ రంగం మాత్రమే మిగిలిన పరిశ్రమల కన్నా కూడా మంచి పెర్ఫార్మన్స్ కనబరుస్తోంది.
Budget 2022: 2022-23 ఆర్థక సంవత్సరానికి గానూ యూనియన్ బడ్జెట్ ఫిబ్రవరి 1 న సమర్పించనున్నారు. ఈ బడ్జెట్‌పై సామాన్యులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు, రియల్ ఎస్టేట్, స్టార్టప్, రిటైల్ రంగం, ఐటీ రంగం సహా ఇతర రంగాలకు కరోనా నేపథ్యంలో ఉపశమన ప్యాకేజీలు ప్రకటిస్తారని భావిస్తున్నారు. కరోనా మహమ్మారి భారతదేశంపైనే కాకుండా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపింది. ఈ మహమ్మారి బారిన పడని రంగం అంటూ ఏదీ లేదు. అయితే ఐటీ, సర్వీసెస్ రంగం మాత్రమే మిగిలిన పరిశ్రమల కన్నా కూడా మంచి పెర్ఫార్మన్స్ కనబరుస్తోంది.
బడ్జెట్ పై ఐటీ రంగానికి ఉన్న అంచనాలు ఇవే...
>> ఈసారి బడ్జెట్ నుండి ఐటీ రంగం రిస్క్ క్యాపిటల్‌కు ఉపశమనం కలిగించడానికి పన్ను మినహాయింపును ఆశిస్తోంది.
>> దేశంలో ఐటీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు స్టార్టప్‌లపై దృష్టి సారించాలని నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ముఖ్యంగా స్టార్టప్‌లు పన్ను మినహాయింపు , ప్రోత్సాహకాలను ఈ బడ్జెట్ నంచి ఆశిస్తున్నాయి.
>> అంతేకాదు పెట్టుబడులను పెంచడం కోసం ఐటీ కంపెనీలు బడ్జెట్లో రాయితీలు ఆశిస్తున్నాయి.
>> ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో చిన్న కంపెనీల అవసరాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు దేశంలో ఈజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అవసరం చాలా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
2021-22 బడ్జెట్లో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారతీయ IT పరిశ్రమను ప్రోత్సహించడానికి ఎటువంటి నిర్దిష్ట ప్రకటన చేయలేదు. అయితే, దేశ సాంకేతిక రంగానికి ఊతం ఇచ్చేలా బడ్జెట్లో కొన్ని ప్రకటనలు వచ్చాయి. దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గత బడ్జెట్లో రూ.1,500 కోట్ల ప్రణాళికను ప్రతిపాదించింది. ఇది చిన్న పట్టణాల్లోని ఇ-పేమెంట్స్ , ఫిన్‌టెక్ సంస్థలలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి తోడ్పడినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దేశంలో తొలిసారిగా డిజిటల్ సెన్సస్ 2021ని చూస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ ప్రతిపాదన సాంకేతికతతో కూడిన బ్యాకెండ్లను రూపొందించే సాఫ్ట్వేర్ కంపెనీలను ప్రోత్సహిస్తుంది.
మోదీ ప్రభుత్వానికి ఇది 10వ బడ్జెట్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన నాలుగో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మోదీ ప్రభుత్వానికి ఇది 10వ బడ్జెట్. గత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో పన్ను శ్లాబ్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి ప్రభుత్వం పెద్ద ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది కాకుండా, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, రక్షణ, ఆతిథ్యం , MSME రంగాలతో సహా ఇతర రంగాలకు ఉపశమన ప్యాకేజీలను ప్రకటించవచ్చు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.