BUDGET 2022 NIRMALA SITHARAMAN WILL PRESENT GREEN BUDGET THIS TIME TOO PRINTING OF MINIMUM COPIES WILL BE DONE MK
Budget 2022: ఈ సంవత్సరం కూడా గ్రీన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్, గ్రీన్ బడ్జెట్ అంటే ఏంటి..?
ప్రతీకాత్మకచిత్రం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2022న సమర్పించనున్నారు. అదే సమయంలో బడ్జెట్ 2022 ఈ సంవత్సరం కూడా గ్రీన్ బడ్జెట్ అనే చెబుతున్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా బడ్జెట్ పత్రాలను ముద్రించడం ఈసారి కూడా జరగదు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2022న సమర్పించనున్నారు. అదే సమయంలో బడ్జెట్ 2022 ఈ సంవత్సరం కూడా గ్రీన్ బడ్జెట్ అనే చెబుతున్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా బడ్జెట్ పత్రాలను ముద్రించడం ఈసారి కూడా జరగదు. బడ్జెట్ పత్రాలు ఎక్కువగా డిజిటల్ రూపంలోనే అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. భౌతికంగా కొన్ని కాపీలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. గతంలో బడ్జెట్ పత్రాలను ముద్రించేందుకు చాలా విస్తృతమైన ప్రక్రియ ఉండేది. నార్త్ బ్లాక్‌లోని బేస్మెంట్లోని ప్రింటింగ్ ప్రెస్‌లో ఉద్యోగులు కనీసం ఇంటికి కూడా వెళ్లకుండా, కొన్ని వారాలపాటు ఒంటరిగా ఉండవలసి వచ్చేది. ఉద్యోగులను కుటుంబ సభ్యులకు దూరంగా ఉంచి బడ్జెట్ పత్రాన్ని ముద్రించే పని సంప్రదాయ 'హల్వా వేడుక'తో ప్రారంభమయ్యేది. ఈ కార్యక్రమానికి ఆర్థికమంత్రి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి , మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు హాజరవుతారు. అయితే మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ కాపీల ముద్రణ తగ్గింది. ఇక మహమ్మారి కారణంగా లోక్‌సభ , రాజ్యసభ ఎంపీలకు ఇచ్చే కాపీలను తగ్గించి గ్రీన్ బడ్జెట్ పేరిట డిజిటల్ ప్రతులను సభ్యుల ట్యాబ్ లకు పంపుతున్నారు.
ఓమిక్రాన్ కారణంగా హల్వా వేడుక కూడా వాయిదా
ఈ సంవత్సరం కోవిడ్-19 , ఓమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించి మరిన్ని ఆంక్షలు విధించబడ్డాయి. మహమ్మారి కారణంగా సాంప్రదాయ హల్వా వేడుక కూడా రద్దు చేశారు. అయితే, బడ్జెట్ పత్రాల సంకలనాన్ని డిజిటలైజ్ చేయడానికి తక్కువ సంఖ్యలో ఉద్యోగులు మాత్రమే అవసరం అవుతారు. బడ్జెట్ పత్రంలో సాధారణంగా పార్లమెంట్లో ఆర్థిక మంత్రి ప్రసంగం, ముఖ్యాంశాలు, వార్షిక ఆర్థిక నివేదికలు, పన్ను ప్రతిపాదనలతో కూడిన ఆర్థిక బిల్లు, ఆర్థిక బిల్లులోని నిబంధనలను వివరించే మెమోరాండం , స్థూల ఆర్థిక ప్రొఫైల్ ఉంటాయి. వీటిలో మీడియం టర్మ్ ఫిస్కల్ పాలసీ కమ్ ఫిస్కల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్మెంట్, స్కీమ్‌ల ఫలితాల ఫ్రేమ్‌వర్క్, కస్టమ్స్ నోటిఫికేషన్, మునుపటి బడ్జెట్ ప్రకటనల అమలు, వ్యయ బడ్జెట్, బడ్జెట్ అంచనాలు ఉన్నాయి.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.