హోమ్ /వార్తలు /business /

Budget 2022: పోస్టాఫీస్ కస్టమర్లకు శుభవార్త.. బ్యాంకు ఖాతాలకు మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు

Budget 2022: పోస్టాఫీస్ కస్టమర్లకు శుభవార్త.. బ్యాంకు ఖాతాలకు మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు

బడ్జెట్ సందర్భంగా పోస్ట్ ఆఫీస్ (Post Office) ఖాతాదారులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. బ్యాంకు ఖాతాలకు కూడా నగదు పంపించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

    కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్ అనేక కీలక ప్రకటనలు చేశారు. దేశంలోని 1.5 లక్షల పోస్టాఫీసులను కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌తో అనుసంధించనున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రజలు పోస్టాఫీస్ ఖాతాను ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేసుకోవచ్చన్నారు. పోస్టాఫీసు ఖాతాల నుంచి ఇతర బ్యాంకులకు డబ్బును బదిలీ చేయడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ ఏడాదిలో 1.5 లక్షల పోస్టాఫీసుల్లో 100 శాతం కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తాయన్నారు. తద్వారా పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ATMల ద్వారా ఆర్థిక లావాదేవీలు చేయొచ్చు. బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయవచ్చాన్నారు. ఈ నిర్ణయం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు, సీనియర్ సిటిజన్లకు ఉపయోగపడుతుందని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు.

    కేంద్ర బడ్జెట్ లో మంత్రి నిర్మలా సీతారామన్ విద్యారంగంపై వరాల జల్లు కురిపించారు. కరోనా నేపథ్యంలో విద్యారంగం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా డిజిటల్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ప్రధాని ఈ-విద్య ప్రోగ్రామ్ కింద టెలివిజన్‌ ఛానళ్లు 12 నుంచి 200కు పెంచబోతున్నట్లు వెల్లడించారు. ప్రతి తరగతికి ఒక టీవీ ఛానెల్‌ ద్వారా పాఠాల బోధించనున్నట్లు తెలిపారు.

    ప్రాంతీయ భాషల్లో పాఠాలు ఉంటాయన్నారు. చిన్నారుల కోసం 2 లక్షల అంగన్వాడీ కేంద్రాల అప్‌గ్రెడేషన్‌ చేయనున్నట్లు మంత్రి వివరించారు. డిజటల్ యూనివర్సిటీల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. డ్రోన్ శక్తి కార్యక్రమంలో భాగంగా స్టార్టప్ లకు ప్రోత్సాహం ఇస్తామన్నారు. వ్యవసాయ యూనివర్సిటీల్లో సిలబస్ లో మార్పులు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

    First published:

    ఉత్తమ కథలు