Home /News /business /

BUDGET 2022 MORE INCOME TAX BENEFITS ON HOME LOANS AFFORDABLE HOUSING KEY CHANGES TO EXPECT GH VB

Budget 2022: కేంద్ర బడ్జెట్ లో.. రుణాలు, నిర్మాణాలలో ప్రత్యేక రాయితీలు..? ఏమేమి ఆశించవచ్చు..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 బడ్జెట్ (union budget)ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. మరికొన్ని రోజుల్లో ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్‌పై అన్ని వర్గాలు దృష్టి సారించాయి. కరోనా కాలంలో దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. గృహ నిర్మాణ సంస్థలపై కూడా పెను ప్రభావం చూపింది.

ఇంకా చదవండి ...
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ 2022-23 బడ్జెట్ (union budget)ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. మరికొన్ని రోజుల్లో ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్‌పై అన్ని వర్గాలు దృష్టి సారించాయి. కరోనా కాలంలో దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. గృహ నిర్మాణ సంస్థలపై కూడా పెను ప్రభావం చూపింది. ఇప్పటికీ కరోనా పూర్తిగా వదిలిపోని సమయంలో పన్నుల రాయితీని రియల్ ఎస్టేట్ (real estate)సంస్థలు కోరుతున్నాయి. అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా చేపడుతున్న నిర్మాణాలు, దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించేలా రాయితీలు ఆశిస్తున్నారు. గత ఏడాది కరోనా మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా రాయితీలు, సడలింపులు కల్పించింది.

Budget 2022: త్వరలో కేంద్ర బడ్జెట్.. రూ.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్..?ఆ మినహాయింపులు కూడా ఉంటాయా..?


గృహరుణాలు(home loan interest) వడ్డీ రేట్లు, స్టాంప్ డ్యూటీస్(stam duties) తగ్గింపు, నిర్మాణ దారులు చెల్లించాల్సిన ప్రీమియం తగ్గించడం వంటి వెసులుబాట్లతో గృహ నిర్మాణ రంగం కాస్త తేరుకొంది. నారెడ్కో(NAREDCO, maharashtra) అధ్యక్షుడు సందీప్ రున్వాల్ మాట్లాడుతూ.. ‘గృహ నిర్మాణ సంస్థలు కోలుకొనేందుకు కేంద్రం మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తుందని ఆశిస్తున్నాం. సెక్షన్ 24(బి)లో కల్పిస్తున్న వడ్డీ రాయితీల పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలి. అందరికీ అందుబాటులో ఇళ్లు పథకంలో గరిష్ట పరిమితి రూ.45 లక్షలను ఎత్తివేయాలి. మెట్రో నగరాల్లో రూ.1.50 కోట్లు, ఇతర నగరాల్లో రూ. 75 లక్షలకు పెంచాలి. అప్పుడే గృహ నిర్మాణ సంస్థలు మెరుగైన వృద్ధి సాధిస్తాయి’ అని చెబుతున్నారు.

ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 80 సీ (income tax, 80c) సవరణ ద్వారా గృహ రుణాల చెల్లింపు మొత్తం( premium) పెంపు, అదే విధంగా టాక్స్ డిడక్షన్ అవకాశం కల్పించాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోరుతున్నారు. ఇలా రాయితీలను కేంద్రం కల్పించడం ద్వారా ఇళ్లు పథకం లక్ష్యం సాకారం అవుతుందని, అద్దె ఇంటి నిర్మాణాలు కూడా పెరుగుతాయని చెబుతున్నారు. ఎక్కువ పెట్టుబడులు వస్తాయని, వేగంగా నిర్మాణాలు పూర్తవుతాయని భావిస్తున్నారు.

Budget 2022: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు ఐటీ కంపెనీల డిమాండ్లు ఇవే...


ఈ విషయంపై జెఎల్ఎల్(jll) ఇండియా సంస్థ చీఫ్ ఎక్సిక్యూటివ్ రాధా ధీర్ మాట్లాడుతూ.. ‘స్పెషల్ విండో ఫర్‌ అఫరబుల్‌ అండ్ మిడ్ ఇన్ కం హౌసింగ్(SWAMIH)కి కేటాయిస్తున్న నిధులతో పనుల్లో పురోగతి కనిపిస్తోంది. ఆగిపోయిన ప్రాజెక్టులు పూర్తి అవుతున్నాయి. కేంద్ర ఇలానే సహకారం అందిస్తే అద్దె ఇంటి నిర్మాణాలు కూడా పుంజుకుంటాయి. బేసిక్ హోం లోన్ సహ వ్యవస్థాపకుడు, అతుల్ మొంగా మాట్లాడుతూ.. స్టాంప్ డ్యూటీ తగ్గించడం ద్వారా చిన్న గృహాల అమ్మకాలు పెరుగుతాయి. గత ఏడాది కర్ణాటక, మహారాష్ట్ర 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించడం ద్వారా ఇళ్ల విక్రయాలు పెరిగాయి’ అని చెప్పారు.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన రుణ రాయితీ పథకం(PMAY-CLSS)ని పొడిగించాలని, ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ఉన్న గడువును పెంచాలని, ఇప్పటికే కేటాయించిన నిధులు సద్వినియోగం కాలేదని నిపుణులు సూచిస్తున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Budget, Budget 2022, Budget 2022-23, Nirmala sitharaman, Union Budget 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు