హోమ్ /వార్తలు /బిజినెస్ /

Budget 2022: Drone శక్తి కార్యక్రమం ప్రకటించిన నిర్మలా సీతారామన్, నాల్గవ పారిశ్రామిక విప్లవానికి నాంది అంటున్న డ్రోన్ పరిశ్రమ వర్గాలు...

Budget 2022: Drone శక్తి కార్యక్రమం ప్రకటించిన నిర్మలా సీతారామన్, నాల్గవ పారిశ్రామిక విప్లవానికి నాంది అంటున్న డ్రోన్ పరిశ్రమ వర్గాలు...

నిర్మలా సీతారామన్ (ఫైల్)

నిర్మలా సీతారామన్ (ఫైల్)

కేంద్రం ప్రకటించిన డ్రోన్ శక్తి కార్యక్రమం స్వాగతిస్తున్నట్లు సీతారామన్, నీల్ మెహతా, సహ వ్యవస్థాపకుడు & డైరెక్టర్, ఆస్టెరియా ఏరోస్పేస్ (జియో ప్లాట్‌ఫాం కంపెనీ) పేర్కొన్నారు. “కేంద్ర బడ్జెట్‌లో ఆర్థికమంత్రి ప్రకటించినట్లుగా, డ్రోన్ శక్తి , కిసాన్ డ్రోన్స్ కార్యక్రమాల ద్వారా సుస్థిరమైన అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.

ఇంకా చదవండి ...

  కేంద్ర బడ్జెట్‌లో డ్రోన్ రంగానికి భారీ ప్రోత్సాహకాలను ప్రకటించారు. పంటల అంచనా, భూ రికార్డుల డిజిటలైజేషన్‌, పురుగుమందులు, పోషకాల పిచికారీ కోసం కిసాన్‌ డ్రోన్‌లను వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రకటించిన డ్రోన్ శక్తి పథకానికి పరిశ్రమకు చెందిన పలువురు నిపుణులు స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చర్య తమ వ్యాపారానికి ఊపును ఇస్తుందని, దేశంలో UAVలను వేగంగా స్వీకరించేలా చేస్తుంది. విభిన్న అప్లికేషన్‌లు డ్రోన్‌ల ద్వారా UAVల ఏకీకరణ ద్వారా డిజిటల్ ఇండియా వివిధ రంగాల డిజిటలైజేషన్‌ను ప్రభుత్వం ప్రోత్సహించడం ప్రోత్సాహకరంగా ఉంటుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయం, ఖనిజాల వెలికితీత, మౌలిక సదుపాయాల కల్పనలో డ్రోన్ సేవలు చాలా వేగంగా విస్తరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

  2022-23 బడ్జెట్‌లో భాగంగా వ్యవసాయ రంగంలో ‘కిసాన్ డ్రోన్‌ల’ వినియోగాన్ని ప్రోత్సహించాలనే ప్రకటన డ్రోన్ పరిశ్రమ రైతులతో కలిసి కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, లాభదాయకతను పెంచడానికి వీలు కల్పిస్తుంది. ఇది స్వాగతించదగిన చర్య, భారతదేశ వ్యవసాయ రంగ భవిష్యత్తును మారుస్తుందని ఆర్థిక నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు.

  కేంద్రం తీసుకున్న డ్రోన్ పరిశ్రమ పెరగడానికి బడ్జెట్ బహుళ మార్గాలను కవర్ చేసింది, అగ్రికల్చరల్ డ్రోన్‌లను ప్రోత్సహించడం, స్టార్టప్‌లకు నాబార్డ్ ఫండ్‌ను ప్రోత్సహించడం వల్ల డ్రోన్ పరిశ్రమ కొత్త మైలురాయిని చేరుకునేలా చేస్తుంది. 2030 నాటికి భారతదేశాన్ని గ్లోబల్ డ్రోన్ హబ్‌గా మార్చాలనే ప్రధానమంత్రి మోదీ దృష్టికి బడ్జెట్ మార్గదర్శక శక్తిగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

  అయితే కేంద్రం ప్రకటించిన డ్రోన్ శక్తి కార్యక్రమం స్వాగతిస్తున్నట్లు సీతారామన్, నీల్ మెహతా, సహ వ్యవస్థాపకుడు & డైరెక్టర్, ఆస్టెరియా ఏరోస్పేస్ (జియో ప్లాట్‌ఫాం కంపెనీ) పేర్కొన్నారు. “కేంద్ర బడ్జెట్‌లో ఆర్థికమంత్రి ప్రకటించినట్లుగా, డ్రోన్ శక్తి , కిసాన్ డ్రోన్స్ కార్యక్రమాల ద్వారా సుస్థిరమైన అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. నాల్గవ పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతుందని, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు , గ్రామీణ రంగాలలో డిజిటలైజేషన్ కోసం డ్రోన్ సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా దేశంలోని యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని నీల్ మెహతా పేర్కొన్నారు.“ఆస్టెరియా ఏరోస్పేస్ మిషన్‌కు ప్రభుత్వం మద్దతు ఇవ్వడం గర్వంగా ఉందని, అత్యుత్తమ స్వదేశీ డ్రోన్‌లను తయారు చేయడం , ఎండ్-టు-ఎండ్ డ్రోన్ పరిష్కారాలను అందించడం, జాతీయ భద్రత, మౌలిక సదుపాయాల తనిఖీలు, వ్యవసాయం , భూ సర్వేలు నిర్వహించడం తమ సంస్థ ప్రత్యేకత నీల్ మెహతా తెలిపారు.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: Union Budget 2022

  ఉత్తమ కథలు