Home /News /business /

BUDGET 2022 LIC PREMIUMS TO BECOME CHEAPER MORE DEDUCTION ON LIFE INSURANCES BEYOND 80C GH VB

Budget 2022: కొత్త బడ్జెట్‌లో LIC ప్రీమియం ధరలు తగ్గుతాయా..? సెక్షన్ 80C డిడక్షన్ లిమిట్ పెరిగేనా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

గత కొన్నేళ్లతో పోలిస్తే కొత్తగా బీమా తీసుకుంటున్న వారి సంఖ్య దాదాపు 40 శాతం పెరిగింది. కొవిడ్‌ తర్వాత బీమాకు ఒక్కసారిగా ప్రాధాన్యం పెరిగింది. అందుకే ఈ సారి బడ్జెట్‌లో బీమారంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని పరిశ్రమవర్గాలు కోరుతున్నాయి.

ఇంకా చదవండి ...
మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులంతా 2022లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) నుంచి 'పాపులిస్ట్' బడ్జెట్‌ను ఆశిస్తున్నారు. ఒకవైపు కోవిడ్ మరోవైపు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో యూనియన్ బడ్జెట్ 2022(Union Budget 2022) నుంచి కొంత ఉపశమనం కోరుకుంటున్నారు. అయితే ఇందులో భాగంగా బీమా పాలసీల్లో మార్పులు రాబోతున్నాయి. గత కొన్నేళ్లతో పోలిస్తే కొత్తగా బీమా(Policy) తీసుకుంటున్న వారి సంఖ్య దాదాపు 40 శాతం పెరిగింది. కొవిడ్‌(Covid) తర్వాత బీమాకు ఒక్కసారిగా ప్రాధాన్యం పెరిగింది. అందుకే ఈ సారి బడ్జెట్‌లో బీమారంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని పరిశ్రమవర్గాలు కోరుతున్నాయి. ప్రస్తుతానికి సెక్షన్‌ 80సీ(Section 80 C) కింద మినహాయింపు పరిమితి రూ.1.5 లక్షలు మాత్రమే ఉంది. ఇందులోనే ఈపీఎఫ్‌(EPF), వీపీఎఫ్‌(VPF), ఇంటి రుణం అసలు, పిల్లల ట్యూషన్‌ ఫీజులు, ఎన్‌ఎస్‌సీ ఇతర పెట్టుబడులు, జీవిత బీమా ప్రీమియం ఇవన్నీ కలిసి ఉంటాయి.

Railway Business: రైల్వేల్లో వ్యాపారం చేయడం ఇక సులువు.. ఆ ఫీజును భారీగా తగ్గించిన సంస్థ..!


ఇన్ని అవసరాలకు రూ. 1.5 లక్షల మొత్తం సరిపోదు. అందుకే దీర్ఘకాలం కొనసాగే జీవిత బీమా కోసం ప్రత్యేకంగా ఒక సెక్షన్‌ ఏర్పాటు చేసి, గరిష్ఠ పరిమితి పెంచాలని పాలసీదారులు కోరుతున్నారు. ఇప్పుడు రాబోతున్న బడ్జెట్ లో సెక్షన్ 80C కోసం అచ్చంగా బీమా రిలీఫ్ క్లెయిమ్ చేసే గరిష్ట పరిమితి రూ. 1.5 లక్షలకు పెంచుతున్నట్టు సమాచారం. టర్మ్‌ పాలసీ ప్రీమియంలో కూడా ప్రత్యేక మినహాయింపు కల్పించనున్నారు.

“లైఫ్ ఇన్సూరెన్స్ అనేది దీర్ఘకాలిక పరిష్కారం. జీవిత బీమా కోసం చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు కోసం ప్రత్యేక విభాగాన్ని రూపొందించడాన్ని బడ్జెట్ పరిశీలిస్తుందని మేము భావిస్తున్నాం. ఇది కస్టమర్ యొక్క నిధులను దీర్ఘకాలిక, స్వల్పకాలిక అవసరాలను బట్టి లాజికల్‌గా విభజించడానికి వీలు కల్పిస్తుంది" అని ఎడెల్‌వీస్ టోకియో లైఫ్ ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుభ్రజిత్ ముఖోపాధ్యాయ అన్నారు.

బీమా ప్రీమియంపై 18 శాతం జీఎస్‌టీ ఉంటోంది. అంటే రూ.1,000 ప్రీమియానికి రూ.180 జీఎస్‌టీ చెల్లించాలి. ఆరోగ్య బీమా ఇప్పుడు తప్పనిసరి అవసరంగా మారినందున, టర్మ్ కవర్‌లపై ఈ అదనపు పన్ను భారం ప్రీమియం మొత్తాన్ని పెంచుతుంది. ఇది చాలామంది పాలసీ కొనుగోలుదారులకు అడ్డంకిగా పనిచేస్తుందని నిపుణులు తెలిపారు.

SBI: ఎస్​బీఐ కస్టమర్లకు గుడ్​న్యూస్​.. ఆ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు.. తాజా రేట్లను పరిశీలించండి..


“బీమా ప్రీమియంలపై జీయస్టీ(GST) తగ్గిస్తే .. దేశంలో బీమా రంగం చొచ్చుకుపోవడానికి సాయపడుతుంది. రక్షణ-ఆధారిత ఉత్పత్తులను మరింత సరసమైనదిగా చేయడంలో సాయపడటానికి ప్రభుత్వం టర్మ్ ఉత్పత్తులపై జీయస్టీ(GST)ని హేతుబద్ధీకరించేలా చూడాలి" అని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ జైన్ అన్నారు.

"కోవిడ్ (COVID-19) బీమా పాలసీలపై అవగాహనను పెంచింది. ఇప్పుడు అందరూ వ్యాధులు, మరణాల నుండి కుటుంబాలను రక్షించుకోవాలని చూస్తున్నారు. దీనివల్ల పాలసీదారులు చెల్లించే ప్రీమియం మొత్తం క్రమంగా పెరిగింది. అందుకే ఆరోగ్య బీమా, జీవిత బీమాల్లో వెసులుబాటు కల్పించడం ఎంతో మేలు చేస్తుంది" అని హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీరజ్ షా అన్నారు.

ఇకపోతే ఆరోగ్య బీమా కోసం సెక్షన్‌ 80డీ ప్రకారం 60 ఏళ్లలోపు వారికి రూ.25వేలు, 60 ఏళ్లు దాటిన వారికి రూ.50వేలు మినహాయింపు లభిస్తుంది. కనీసం రూ.5 లక్షల పాలసీ తీసుకుంటే తప్ప ఫలితం ఉండటం లేదు. అందుకే ఆరోగ్య బీమా ప్రీమియం పరిమితిని 60 ఏళ్లలోపు వారికి రూ.50వేల వరకు పెంచాలని, వైద్య పరీక్షల కోసం ఇస్తున్న మినహాయింపును రూ.5వేల రూ.10వేలకు పెంచాలనే వాదనలూ ఉన్నాయి. ఇవన్నీ ఏమేరకు అమలవుతాయో రాబోయే బడ్జెట్ లో చూడాలి.
Published by:Veera Babu
First published:

Tags: Budget, Budget 2022, Budget 2022-23, LIC, Union Budget 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు