హోమ్ /వార్తలు /బిజినెస్ /

PM Kisan Amount Increase in Budget 2022 : రాబోయే బడ్జెట్ లో పీఎం కిసాన్ ఆర్థిక సాయం పెంచే చాన్స్..

PM Kisan Amount Increase in Budget 2022 : రాబోయే బడ్జెట్ లో పీఎం కిసాన్ ఆర్థిక సాయం పెంచే చాన్స్..

PM Kisan Amount Increase in Budget 2022: పీఎం కిసాన్ కింద రూ.6,000 కంటే ఎక్కువ మొత్తాన్ని పెంచడం వల్ల రైతులకు ఊరట లభించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని వ్యవసాయ రంగ నిపుణులు అంటున్నారు.

PM Kisan Amount Increase in Budget 2022: పీఎం కిసాన్ కింద రూ.6,000 కంటే ఎక్కువ మొత్తాన్ని పెంచడం వల్ల రైతులకు ఊరట లభించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని వ్యవసాయ రంగ నిపుణులు అంటున్నారు.

PM Kisan Amount Increase in Budget 2022: పీఎం కిసాన్ కింద రూ.6,000 కంటే ఎక్కువ మొత్తాన్ని పెంచడం వల్ల రైతులకు ఊరట లభించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని వ్యవసాయ రంగ నిపుణులు అంటున్నారు.

  PM Kisan Amount Increase in Budget 2022 : రాబోయే బడ్జెట్ 2022లో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టే అవకాశం ఉంది.  ఇందులోనూ ముఖ్యంగా గ్రామీణ, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వం 2022 బడ్జెట్‌లో రైతుల అభ్యున్నతి కోసం అనేక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. వీటిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇచ్చే మొత్తంలో పెంచే అవకాశం ఉంది. పీఎం కిసాన్ కింద రూ.6,000 కంటే ఎక్కువ మొత్తాన్ని పెంచడం వల్ల రైతులకు ఊరట లభించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని వ్యవసాయ రంగ నిపుణులు అంటున్నారు. ఇదిలాఉంటే మహమ్మారి వల్ల పెద్దగా ప్రభావితం కాని ఏకైక రంగం వ్యవసాయం. ఈ బడ్జెట్‌లో పీఎం కిసాన్‌తో పాటు రైతులకు అనేక ఇతర ఉపశమనాలను ప్రభుత్వం ప్రకటించవచ్చని నిపుణులు అంటున్నారు. కేంద్ర  ప్రభుత్వం 2022 బడ్జెట్‌లో PM కిసాన్ సమ్మాన్ నిధి కింద మొత్తాన్ని పెంచితే, భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు కనిపిస్తాయని IIFL సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ (పరిశోధన) అనూజ్ గుప్తా అంచనా వేశారు. ఇది రైతుల ఆదాయాన్ని పెంచడంలో సహాయపడటమే కాకుండా, పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో ఇది వారికి ఉపశమనం లభిస్తుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా వ్యవసాయానికి వినియోగించే ఎరువులు, విత్తనాలు, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో  పిఎం కిసాన్‌ను పెంచడం ఖచ్చితంగా రైతులకు ఉపశమనం కలిగిస్తుందని అంచనా వేస్తున్నారు.

  Term Policy Premiums: టర్మ్ పాలసీలను తీసుకోవాలనుకుంటున్నారా..? ఈ విషయం తప్పక తెలుసుకోండి..


  దిగుబడి పెరుగుతుంది, వినియోగం పెరుగుతుంది

  ప్రముఖ ఆర్థిక నిపుణుడు అనూజ్ గుప్తా మాట్లాడుతూ, రైతులకు ఎక్కువ డబ్బు వస్తే, వారు తమ దిగుబడిని పెంచుకోవడానికి దానిని ఉపయోగించుకునే అవకాశంఉందని తెలిపాను. ప్రభుత్వం తాజాగా ఎడిబుల్ ఆయిల్‌కు సంబంధించిన పథకాన్ని ప్రారంభించింది. పీఎం కిసాన్‌ను పెంచడంతో రైతులు నూనెగింజల పంటల దిగుబడిని పెంచుకోవచ్చు. దిగుబడిని పెంచడం ద్వారా రైతులకు ఆదాయం పెరుగుతుంది. తద్వారా వారు మునుపటి కంటే ఎక్కువ ఖర్చు చేయగలుగుతారు. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

  ఈ మొత్తాన్ని పెంచాలని ఇప్పటికే డిమాండ్‌ వచ్చింది

  పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఈ మొత్తాన్ని పెంచాలని గతంలో చాలాసార్లు డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని పెంచే ప్రకటన వెలువడవచ్చని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఏటా రూ.6వేలు రైతుల ఖాతాలకు 3 విడతలుగా అందజేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ మొత్తాన్ని రూ.8,000కు పెంచవచ్చని చెబుతున్నారు. అంటే రైతులకు ఏడాదికి రూ.2000 చొప్పున నాలుగు వాయిదాలు ఇవ్వవచ్చు.

  Youtube Video: ఈ వీడియోకు 1000 కోట్ల వ్యూస్ వచ్చాయి.. చరిత్రను తిరగరాసిన ఈ వీడియోలో ఏముందో తెలుసా..


  13 కోట్ల రైతు కుటుంబాలకు 20,900 కోట్లు

  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2022 జనవరి 1న రైతుల ఖాతాలో పీఎం కిసాన్ 10వ విడతను విడుదల చేశారు. దీని వల్ల 13 కోట్ల రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాలకు రూ.20,900 కోట్లు బదిలీ అయ్యాయి. ఈ పథకం కింద రూ.1.38 లక్షల కోట్లకు పైగా గౌరవ ధనాన్ని రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు.

  First published:

  Tags: PM KISAN

  ఉత్తమ కథలు