హోమ్ /వార్తలు /బిజినెస్ /

Union Budget 2022: MSMEలకు శుభవార్త, ECLGS రూ. 5 లక్షల కోట్లకు పెంపు, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ పథకం వచ్చే ఏడాది వరకు..అమలు..

Union Budget 2022: MSMEలకు శుభవార్త, ECLGS రూ. 5 లక్షల కోట్లకు పెంపు, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ పథకం వచ్చే ఏడాది వరకు..అమలు..

Union Budget 2022: ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS)ని మార్చి 2023 వరకు పొడిగించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గ్యారెంటీ కవర్‌ను రూ. 50వేల కోట్ల నుంచి మొత్తం రూ. 5 లక్షల కోట్లకు పెంచనున్నారు.

ఇంకా చదవండి ...

Union Budget 2022: ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS)ని మార్చి 2023 వరకు పొడిగించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గ్యారెంటీ కవర్‌ను రూ. 50వేల కోట్ల నుంచి మొత్తం రూ. 5 లక్షల కోట్లకు పెంచనున్నారు. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో MSME (సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు) కోసం పెద్ద ప్రకటనగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. MSMEల కోసం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS)ని రూ. 5 లక్షల కోట్లకు పొడిగించారు. ఆర్థిక మంత్రి అంచనా ప్రకారం మొత్తం 130 లక్షల MSMEలు దీని ద్వారా ప్రయోజనం పొందుతాయని తెలిపారు. అంతేకాదు ECLGS మార్చి 2023 వరకు పొడిగించారు. ECLGS విస్తరణ MSME రంగానికి రుణాలు ఇవ్వడానికి ఒక వరం అవుతుంది. అదే సమయంలో, CGTSME సంస్కరణల ద్వారా బ్యాంకులకు రుణాలు ఇవ్వడానికి అదనపు ప్రోత్సాహకాలను అందిస్తుంది.

ECLGS అంటే ఏమిటి

ECLGS అనేది MSMEల కోసం ఒక ప్రత్యేక రుణ పథకం. ఇది స్వావలంబన భారతదేశం ప్రచారం కింద అమలు చేస్తున్నారు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో MSME రంగానికి సహాయం చేయడానికి 13 మే 2020న ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఉపశమన ప్యాకేజీ కింద దీన్ని ప్రకటించారు. గతంలో ఈ స్కీమ్ గడువు 31 అక్టోబర్ 2020 వరకు రూ. 3 లక్షల కోట్ల రుణం కేటాయింపు వరకు మాత్రమే ఉంది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం, ప్రభుత్వ అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకం (ECLGS) 30 నవంబర్ 2020 వరకు పొడిగించారు. 'ECLGS 4.0' పొడిగింపు కింద అనేక సార్లు ఆసుపత్రులు, నర్సింగ్‌హోమ్‌లు, క్లినిక్‌లు, మెడికల్ కాలేజీలకు ఆన్-సైట్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు కోసం ఇచ్చే 2 కోట్ల రూపాయల వరకు రుణాలపై 100% గ్యారెంటీ కవర్‌ను అందించాలని పేర్కొన్నారు. దీనికి వడ్డీ రేటు 7.5 శాతంగా నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

First published:

Tags: Union Budget 2022

ఉత్తమ కథలు