BUDGET 2022 DATE TIME KEY THINGS TO WATCH OUT FOR GH VB
Budget 2022: త్వరలో కేంద్ర బడ్జెట్.. రూ.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్..?ఆ మినహాయింపులు కూడా ఉంటాయా..?
నిర్మలా సీతారామన్ (ఫైల్)
దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం (Central Government) బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తూ వస్తోంది. పార్లమెంట్ సాక్షిగా భారత ఆర్థిక ప్రగతిని, గత అర్థిక సంవత్సరంలో జరిగిన అభివృద్ధి గురించి కేంద్ర ఆర్థిక మంత్రి (financial minister) వివరిస్తారు. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్‌లో ఆర్థిక సంవత్సరం 2022-2023కి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.
దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం (Central Government) బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తూ వస్తోంది. పార్లమెంట్ సాక్షిగా భారత ఆర్థిక ప్రగతిని, గత అర్థిక సంవత్సరంలో జరిగిన అభివృద్ధి గురించి కేంద్ర ఆర్థిక మంత్రి (financial minister) వివరిస్తారు. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్‌లో ఆర్థిక సంవత్సరం 2022-2023కి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తరఫున నిర్మలా సీతారమన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటం ఇది నాలుగోసారి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ను ఎప్పుడు, ఏ సమయంలో ప్రవేశపెడతారు, నిర్మలా సీతారామన్ బడ్జెట్ నుంచి సామాన్యుడు ఏం ఆశిస్తున్నాడో తెలుసుకుందాం.
బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ, సమయం
కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రక్రియ 90 నిమిషాల నుంచి 120 నిమిషాల మధ్య ముగిసే అవకాశం ఉంది. అయితే గత బడ్జెట్ స్పీచ్ పూర్తయ్యేందుకు దాదాపు 2 గంటల 40 నిమిషాలు పట్టింది. స్వతంత్ర భారత దేశంలో సుదీర్ఘ బడ్జెట్ ఉపన్యాసంగా రికార్డుకెక్కింది.
ప్రత్యక్షంగా చూడాలంటే?
బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని దేశంలోని ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించేందుకు అవకాశం ఉంది. లోక్ సభ టీవీ ద్వారా కానీ లేదా ఇతర న్యూస్ చానెల్స్ ద్వారా కానీ ప్రజలు తిలకించవచ్చు. అంతేకాకుండా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ద్వారా కూడా చూడవచ్చు.
ఏం ఆశించవచ్చు?
కరోనా (Crona)తో సామాన్యుడి ఆర్థిక పరిస్థితి పూర్తిగా చితికిపోయింది. అంతేకాకుండా హాస్పిటల్స్‌లో కోవిడ్-19 చికిత్స రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే సామాన్యుడి నడ్డిని విరిచేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యుడిపై భారం తగ్గించేలా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఉండబోతుందని సమాచారం. గత సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా హెల్త్ కేర్ (Health Care), ఇన్సూరెన్స్ (Insurance) సెక్టార్లకు బడ్జెట్ పెద్ద పీట వేసే అవకాశం ఉంది. గత బడ్జెట్‌లో వ్యాక్సినేషన్ కోసం ఏకంగా 35 వేల కోట్లను కేటాయించారు. ఈసారి కూడా వ్యాక్సినేషన్ కోసం పెద్ద మొత్తంలో కేటాయించే అవకాశం ఉంది. అంతేకాకుండా గ్రామాల్లో ఆర్థిక వృద్ధి సాధించేలా నిర్మలా సీతారామన్ కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. గ్రామాల్లో ఉండే ఫ్యాక్టరీలకు పీఎల్ఐ (PLI) స్కీమ్ ద్వారా గ్రాంట్లు అందించే అవకాశం ఉంది.
ఇంకేం ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు?
80C పరిమితి పెంచాలని చాలా మంది ఆశిస్తున్నారు. దీని ద్వారా ప్రస్తుతం 1.5 లక్షల వరకు ట్యాక్స్ బెన్‌ఫిట్స్ (Benefits)ను పొందుతున్నారు. దీనిని మరింతగా పెంచాలని పన్ను చెల్లింపుదారులు కోరుకుంటున్నారు. నిర్మలా సీతారామన్ కూడా 80Cపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. దీంతో పాటు ఇన్‌కమ్ ట్యాక్స్ రేట్స్ (Income Tax Rates) శ్లాబ్‌లను తగ్గించాలని పన్ను చెల్లింపు దారులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచేలా నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నారు. అదే విధంగా సీనియర్ సిటిజన్ (senior Citizen) ఆదాయ పన్ను పరిమితిని రూ. 10 లక్షలకు పెంచాలని కోరుకుంటున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.