హోమ్ /వార్తలు /బిజినెస్ /

Budget 2021: పాత వాహనాల Scrappage policy ప్రకటించిన నిర్మల..డొక్కు వాహనాలు చెత్తలోకే..

Budget 2021: పాత వాహనాల Scrappage policy ప్రకటించిన నిర్మల..డొక్కు వాహనాలు చెత్తలోకే..

బడ్జెట్ 2021 సమావేశాల్లో ఆర్థిక మంత్రి స్క్రాప్ పాలసీ ప్రస్తావించారు. దీంతో కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్ కు ఇచ్చేలా పథకం రూపొందించినట్లు తెలిపారు.

  పాత వాహనాలతో పెరిగిపోతున్న ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత వాహనాలను స్క్రాప్ గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. దీనికి సంబంధించి బడ్జెట్ 2021 సమావేశాల్లో ఆర్థిక మంత్రి స్క్రాప్ పాలసీ ప్రస్తావించారు. దీంతో కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్ కు ఇచ్చేలా పథకం రూపొందించినట్లు తెలిపారు. పాత వాహనాలతో పెరుగుతున్న కాలుష్యానికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక విధానం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా వ్యక్తిగత వాహనాలు 25 ఏళ్లు, కమర్షియల్‌ వాహనాలు 15 ఏళ్లు దాటినా  వాహనాలను  స్క్రాప్ గా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. లైఫ్ టైం అయిపోయిన వాహనాలను స్క్రాప్ కు అమ్ముకుంటే కొత్త వెహికల్ కొనుగోళ్లకు రాయితీ కలిగించేలా పథకం రూపొందించారు.

  కాగా పొల్యూషన్ ప్రమాదాలను తగ్గించడం, ఎలక్ట్రికల్ వెహికల్స్ ను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వెహికిల్ స్క్రాప్ పాలసీని తీసుకొచ్చింది. అయితే ఈ చర్య ద్వారా ఆటోమొబైల్ రంగానికి బూస్ట్ దక్కనుంది. అలాగే స్క్రాప్ కింద వచ్చే పాత వాహనాల తో ఆటోమొబైల్ సంస్థలు కొత్త వాహనాలను తయారుచేసే అవకాశం దక్కింది. ప్రస్తుతం మన దేశంలో 30 నుంచి 40 ఏళ్ల వరకు వాహనాలు నడుస్తున్నాయి. కొత్త పాలసీతో పాత వాహనాలకు చెత్తలోకి వెళ్లిపోతున్నాయి.

  ఇదిలా ఉంటే దేశంలో ఇప్పటికే దాదాపు రెండున్నర కోట్లకు పైగా కాలం చెల్లిన పాత వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాలన్నింటీని స్క్రాప్ కింద వేస్తే ఆటోమొబైల్ కంపెనీలకు స్క్రాప్ సరఫరా పెరగనుంది. పాత ఇనుము తో కంపెనీలు కొత్త బండ్లు తయారీ చేయనున్నాయి పొల్యూషన్ తగ్గించడానికి ఎలక్ట్రిక్ బండ్లను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీంతో డీజిల్ , పెట్రోల్ ఆదాతోపాటు పర్యావరణాన్ని కాపాడవచ్చు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రం రాయితీ ఇస్తుంది. స్క్రాప్ కింద అమ్మే వాహనాలకు కేంద్రం స్పెషల్ ప్యాకేజీ ఇవ్వనుంది.

  First published:

  Tags: Budget 2021, Business

  ఉత్తమ కథలు