• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • BUDGET 2021 FOOD DELIVERY SECTOR DEMANDS TO RATIONALISE GST ON FOOD DELIVERY BIZ TO 5 PERCENT SU GH

Budget 2021: ఫుడ్ డెలివరీపై జీఎస్టీ తగ్గించాలని డిమాండ్..

ప్రతీకాత్మక చిత్రం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు దగ్గర పడుతుండటంతో ఈసారి తమకు ప్రయోజనాలు కల్పించాలని వివిధ రంగాల ప్రతినిధులు కేంద్రాన్ని కోరుతున్నారు.

  • Share this:
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు దగ్గర పడుతుండటంతో ఈసారి తమకు ప్రయోజనాలు కల్పించాలని వివిధ రంగాల ప్రతినిధులు కేంద్రాన్ని కోరుతున్నారు. తాజాగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీపై ఉన్న జీఎస్‌టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని రెస్టారెంట్ల సంఘం, ఫుడ్ డెలివరీ రంగం డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యాపారం విలువ సుమారు మూడు బిలియన్ డాలర్లుగా ఉంది. హోటళ్లు లేదా రెస్టారెంట్లలో తినే కస్టమర్లకు డైన్-ఇన్ టాక్స్ రేటు 5 శాతంగా ఉంది. దీంతో పోలిస్తే ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీపై జీఎస్‌టీ అత్యధికంగా 18 శాతంగా ఉంది. అంటే ఇళ్లు లేదా ఆఫీసులకు ఫుడ్ ఆర్డర్ చేసుకునే వినియోగదారులు 13 శాతం ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వస్తోంది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో దీన్ని కూడా ఐదు శాతానికి తగ్గించాలని ఫుడ్ డెలివరీ రంగానికి చెందిన ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.

భారతదేశంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఫూజా ఫుడ్స్ (Fooza Foods) వ్యవస్థాపకులు, ఎండీ దిబ్యెందు బెనర్జియా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విభాగం మార్కెట్ విలువ 2.94 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంట్లో వృద్ధి 22 శాతం చొప్పున పెరుగుతోంది. అయినప్పటికీ GST కారణంగా ఈ విభాగం ఒడిదొడుకులు ఎదుర్కొంటుందని ఆయన వివరిస్తున్నారు. "ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ ప్రొవైడర్లపై 18 శాతం GST రేటు ఉంది. ఈ స్లాబ్ రేటు ఈ రంగం వృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. GST రేట్లు తగ్గించడం వల్ల ప్రజలు ఆహారంపై చేసే ఖర్చులు తగ్గుతాయి. దీంతోపాటు ఈ విభాగంలో ఎక్కువ ఉద్యోగాలు సృష్టించవచ్చు" అని ఆయన చెప్పారు. కరోనా తరువాత రెస్టారెంట్లలో డైన్ ఇన్ పూర్తిగా ఓపెన్ కాలేదు. దీంతో రెస్టారెంట్లు ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా 23-24 శాతం ఎక్కువగా కమీషన్ తీసుకుంటున్నాయి. ఇది కూడా ఫుడ్ డెలివరీ విభాగంపై ప్రభావం చూపిస్తుందని దిబ్యెందు తెలిపారు.

ప్రతికూలతలు ఉన్నాయి
ఒకే రంగానికి చెందిన వ్యాపారంలో సమానత్వం ఉండాలని దిబ్యెందు బెనర్జియా చెప్పారు. ట్యాక్స్ రేట్లలో తేడాల వల్ల కొత్త ఫ్రాంచైజ్‌ అవుట్‌లెట్లతో రెస్టారెంట్లు వ్యాపారాన్ని వృద్ధి చేసుకోలేకపోతున్నాయని తెలిపారు. ఫుడ్ బిల్స్‌పై ప్రస్తుతం ఉన్న ఐదు శాతం GSTతో పోలిస్తే రాయల్టీ, ఫ్రాంచైజ్ ఫీజుపై GST 18 శాతంగా ఉందని బెనర్జీయా పేర్కొన్నారు. లాక్‌డౌన్ తరువాత హోమ్ డెలివరీ సేల్స్ 60 శాతానికి పరిమితమైనట్లు ప్లాటర్ హాస్పిటాలిటీ డైరెక్టర్ శిలాదిత్య చౌదరి చెబుతున్నారు. అమ్మకాలు కోవిడ్ ముందునాటి పరిస్థితులకు దగ్గరవుతున్నప్పటికీ ధరలు పెంచలేకపోతున్నామని, రెస్టారెంట్లు ఎక్కువ కమీషన్ తీసుకుంటున్నాయని ఆయన వివరిస్తున్నారు. వ్యాక్సిన్ పంపిణీ తరువాత రెస్టారెంట్లకు వచ్చే వినియోగదారుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Published by:Sumanth Kanukula
First published: