Budget 2021: ఫిబ్రవరి 1న నూతన బడ్జెట్.. ఉద్యోగుల ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులుండేనా?

(ప్రతీకాత్మకచిత్రం)

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి (Ministry of Finance) నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఫిబ్రవరి 1న 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్(Budget)ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.

  • Share this:
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి (Ministry of Finance) నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఫిబ్రవరి 1న 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్(Budget)ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. కరోనా(Corona) మహమ్మారి నేపథ్యంలో కుదేలైన ఆర్థిక రంగాన్ని గాఢిలో పెట్టేందుకు ఈ బడ్జెట్లో తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ బడ్జెట్ ఉద్యోగాలు సృష్టించే విధంగా, ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు వారి చేత్తుల్లో మరింత డబ్బు ఉండేలా చర్యలు ఉండే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర బడ్జెట్పై పలు రంగాల వారు ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు(Employees) తమ ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచడంపై ఈ బడ్జెట్లో నిర్ణయాలుంటాయని యోచిస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను మినహాయింపు పరిమితిని 2.5 లక్షల నుంచి 5 లక్షలకు పెంచే ప్రకటన వెలువడవచ్చునని వారు భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం అమల్లో ఉన్న హయ్యర్ స్టాండర్డ్ డిడక్షన్(Higher Standard Deduction)ను రూ.50 వేల నుండి రూ.75 వేలు లేదా రూ. లక్షకు పెంచవచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుత పన్ను స్లాబ్‌ల ప్రకారం రూ .2.5- నుండి 5 లక్షల మధ్య ఆదాయానికి 5 శాతం, రూ .5- నుండి 10 లక్షలకు ఆదాయానికి 20 శాతం, రూ .10 లక్షల కన్నా ఎక్కువ ఆదాయానికి 30 శాతం మేర పన్ను వసూలు చేస్తున్నారు. నూతన బడ్జెట్లో ఈ పన్ను శ్లాబు(tax slabs)లను సవరించి ఉద్యోగులకు ఊరటనిచ్చేలా నిర్ణయాలు ఉంటాయని వారు భావిస్తున్నారు.

సెక్షన్ 80సి కింద ఈసారైనా పన్ను మినహాయింపు పెరుగనుందా?
కాగా, ఇటీవల ప్రవేశపెట్టిన ఏ బడ్జెట్లోనూ సెక్షన్ 80సి(Section 80C)కి సవరణలు చేయలేదన్న విషయం తెలిసిందే. ఈ సెక్షన్ కింద ఈపీఎఫ్(EPFO), లైఫ్ ఇన్సురెన్స్ ప్రీమియం, పిల్లల విద్యకు సంబంధించిన ట్యూషన్ ఫీజులు, హోంలోన్(Home Loan), ఈఎల్ఎస్ఎస్, ఫిక్స్డ్ డిపాజిట్లపై పన్ను మినహాయింపు వంటివి లభిస్తున్నాయి. వీటన్నింటిపై 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు(Tax Exemption) పొందవచ్చు. అయితే, ఈ మినహాయింపు పరిమితిని మరింత పెంచాలని, ప్రస్తుత ద్రవ్యోల్భణంతో పోల్చితే వీటి ద్వారా లభించే ప్రయోజనం తక్కువేనని ఉద్యోగులు చెబుతున్నారు.

ఈ క్రమంలో సెక్షన్ 80సీ కింద మినహాయింపు పరిమితిని రూ.2 లక్షల వరకు పెంచాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. వారి అభ్యర్థనపై సానుకూల చర్యలు ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా, సెక్షన్ 80 డి (Section 80D )కింద ఆరోగ్య బీమా ప్రీమియం(Health Insurance Premium)పై లభించే రూ .25 వేల పన్ను మినహాయింపు పరిమితిని మరింత పెంచాలని కేంద్రం యెచిస్తున్నట్లు తెలుస్తోంది.
Published by:Sumanth Kanukula
First published: