BUDGET 2021 EXPECTATIONS FOR NPS AN INCREASE IN THE LIMIT OF NPS INVESTMENT MK GH
Budget 2021: నూతన బడ్జెట్‌పై ఉద్యోగుల్లో భారీ ఆశలు.. NPS కాంట్రిబ్యూషన్ లిమిట్ పెంపుపై దృష్టి..
నిర్మల సీతారామన్ (Image;ANI)
Budget 2021: ఈ సారైనా జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS) లో మార్పులు ఉంటాయని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పదవీ విరమణ కోసం ఏర్పాటు చేసిన ఎన్‌పిఎస్ పెట్టుబడిపై మరింత అనుకూలమైన చర్యలు ఉంటాయని వారు భావిస్తున్నారు.
2021–2022 కేంద్ర బడ్జెట్(Budget) ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధానంలో కరోనా(Carona) మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాఢిలో పెట్టేందుకు మోదీ ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్లో తీసుకునే నిర్ణయాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సారైనా జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS) లో మార్పులు ఉంటాయని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పదవీ విరమణ కోసం ఏర్పాటు చేసిన ఎన్‌పిఎస్ పెట్టుబడిపై మరింత అనుకూలమైన చర్యలు ఉంటాయని వారు భావిస్తున్నారు. కాగా, ప్రస్తుతం, ఎన్‌పిఎస్ చందాదారులకు సెక్షన్ 80CCD(1B) కింద ఏడాదికి రూ .50,000 గరిష్ట పన్ను ప్రయోజనం లభిస్తుంది. అదేవిధంగా, సెక్షన్ 80CCD(1B) కింద లభించే పన్ను మినహాయింపు సెక్షన్ 80CCD(1) కింద లభించే మినహాయింపు కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే, NPSలో తమ వాలెంటరీ కాంట్రిబ్యూషన్‌ను పెంచాలని గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల సంకేతాలు వెలువడలేదు. అయితే, 2021–22 బడ్జెట్లో అయినా మోదీ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి ఎన్‌పిఎస్ కంట్రిబ్యూషన్ పెంచుతుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనికి అనుగుణంగా, రూ.50,000లుగా ఉన్న స్వచ్చంద సహకార పరిమితిని రూ .1,00,00 లేదా రూ.1,50,000 లకు పెంచాలని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
కాగా, దీనిపై MyWealthGrowth.com సహ వ్యవస్థాపకుడు హర్షద్ చేతన్‌వాలా(Harshad Chetanwala) మాట్లాడుతూ ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో పన్ను చెల్లింపుదారులకు సెక్షన్ 80 సి కింద లభిస్తున్న మినహాయింపు పరిమితి, పన్ను ఆదాకి ఏమాత్రం సరిపోదు. అందువల్ల, ప్రభుత్వం వాలెంటరీ కాంట్రిబ్యూషన్‌ను పెంచడంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి. తద్వారా ప్రజలు పన్ను ఆదా చేసుకోవటానికి, వారి దీర్ఘకాలిక పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఇది సహాయపడుతుంది.”అని అన్నారు.
వాలెంటరీ కాంట్రిబ్యూషన్ లిమిట్ పెంపుపై భారీ ఆశలు..
కాగా, ప్రస్తుతం అమల్లో ఉన్న దాని ప్రకారం చూస్తే ఎన్‌పిఎస్‌లో పెట్టుబడిపై ఐ-టి చట్టంలోని సెక్షన్ 80CCD(1), సెక్షన్ 80CCD(1B), సెక్షన్ 80CCD(2) కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే, ఈ సెక్షన్ల కింద లభించే పన్ను మినహాయింపు మొత్తం ఆర్థిక సంవత్సరంలో రూ .1.5 లక్షలకు మించకూడదనే నిబంధన ఉంది.
అయితే, ఎన్‌పిఎస్(NPS) చందాదారులకు వాలెంటరీ కాంట్రిబ్యూషన్ కింద వారు పెట్టిన పెట్టుబడిపై రూ .50 వేల పన్ను మినహాయింపు లభిస్తుంది. దీనిలో పెట్టుబడి పన్ను రహితంగా ఉంటుంది. అంతేకాక, పదవీ విరమణ తరువాత, ఉద్యోగి తన ఎన్‌పిఎస్ కార్పస్ ఫండ్(corpus fund)లో 60 శాతం వరకు ఒకేసారి ఉపసంహరించుకోవచ్చు.
మిగిలిన 40 శాతం యాన్యుటీ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. కాగా, ఎన్‌పిఎస్ (NPS) చందాదారులకు ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను ప్రయోజనాలను ఈ బడ్జెట్లో మార్పులు చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.