Union Budget 2020: కొత్త టాక్స్ సిస్టం...పాత టాక్స్ సిస్టం...ఏది బెటర్..?

(ప్రతీకాత్మక చిత్రం)

మీ ఆదాయం సంవత్సరానికి రూ.8 లక్షలు అయితే డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకుంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.. అదే కొత్త టాక్స్ ప్రకారం చెల్లించాల్సి పన్ను ఎంతో తెలుసా...?

  • Share this:
కేంద్ర బడ్జెట్ లో కొత్త పన్నువిధానం సామాన్యులకు ఎన్నో సందేహాలు నింపుతోంది. నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2020లో ఈ సారి ఆదాయపన్నులో ఏడు శ్లాబుల విధానం ప్రవేశపెట్టారు. అయితే ఈ కొత్త పన్నుల విధానం ప్రవేశపెడుతూ ఒక కొత్త మెలిక పెట్టారు. ఆదాయం పన్ను చెల్లింపుదారులు పాత, కొత్త స్లాబుల్లో ఏదోఒక స్లాబును ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఏడాదికి ఐదు లక్షల రూపాయల ఆదాయం వరకు వచ్చేవారు ఏ స్లాబును ఎంపిక చేసుకున్నా ఫర్వాలేదు. ఎందుకంటే రెండింటిలోను వారికి తేడా లేదు. ఏడు స్లాబులు గల కొత్త విధానాన్ని ఎంపిక చేసుకునేవారు 80 సీ, 80 డీ కింద వచ్చే మినహాయింపులను వదులుకోవాలి. అప్పుడే కొత్త విధానం వర్తిస్తుంది. టాక్స్ డిడక్షన్స్ వదులుకోవద్దు అనుకునే వారు వారు పాత స్లాబులోనే కొనసాగవచ్చు. కొత్త పన్ను ప్రకారం రూ.5 లక్షల దాకా పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. కొత్త శ్లాబులు రూ.5-10 లక్షలు, రూ.5-7.5 లక్షలు, రూ.7.5-10 లక్షలు, రూ.10-12.5 లక్షలు, రూ. 15 లక్షలు ఆపైనవిగా ప్రకటించారు. అయితే కొత్త శ్లాబుల్లో రూ.15లక్షలు సాలీనా ఆదాయం కలిగి ఉంటే పాత పద్ధతిలోనే 30 శాతం టాక్స్ కట్టాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే కొందరికి కొత్త పన్నుచెల్లింపుల విధానం కంటే పాత శ్లాబుల విధానం ద్వారానే తక్కువ పన్ను చెల్లించే వీలు దక్కుతుందని టాక్స్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా డిడక్షన్స్ వల్ల పన్ను చెల్లించే మొత్తం మిగులుతుందని అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన లెక్కలు సైతం చెబుతున్నారు. ముఖ్యంగా section 80C ప్రకారం మీ పెట్టుబడులను రూ.1.50 లక్షల వరకూ మినహాయింపు చూపించుకునే అవకాశం ఉంది. అలాగే section 80CCD (1B) కింద మరో అదనపు డిడక్షన్ రూ.50 వేల వరకూ చూపించవచ్చు. అలాగే NPS contribution, house rent allowance, housing loan interest వంటివి కూడా డిడక్షన్స్ కింద చూపించే అవకాశం ఉంది. అయితే కొత్త టాక్స్ విధానంలో ఈ డిడక్షన్స్ చూపించాల్సిన అవసరం లేదు. అయితే కొత్త టాక్స్ విధానంలో section 80CCD(2) కింద ఉన్న National Pension System (NPS) పన్ను విధానం మాత్రం కొనసాగుతుంది. అయితే కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి ఈ కొత్త పన్ను రాయితీలో ఈ అవకాశం ద్వారా మీ వేతనంలో 10 శాతం( బేసిక్ పే మీద) మినహాయింపు లభిస్తుంది. అలాగే ప్రభుత్వం ఉద్యోగులపై అయితే ఈ లిమిట్ 14 శాతం వరకూ ఉంది. అలాగే section 80TTA కింద సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా కంటిన్యూ అవుతోంది.

అలాగే ఒక వేళ మీ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్, section 80C కిందకు వస్తే అది డిడక్షన్ కిందకు వెళ్లిపోతుంది. అలాగే section 24 (b) కింద హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ డిడక్షన్స్ చూపించుకునే అవకాశం ఉంది. ఈ కింది పట్టికలో నూతన టాక్స్ విధానంపై సమగ్రమైన విశ్లేషణ ఉంది. మీ కోసం...

(Image: Money Control)


ఉదాహరణకు మీ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షలు అయినట్లయితే ఎంత టాక్స్ కట్టాల్సి ఉంటుందో చూద్దాం..
పాత టాక్స్ పద్ధతి డిడక్షన్స్ ప్రకారం, సెక్షన్ 80 సీ కింద రూ.1.50 లక్షలు, స్టాండర్డ్ డిడక్షన్స్ కింద 50 వేలు, ఎన్పీఎస్ కింద రూ.50 వేలు, సెక్షన్ 80 డి హెల్త్ ఇన్సురెన్స్ కింద రూ.50 వేలు అప్పుడు మీ పన్ను మినహాయింపు ఆదాయం దాదాపు రూ.3 లక్షలు దాకా పొందే అవకాశం ఉంది. అప్పుడు మీకు పన్ను విధించే ఆదాయం రూ. 5 లక్షలుగా ఉంటుంది. అప్పుడు పాతపన్ను విధానం ప్రకారం మీరు రూ.2.5 నుంచి రూ.5 లక్షల మధ్య ఆదాయం ఉన్నట్లయితే 5 శాతం చొప్పున రూ. 12500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే రూ.5 లక్షల లోపు మీ ఆదాయం ఉన్నట్లయితే సెక్షన్ 87A కింద టాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు.

అదే కొత్త టాక్స్ సిస్టం ప్రకారం చూసినట్లయితే మీ సంపాదన ఏడాదికి రూ.8 లక్షలు అయితే, ఇందులో ఎలాంటి డిడక్షన్స్ ఉండవు. మీరు పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ.8 లక్షలపై దాదాపు రూ.45 వేల వరకూ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు పాత పన్ను విధానమే బెటర్ అంటున్నారు నిపుణులు.
Published by:Krishna Adithya
First published: