Budget 2019: ఈసారి ట్యాక్స్ శ్లాబ్ మారుతుందా? వివరాలు తెలుసుకోండి...

2018 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబ్ మార్చలేదు. కాకపోతే ఆదాయపు పన్నులో కొన్ని మార్పులు చేశారు. పర్సనల్ ఇన్‌కమ్ ట్యాక్స్ సెస్‌లో మార్పులు చేశారు. అది ఆదాయపు పన్ను రేట్లపై ప్రభావం చూపించింది.

news18-telugu
Updated: January 16, 2019, 4:35 PM IST
Budget 2019: ఈసారి ట్యాక్స్ శ్లాబ్ మారుతుందా? వివరాలు తెలుసుకోండి...
2018 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబ్ మార్చలేదు. కాకపోతే ఆదాయపు పన్నులో కొన్ని మార్పులు చేశారు. పర్సనల్ ఇన్‌కమ్ ట్యాక్స్ సెస్‌లో మార్పులు చేశారు. అది ఆదాయపు పన్ను రేట్లపై ప్రభావం చూపించింది.
  • Share this:
మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశ ప్రజలంతా ఎన్నికల బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి ట్యాక్స్ శ్లాబ్స్ మారతాయా అన్న చర్చ పన్ను చెల్లింపుదారుల్లో జరుగుతోంది. అయితే ఇది ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ కావడంతో ట్యాక్స్ పేయర్స్‌ని ప్రసన్నం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వరాలు కురిపిస్తుందన్న వాదన వినిపిస్తోంది. 2018 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబ్ మార్చలేదు. కాకపోతే ఆదాయపు పన్నులో కొన్ని మార్పులు చేశారు. పర్సనల్ ఇన్‌కమ్ ట్యాక్స్ సెస్‌లో మార్పులు చేశారు. అది ఆదాయపు పన్ను రేట్లపై ప్రభావం చూపించింది.

ప్రస్తుతం ఉన్న ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబ్

- వార్షికాదాయం రూ.2,50,000 కన్నా తక్కువ ఉన్నవాళ్లు ఎవరైనా ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు.
- 60 ఏళ్లలోపు వయస్సు ఉన్నవాళ్లు వార్షికంగా రూ.2,50,000 నుంచి రూ.3,00,000 ఆదాయం పొందుతున్నట్టయితే 5 శాతం ఆదాయపు పన్ను చెల్లించాలి. ఈ ట్యాక్స్‌ శ్లాబ్‌లో 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు.
- 60 ఏళ్లలోపు వయస్సు ఉన్నవాళ్లు వార్షికంగా రూ.3,00,000 నుంచి రూ.5,00,000 ఆదాయం పొందుతున్నట్టయితే 5 శాతం ఆదాయపు పన్ను చెల్లించాలి. ఈ ట్యాక్స్‌ శ్లాబ్‌లో 60 ఏళ్లు దాటిన వృద్ధులు కూడా 5 శాతం ఆదాయపు పన్ను చెల్లించాలి. ఈ శ్లాబ్‌లో 80 ఏళ్లు దాటిన కురువృద్ధులు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు.
- 60 ఏళ్లలోపు వయస్సు ఉన్నవాళ్లు వార్షికంగా రూ.5,00,000 నుంచి రూ.10,00,000 ఆదాయం పొందుతున్నట్టయితే 20 శాతం ఆదాయపు పన్ను చెల్లించాలి. ఈ ట్యాక్స్‌ శ్లాబ్‌లో 60 ఏళ్లు దాటిన వృద్ధులు కూడా 20 శాతం ఆదాయపు పన్ను చెల్లించాలి. ఈ శ్లాబ్‌లో 80 ఏళ్లు దాటిన కురువృద్ధులు 20 శాతం పన్నులు చెల్లించాలి.
- ఏ వయస్సువాళ్లైనా రూ.10,00,000 కన్నా ఎక్కువ ఆదాయం పొందుతున్నట్టయితే 30 శాతం ఆదాయపు పన్ను చెల్లించాలి.గతేడాది ట్యాక్స్ శ్లాబ్స్ మార్చలేదు కానీ... కొన్ని మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇంతకుముందులా ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్(రూ.19,200), మెడికల్ రీఇంబర్స్‌మెంట్(రూ.15,000) కాకుండా స్టాండర్డ్ డిడక్షన్(ప్రామాణిక తగ్గింపు) రూ.40,000 ప్రవేశపెట్టింది. ఇంతకుముందు రూ.19,200+రూ.15,000= రూ.34,200 మినహాయింపు ఉంటే ప్రస్తుతం రూ.40,000 స్టాండర్డ్ డిడక్షన్ లభిస్తుంది. అదనంగా రూ.5,800 మినహాయింపు పొందొచ్చు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు చెల్లించే ఆదాయపు పన్నుపై సెస్‌ను 3% నుంచి 4% చేశారు.

ఇవి కూడా చదవండి:

2019లో ట్యాక్స్ సేవింగ్ ఐడియాలు ఇవే... ఇప్పుడే జాగ్రత్తపడండి

ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌తో పన్ను ఆదా... ఎలా?

2018లో మారిన పర్సనల్ ట్యాక్స్ రూల్స్ ఇవే... తెలుసుకోండి

ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్: 10 లాభాలు
Published by: Santhosh Kumar S
First published: January 8, 2019, 12:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading