దేశమంతా మధ్యంతర బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముఖ్యంగా వేతనజీవులు ఆదాయపు పన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు ఉంటాయోనని వేచిచూస్తున్నారు. ప్రస్తుతం వ్యక్తిగత పన్ను మినహాయింపు రూ.2.5 లక్షలు ఉంది. రూ.2.5-5 లక్షల మధ్య ఆదాయానికి 5% పన్ను చెల్లించాలి. రూ.5-10 లక్షల మధ్య ఆదాయానికి 20%, రూ.10 లక్షల పైన ఆదాయానికి 30% పన్ను చెల్లించాలి. ప్రస్తుతం 80 ఏళ్లకు పైబడ్డ వృద్ధులకు మాత్రమే రూ.5 లక్షల మినహాయింపు ఉంది. అయితే మధ్యంతర బడ్జెట్లో పన్ను మినహాయింపు రెట్టింపు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవాళ్లు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇవి కూడా చదవండి:
Facebook Tips: మీ ఫేస్బుక్లో చేయకూడని 9 అంశాలివే...
Honor View 20 Release: 48 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ వ్యూ 20
ఆదాయపు పన్ను పరిమితిని రెట్టింపు చేయడంతో పాటు స్టాండర్డ్ డిడక్షన్(ప్రామాణిక తగ్గింపు) కూడా పెంచే అవకాశం ఉందని సమాచారం. గతంలో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ రూ.19,200, మెడికల్ రీఇంబర్స్మెంట్ రూ.15,000 ఉండేవి. గతేడాది కేంద్ర ప్రభుత్వం వీటిని తొలగించి స్టాండర్డ్ డిడక్షన్(ప్రామాణిక తగ్గింపు) రూ.40,000 చేర్చింది. గతంలో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, మెడికల్ రీఇంబర్స్మెంట్ కోసం రూ.19,200+రూ.15,000= రూ.34,200 మినహాయింపు ఉండేది. అదనంగా రూ.5,800 మినహాయింపు కలిపి రూ.40,000 స్టాండర్డ్ డిడక్షన్ లభిస్తుంది. మధ్యంతర బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్ పెంచొచ్చని అంచనా.
ఇవి కూడా చదవండి:
మూడేళ్లలో ఈ 9 జాబ్స్‌కు ఫుల్ డిమాండ్... చేయాల్సిన కోర్సులివే
జనవరిలో రిలీజైన టాప్ 5 స్మార్ట్ఫోన్లు ఇవే... ఏది బెస్ట్?
IRCTC Refund Rules: ఐఆర్సీటీసీ ఇ-టికెట్ క్యాన్సిల్ చేశారా? రీఫండ్ రూల్స్ ఇవే...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Income tax, ITR, Union Budget 2019