హోమ్ /వార్తలు /బిజినెస్ /

Budget 2019: ట్యాక్స్ రిబేట్ అంటే ఏంటీ? పన్ను చెల్లింపుదారులకు ఎంత లాభం?

Budget 2019: ట్యాక్స్ రిబేట్ అంటే ఏంటీ? పన్ను చెల్లింపుదారులకు ఎంత లాభం?

Budget 2019: ట్యాక్స్ రిబేట్ అంటే ఏంటీ? పన్ను చెల్లింపుదారులకు ఎంత లాభం?

Budget 2019: ట్యాక్స్ రిబేట్ అంటే ఏంటీ? పన్ను చెల్లింపుదారులకు ఎంత లాభం?

Union Budget 2019 | ఇప్పటి వరకు రూ.3,00,000 వరకు ట్యాక్స్ రిబేట్ లభిస్తోంది. రూ.3,00,000 ఆదాయం ఉన్నవాళ్లు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ పరిమితినే రూ.5,00,000 చేసింది కేంద్ర ప్రభుత్వం.

కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయెల్ పార్లమెంట్‌లో వేతనజీవులకు ఊరట కలిగించారు. ట్యాక్స్ రిబేట్ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. అయితే అసలు ట్యాక్స్ రిబేట్ అంటే ఏంటీ? పన్ను చెల్లింపుదారులకు ఎలా లాభం చేకూరుస్తుంది? ఎంత వరకు లాభం ఉంటుంది? ఇప్పుడు అందరిలో ఇదే చర్చ. పన్నులు చెల్లించే ప్రతీ ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 88 కింద ట్యాక్స్ రిబేట్ ఇస్తుంది. దీన్నే ట్యాక్స్ రీఫండ్ అని కూడా అంటారు. ప్రస్తుతం రూ.3,00,000 ఆదాయం ఉన్న వారికి ట్యాక్స్ రిబేట్ లభిస్తుంది. అంటే ముందు పన్ను చెల్లించినా రిటర్న్స్ ద్వారా రీఫండ్ పొందొచ్చు. ప్రస్తుతం ట్యాక్స్ రిబేట్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి.

వార్షికాదాయంసెస్ లేకుండా ట్యాక్స్రిబేట్4శాతం సెస్‌తో ట్యాక్స్
రూ.2,65,000రూ.750రూ.750రూ.0
రూ.2,70,000రూ.1000రూ.1000రూ.0
రూ.3,00,000రూ.2,500రూ.2,500రూ.0
రూ.3,50,000రూ.5,000రూ.2,500రూ.2,500+రూ.100=రూ.2600


అంటే ఇప్పటి వరకు రూ.3,00,000 వరకు ట్యాక్స్ రిబేట్ లభిస్తోంది. రూ.3,00,000 ఆదాయం ఉన్నవాళ్లు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ పరిమితినే రూ.5,00,000 చేసింది కేంద్ర ప్రభుత్వం. అంటే వార్షికాదాయం రూ.5,00,000 ఉన్నవాళ్లు ఏవైనా పన్నులు చెల్లించినా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత రీఫండ్ పొందొచ్చు. అయితే ఇందుకు సంబంధించి లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్రీమియంలు, మెడికల్ ఇన్స్యూరెన్స్, వైద్య ఖర్చులు, హౌజింగ్ లోన్, పీపీఎఫ్ లాంటి చెల్లింపులు, పెట్టుబడుల లెక్కలన్నీ చూపించి ట్యాక్స్ రిబేట్ పొందొచ్చు.

ఇక సెక్షన్ 80 సీ కింద రూ.1,50,000 అదనంగా మినహాయింపు లభిస్తుంది. అంటే రూ.5,00,000+రూ.1,50,000= మొత్తం రూ.6,50,000 వార్షికాదాయం ఉన్నవాళ్లు కూడా పన్ను మినహాయింపులు వచ్చే చెల్లింపులు, పెట్టుబడుల లెక్కలు చూపించి మినహాయింపు పొందొచ్చు. అన్నీ కరెక్టుగా ఉంటే వార్షికాదాయం రూ.6,50,000 ఉన్నా పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతకుముందు ఏవైనా పన్నులు డిడక్ట్ అయి ఉంటే, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత రీఫండ్ వస్తుంది. అయితే వార్షికాదాయం రూ.5,00,000 పైన ఉన్నవాళ్లకు మాత్రం ట్యాక్స్ రిబేట్ వర్తించదు. గతంలో వాళ్లు పన్నులు ఎలా చెల్లించారో ఇకపై అలాగే చెల్లించాల్సి ఉంటుంది.

First published:

Tags: Piyush Goyal, Union Budget 2019

ఉత్తమ కథలు