కేంద్ర బడ్జెట్ 2019లో వేతనజీవులకు భారీ ఊరట లభించే అవకాశముంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ఇలాంటి సూచనలే వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే మధ్యంతర బడ్జెట్లో వేతనజీవులకు ఊరట కలిగించే అంశాలు ఉండబోతున్నాయి. పన్నుచెల్లింపుదారులకు శుభవార్త చెప్పనుంది కేంద్ర ప్రభుత్వం. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎలాంటి శుభవార్తలు చెబుతారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు వేతనజీవులు. రాబోయే మధ్యంతర బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే ప్రత్యామ్నాలపై కసరత్తు జరుగుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆ అంశాలు ఇవే.
ఇవి కూడా చదవండి:
Paytm Petrol Offer: పేటీఎంతో పెట్రోల్ కొంటే రూ.7,500 క్యాష్ బ్యాక్
SBI CARD: ఎస్బీఐ ఏటీఎం కార్డు నుంచి డేటా కొట్టేస్తారు జాగ్రత్త
1. ట్యాక్స్ శ్లాబ్ పెంపు
ఆదాయపు పన్నులో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయనుంది. ప్రస్తుతం రూ.2.5 లక్షలు ఉన్న మొదటి శ్లాబ్‌ను రూ.5 లక్షలకు పెంచొచ్చని అంచనా. ఈ నిర్ణయం చిరుద్యోగులకు మేలు చేస్తుంది.
2. స్టాండర్డ్ డిడక్షన్ పెంపు
ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ రూ.40,000 ఉంది. గతంలో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ రూ.19,200, మెడికల్ రీఇంబర్స్మెంట్ రూ.15,000 కలిపి స్టాండర్డ్ డిడక్షన్ రూ.40,000 చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈసారి స్టాండర్డ్ డిడక్షన్ ఇంకా పెంచొచ్చు.
3. ట్యాక్స్ శ్లాబ్‌లో కొత్త రేటు
ప్రస్తుత 5 శాతం, 20 శాతం, 30 శాతం ట్యాక్స్ రేట్లు ఉన్నాయి. వీటిలోనూ పన్ను చెల్లింపుదారులకు భారం తగ్గించేందుకు ట్యాక్స్ రేట్లు మార్చాలన్న ఆలోచన ఉంది.
ఇవి కూడా చదవండి:
AADHAR NEWS: ఆధార్ కార్డు పోయిందా? ఇలా రీప్రింట్ చేసుకోవచ్చు
SBI CARD: ఎస్బీఐ ఏటీఎం కార్డు నుంచి డేటా కొట్టేస్తారు జాగ్రత్తPublished by:Santhosh Kumar S
First published:January 18, 2019, 12:55 IST