Budget 2019: మధ్యంతర బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం తాయిలాలు, వరాలు

General Budget 2019 | పన్ను చెల్లింపుదారులకు మరిన్ని మినహాయింపులు, మధ్యతరగతి జనానికి వరాలు, సేవింగ్స్ లిమిట్ పెంపు, పెన్షనర్లకు పన్ను మినహాయింపులు ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇక ఇంటి రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశముంది.

news18-telugu
Updated: January 16, 2019, 4:32 PM IST
Budget 2019: మధ్యంతర బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం తాయిలాలు, వరాలు
Budget 2019: మధ్యంతర బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం తాయిలాలు, వరాలు
  • Share this:
లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేది మధ్యంతర బడ్జెట్ కావడంతో ప్రజలకు వరాలు, తాయిలాలు ఖాయమని తెలుస్తోంది. సాధారణంగా ఎన్నికలకు ముందు ఓట్ ఆన్ అకౌంట్ లేదా మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతుంటారు. ఓట్ ఆన్ అకౌంట్‌లో అయితే కేవలం ఎన్నికలు ముగిసే వరకు ప్రభుత్వ వ్యవహారాలు, కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు మాత్రమే బడ్జెట్ కేటాయిస్తారు. ఇందులో ప్రజలకు వరాలేమీ ఉండవు. కానీ మోదీ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ వైపు మొగ్గు చూపుతోందంటే ఖచ్చితంగా తాయిలాలు ఉండొచ్చని తెలుస్తోంది. మూడు నెలల్లో ఎన్నికలను ఎదుర్కోబోతున్న ఎన్‌డీఏ సర్కార్... ఓటర్లను ఆకర్షించే వరాలు కురిపిస్తుందని భావిస్తున్నారు. అయితే ఓట్ ఆన్ అకౌంట్‌లో తాయిలాలు ఇవ్వడానికి కుదరదు కానీ... మధ్యంతర బడ్జెట్‌లో ఇలాంటి ప్రకటనలకు చట్టపరంగా ఎలాంటి అడ్డంకులు లేవు.

పన్ను చెల్లింపుదారులకు మరిన్ని మినహాయింపులు, మధ్యతరగతి జనానికి వరాలు, సేవింగ్స్ లిమిట్ పెంపు, పెన్షనర్లకు పన్ను మినహాయింపులు ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇక ఇంటి రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశముంది. పన్ను చెల్లింపుదారులకు గత నాలుగేళ్లు చాలా చేశామని, మధ్యంతర బడ్జెట్‌లో పరిమితులకు లోబడి మరిన్ని లాభాలు చేకూరుస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే మధ్యతరగతి ప్రజల్ని ఆకర్షించే ప్రకటనలే ఉంటాయని తెలుస్తోంది.

జనాలకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం మోడీ ప్రభుత్వానికి అలవాటే. నోట్ల రద్దు, అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ లాంటి అనూహ్య నిర్ణయాలతో చర్చల్లో నిలిచిన కేంద్ర ప్రభుత్వం... మధ్యంతర బడ్జెట్‌లో కూడా సర్‌ప్రైజ్‌లు ఇవ్వొచ్చని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Budget 2019: ఫుల్ బడ్జెట్, మధ్యంతర బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్... వీటి మధ్య తేడాలు తెలుసా?

Budget 2019: గతేడాది బడ్జెట్‌లో 5 ముఖ్యమైన పన్ను సంస్కరణలు

Budget 2019: బడ్జెట్‌లో ఉపయోగించే ఈ పదాలకు అర్థాలు తెలుసా?

Budget 2019: ఈసారి ట్యాక్స్ శ్లాబ్ మారుతుందా? వివరాలు తెలుసుకోండి...
Published by: Santhosh Kumar S
First published: January 9, 2019, 12:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading