Budget 2019: భారతీయులు చెల్లించే పన్నులు ఇవే... మీకెన్ని తెలుసు?

Budget 2019 | మీరు ఎన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నారో తెలుసా? అసలు పన్నులు ఎన్ని రకాలు ఉంటాయో ఎప్పుడైనా గమనించారా? అసలు మీరు కష్టపడి సంపాదించిన డబ్బు పన్నుల రూపంలో చెల్లిస్తుంటే ఆ డబ్బంతా ఏమవుతుందో, ఎక్కడికి వెళ్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ వివరాలన్నీ తెలుసుకోండి.

news18-telugu
Updated: January 16, 2019, 3:58 PM IST
Budget 2019: భారతీయులు చెల్లించే పన్నులు ఇవే... మీకెన్ని తెలుసు?
Budget 2019: భారతీయులందరూ చెల్లించే పన్నులు ఇవే... మీకెన్ని తెలుసు?
news18-telugu
Updated: January 16, 2019, 3:58 PM IST
ప్రభుత్వం సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయాలంటే జనం నుంచి పన్నులు వసూలు చేయాల్సిందే. ప్రజల నుంచి తీసుకునే పన్నుల్నే మళ్లీ ప్రజా సంక్షేమానికి ఖర్చు చేస్తుంటాయి ప్రభుత్వాలు. అందుకే ఏ దేశంలో అయినా పన్నులు మామూలే. ఇందులో ప్రజలకు తెలిసిన పన్నులుంటాయి. తెలియకుండా కొన్ని పన్నులు చెల్లిస్తూనే ఉంటారు. మరి మీరు ఎన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నారో తెలుసా? అసలు పన్నులు ఎన్ని రకాలు ఉంటాయో ఎప్పుడైనా గమనించారా? అసలు మీరు కష్టపడి సంపాదించిన డబ్బు పన్నుల రూపంలో చెల్లిస్తుంటే ఆ డబ్బంతా ఏమవుతుందో, ఎక్కడికి వెళ్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ వివరాలన్నీ తెలుసుకోండి.

ఇది కూడా చదవండి: SANKRANTI 2019: వాట్సప్‌లో సంక్రాంతి స్టిక్కర్లు ఇలా పంపండి

భారతీయులు చెల్లించే పన్నులు ఇవే



1. ప్రత్యక్ష పన్ను
ప్రత్యక్ష పన్నునే డైరెక్ట్ ట్యాక్స్ అని కూడా అంటారు. వ్యక్తులు, సంస్థలు నేరుగా ప్రభుత్వానికి చెల్లించే పన్నులనే ప్రత్యక్ష పన్నులు అంటారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, కార్పొరేట్ ఇన్‌కమ్ ట్యాక్స్, మార్జినల్ ట్యాక్స్, వ్యవసాయంపై రేట్ ట్యాక్స్ లాంటివి ప్రత్యక్ష పన్నుల పరిధిలోకి వస్తాయి.



2. పరోక్ష పన్ను
పరోక్ష పన్నునే ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. అంటే ప్రభుత్వానికి పరోక్షంగా చెల్లించే పన్నులు. సర్వీస్ ట్యాక్స్ పరోక్ష పన్ను పరిధిలోకే వస్తుంది. ఫైనాన్స్ చట్టం, 1994లోని సెక్షన్ 66బీ కింద సేవా పన్నుల్ని వసూలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం సర్వీస్ ట్యాక్స్ 15%. ఆర్థిక సంవత్సరంలో సేవలు రూ.10 లక్షలు దాటితే పన్ను పరిధిలోకి వస్తాయి.
Loading...
3. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్
వస్తువులు, సేవల పన్నులు. ఇది కూడా పరోక్ష పన్ను లాంటిదే. వస్తువులు, సేవలపై పన్నులు విధిస్తుంది కేంద్ర ప్రభుత్వం. వస్తువుల ఉత్పత్తిలో ప్రతీ దశలో పన్నులు విధిస్తారు. ప్రస్తుతం ఈ జీఎస్‌టీని 5 శ్లాబుల్లో (0 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం) ఉంది. జీఎస్‌టీని కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తే, పెట్రోలియం ఉత్పత్తులు, మద్యం, విద్యుత్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు వేరుగా పన్నులు వసూలు చేస్తాయి.

Budget 2019: Here is the list of Taxes every Indian pays to State, Central Government, know which taxes you are paying | Budget 2019: భారతీయులందరూ చెల్లించే పన్నులు ఇవే... మీకెన్ని తెలుసు?
ప్రతీకాత్మక చిత్రం


ఇది కూడా చదవండి: Paytm Petrol Offer: పేటీఎంతో పెట్రోల్ కొంటే రూ.7,500 క్యాష్ బ్యాక్

కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు


1. ఆదాయపు పన్ను
వ్యవసాయంపై వచ్చే ఆదాయం కాకుండా, కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్నును వసూలు చేస్తుంది. వ్యక్తులకు, సంస్థలకు ఇది వర్తిస్తుంది.

2. కస్టమ్ డ్యూటీ
డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్‌ అండ్ కస్టమ్స్(CBEC) భారతదేశం నుంచి సాగే ఎగుమతులు, దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ వసూలు చేస్తుంది.

3. ఎక్సైజ్ డ్యూటీ
భారతదేశంలో తయారై ఇక్కడే ఉపయోగించే వస్తువులపై పరోక్షంగా విధించేదే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. తయారీదారులు ఈ పన్ను చెల్లిస్తారు. సెంట్రల్ ఎక్సైజ్ టారిఫ్ యాక్ట్, 1985లో ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్‌లో ఆయా వస్తువులను తెలిపారు. పెట్రోలియం క్రూడ్, హై-స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్(పెట్రోల్), న్యాచురల్ గ్యాస్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్, పొగాకు, పొగాకు ఉత్పత్తుల్లాంటివి ఈ జాబితాలో ఉంటాయి.

4. కార్పొరేషన్ ట్యాక్స్
ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం భారతీయ, విదేశీ కంపెనీలు కార్పొరేషన్ ట్యాక్స్ చెల్లించాల్సిందే. డొమెస్టిక్ కంపెనీ, ఫారిన్ కంపెనీలకు వేర్వేరు సెక్షన్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Donkey's Milk Soap: గాడిద పాల సబ్బుకు ఫుల్ డిమాండ్... ధర రూ.499

Budget 2019: Here is the list of Taxes every Indian pays to State, Central Government, know which taxes you are paying | Budget 2019: భారతీయులందరూ చెల్లించే పన్నులు ఇవే... మీకెన్ని తెలుసు?
ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్రాలు విధించే పన్నులు


1. ఎలక్ట్రిసిటీ డ్యూటీ
పన్నుల్ని కేంద్ర ప్రభుత్వమే వసూలు చేసినా, ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ మాత్రం ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి.

2. వ్యాల్యూ యాడెట్ ట్యాక్స్(వ్యాట్)
ఆర్థిక సరళీకరణ తర్వాత పన్ను సంస్కరణల్లో భాగంగా ప్రవేశపెట్టిందే వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్(వ్యాట్). వ్యాట్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తాయి. అయితే పన్నుల అమలు విజయవంతంగా జరిగేందుకు కేంద్ర ప్రభుత్వం తన పాత్ర పోషిస్తుంది.

3. సేల్స్ ట్యాక్స్
వస్తువులు, సేవలు అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించేదే సేల్స్ ట్యాక్స్. ఉత్పత్తులను బట్టి సేల్స్ ట్యాక్స్ వేర్వేరుగా ఉంటుంది.

4. ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్
సినిమాలు, ఫెస్టివల్స్, కమర్షియల్ షోస్, అమ్యూజ్‌మెంట్ పార్క్స్ లాంటి వాటిపై విధించే పన్ను ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలోకి వెళ్తుంది.

5. టోల్ రోడ్ ట్యాక్స్
టోల్ ట్యాక్స్‌నే రహదారి సుంకం అని కూడా పిలుస్తారు. రోడ్డు నిర్మాణం, మెయింటనెన్స్ కోసం టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు.


ఇవి కూడా చదవండి:

Flipkart Republic Day Sale: జనవరి 20 నుంచి 22 వరకు ఫ్లిప్‌‌కార్ట్‌‌లో రిపబ్లిక్ డే సేల్

TRAI Good News: నెలకు రూ.153 చెల్లిస్తే 100 ఫ్రీ లేదా పే ఛానెళ్లు

REDMI 6 PRO: రూ.11,499 విలువైన ఫోన్ రూ.1,058 ధరకే... ఎలా కొనాలో తెలుసుకోండి

AADHAR NEWS: ఆధార్ కార్డు పోయిందా? ఇలా రీప్రింట్ చేసుకోవచ్చు
First published: January 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...