Budget 2019: అత్యధికసార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రులు వీళ్లే...

Budget 2019 | భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి వార్షిక ఆర్థిక నివేదికనే బడ్జెట్ అంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ఉభయసభల్లో ప్రవేశపెడతారు. బడ్జెట్‌ను ఆమోదించిన తర్వాత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్డెట్ ఏప్రిల్‌లో మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో అమలవుతుంది.

news18-telugu
Updated: January 31, 2019, 5:30 PM IST
Budget 2019: అత్యధికసార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రులు వీళ్లే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బడ్జెట్... బడ్జెట్... బడ్జెట్... ఇప్పుడు అంతా బడ్జెట్ నామస్మరణ జరుగుతోంది. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్డెట్ ప్రవేశపెట్టనున్నారు. భారతదేశ చరిత్రలో ఇది 89వ బడ్జెట్ కానుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మొత్తం 25 మంది ఆర్థిక మంత్రులుగా పనిచేస్తే... అందరూ ప్రవేశపెట్టిన బడ్జెట్ల సంఖ్య 88. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి వార్షిక ఆర్థిక నివేదికనే బడ్జెట్ అంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ఉభయసభల్లో ప్రవేశపెడతారు. బడ్జెట్‌ను ఆమోదించిన తర్వాత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్డెట్ ఏప్రిల్‌లో మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో అమలవుతుంది.

కేంద్రంలో ఎవరెన్ని సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు?



మొరార్జీ దేశాయ్: జవహర్‌లాల్ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు మొరార్జీ దేశాయ్. 1959 నుంచి 1964 మధ్య 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనది. భారతదేశ చరిత్రలో అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మొరార్జీ దేశాయ్‌దే.

పి.చిదంబరం: 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో, యూపీఏ హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన చిదంబరం మొత్తం 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.

ప్రణబ్ ముఖర్జీ: ఇందిరా గాంధీ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ మొత్తం 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.



యశ్వంత్ సిన్హా: 1991-92, 1998-2002 మధ్య ఆర్థిక మంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా మొత్తం 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.యశ్వంత్ రావు చవాన్: ఇందిరా గాంధీ ప్రభుత్వ హయాంలో యశ్వంత్ రావ్ చవాన్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1971-75 మధ్య మొత్తం 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.

సీడీ దేశ్‌ముఖ్: 1951లో తొలి సార్వత్రిక ఎన్నికల సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత సీడీ దేశ్‌ముఖ్‌ది. ఎన్నికల తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఘనత ఆయనదే. మొత్తం 7 సార్లు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు.

మన్మోహన్ సింగ్: 1991లో అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహరావు హయాంలో తొలిసారి ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టారు మన్మోహన్ సింగ్. అంతకుముందు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా పనిచేశారాయన. 1991-96 మధ్య 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు బీజం వేసిన ఆర్థికవేత్తగా మన్మోహన్ సింగ్‌కు పేరుంది.

Budget 2019: అత్యధికసార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రులు వీళ్లే | Budget 2019: Finance Ministers who tabled the budget in parliament in Indian history

టీటీ కృష్ణమాచారి: రెండుసార్లు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.1957-58, 1964-66 మధ్య ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు. రెండుసార్లు ఆర్థిక మంత్రిగా పనిచేసిన మొట్టమొదటి నాయకుడు ఆయనే.

జవహర్‌లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, వెంకట్రామన్, హెచ్ ఎం పటేల్, జశ్వంత్ సింగ్, వీపీ సింగ్, సి సుబ్రహ్మణ్యం, జాన్ మతాయి, ఆర్కే షణ్ముఖం, లియాఖత్‌ అలీఖాన్‌, కేసీ నియోగి, జాన్ మొథాయ్, సచింద్ర చౌడ్‌సూరి, చౌదరీ చరణ్ సింగ్, రామస్వామి వెంకట్రామన్, వీపీసింగ్, ఎన్డీ తివారీ, మధు దండవతే లాంటివాళ్లు కూడా ఆర్థిక మంత్రులుగా పనిచేశారు.

ఇవి కూడా చదవండి:

IRCTC Refund Rules: ఐఆర్‌సీటీసీ ఇ-టికెట్ క్యాన్సిల్ చేశారా? రీఫండ్ రూల్స్ ఇవే...

Facebook Tips: మీ ఫేస్‌బుక్‌లో చేయకూడని 9 అంశాలివే...

Honor View 20 Release: 48 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ వ్యూ 20
First published: January 31, 2019, 5:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading