Budget 2019: గతేడాది బడ్జెట్‌లో 5 ముఖ్యమైన పన్ను సంస్కరణలు

Budget 2019: గతంలో ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, మెడికల్ రీఇంబర్స్‌మెంట్ కోసం రూ.19,200+రూ.15,000= రూ.34,200 మినహాయింపు ఉండేది. ప్రస్తుతం రూ.40,000 స్టాండర్డ్ డిడక్షన్ లభిస్తుంది. అదనంగా రూ.5,800 మినహాయింపు పొందొచ్చు.

news18-telugu
Updated: January 16, 2019, 4:34 PM IST
Budget 2019: గతేడాది బడ్జెట్‌లో 5 ముఖ్యమైన పన్ను సంస్కరణలు
ఇన్‌కం టాక్స్ పరిమితి రూ.5 లక్షలకు పెంచుతారా?
  • Share this:
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ బడ్జెట్‌లో ఎవరికేమి ఇస్తారన్న చర్చ జోరుగా జరుగుతోంది. అయితే గతేడాది పన్ను చెల్లింపుదారుల కోసం భారీ మార్పులు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అందులో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, ఇన్‌కమ్ ట్యాక్స్‌పై సెస్‌లో మార్పు లాంటివి ఉన్నాయి. గతేడాది బడ్జెట్‌లో 5 ముఖ్యమైన పన్ను సంస్కరణల గురించి తెలుసుకోండి.

1. స్టాండర్డ్ డిడక్షన్

స్టాండర్డ్ డిడక్షన్ అంటే ప్రామాణిక తగ్గింపు. గతంలో ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ రూ.19,200, మెడికల్ రీఇంబర్స్‌మెంట్ రూ.15,000 ఉండేవి. కానీ గతేడాది కేంద్ర ప్రభుత్వం వాటిని తొలగించింది. ఆ రెండింటి స్థానంలో ప్రామాణిక తగ్గింపు రూ.40,000 చేర్చింది. అదే గతంలో చూస్తే ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, మెడికల్ రీఇంబర్స్‌మెంట్ కోసం రూ.19,200+రూ.15,000= రూ.34,200 మినహాయింపు ఉండేది. ప్రస్తుతం రూ.40,000 స్టాండర్డ్ డిడక్షన్ లభిస్తుంది. అదనంగా రూ.5,800 మినహాయింపు పొందొచ్చు.

2. వృద్ధులకు మినహాయింపులు
పోస్ట్ ఆఫీసుల్లో డిపాజిట్లపై వచ్చే వడ్డీని వృద్ధులకు రూ.10,000 నుంచి రూ.50,000 పెంచింది కేంద్ర ప్రభుత్వం. సెక్షన్ 80డీ కింద హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం, వైద్య ఖర్చులపై రూ.30,000 ఉన్న పన్ను మినహాయింపును రూ.50,000 చేశారు.

3. సెస్ పెంపు
వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు చెల్లించే ఆదాయపు పన్నుపై గతంలో 3 శాతం సెస్ ఉండేది. సెస్‌ను 4 శాతానికి పెంచారు.

4. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్
షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులపై 10% లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. లాభం రూ.1 లక్ష దాటిన వారికే ఈ పన్నులు వర్తిస్తాయి.

5. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్
ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై వచ్చే డివిడెండ్‌పై 10% డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ చెల్లించాలి.

ఇవి కూడా చదవండి:

Budget 2019: ఫుల్ బడ్జెట్, మధ్యంతర బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్... వీటి మధ్య తేడాలు తెలుసా?

Budget 2019: మోదీ సర్కార్ చివరి బడ్జెట్‌కు ముహూర్తం ఎప్పుడు? తెలుసుకోండి..

Budget 2019: బడ్జెట్‌లో ఉపయోగించే ఈ పదాలకు అర్థాలు తెలుసా?

Budget 2019: ఈసారి ట్యాక్స్ శ్లాబ్ మారుతుందా? వివరాలు తెలుసుకోండి...
Published by: Santhosh Kumar S
First published: January 9, 2019, 11:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading