Amala RavulaAmala Ravula
|
news18-telugu
Updated: April 4, 2019, 1:16 PM IST
బీఎస్ఎన్ఎల్
గత కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వడానికే ఇబ్బంది పడుతున్న ప్రభుత్వరంగ టెలికం సంస్థ ఆ ఆర్థిక సమస్యలను తగ్గించేందుకు చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తోంది. మొత్తం ఉద్యోగుల్లో 31శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రిటైర్మెంట్ వయసును 60 నుంచి 58 ఏళ్లకు తగ్గించడం, యాభై ఏళ్లకే స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశాన్ని కల్పించడం ద్వారా ఏకంగా 54వేలమంది ఇంటికి ప్రయత్నం చేస్తోందని ఓ మీడియా ప్రచురించింది.
ప్రైవేట్ టెలికం సంస్థల నుంచి వచ్చే పోటీ కారణంగా బీఎస్ఎన్ఎల్ ఈ స్థితికి వచ్చినట్లుగా తెలుస్తోంది. బీఎస్ఎన్ఎల్ని ఆర్థికంగా నిలబట్టేందుకు ప్రభుత్వ నిపుణుల కమిటీ చేసిన పది ప్రతిపాదనల్లో మూడింటిని బోర్డు ఆమోదించింది. ఇందులో మొదటిది 60ఏళ్లు ఉన్న పదవీ విరమణ వయసు 58కి కుదించటం, ఈ కారణంగా 36,568 మంది ఉద్యోగాలు కోల్పోతారు. సంస్థకు రూ. 13,895 కోట్లు ఆదా అవుతాయి. మరొకటి 50 ఏళ్లు దాటిన ఉద్యోగులను స్వచ్ఛంద పదవీవిరమణ(వీఆర్ఎస్) కింద ఇంటికి సాగనంపడం.. దీంతో.. రూ1,921.24 కోట్లు ఆదా అవుతాయి. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్లో 1,74,312 మంది ఉద్యోగులున్నారు. తాజా నిర్ణయాలతో 54,451 మంది ఉద్యోగాలు కోల్పోతారు. మూడో నిర్ణయం ప్రైవేట్ ఆపరేటర్లను ఎదర్కోవడానికి ఈ సంస్థకు 4జీ స్పెక్ట్రమ్‌ని ఇస్తారు. ఈ మూడింటిపై ఎన్నికల అనంతరం నిర్ణయం తీసుకుంటారు.
తీవ్రనష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎదుర్కొంది. దీంతో.. సంస్థ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Published by:
Amala Ravula
First published:
April 4, 2019, 1:16 PM IST