హోమ్ /వార్తలు /బిజినెస్ /

BSNL Prepaid Plan: రూ. 397కే ఏడాది వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ ప్లాన్లు.. ప్రయోజనాలివే..

BSNL Prepaid Plan: రూ. 397కే ఏడాది వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ ప్లాన్లు.. ప్రయోజనాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేవలం రూ.397 కే ఏడాది వ్యాలిడిటీ కలిగిన ప్లాన్​ను బీఎస్‌ఎన్‌ఎల్‌ తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఇంత తక్కువ ధరలో మరే ఇతర టెలికాం సంస్థ ఏడాది వ్యాలిడిటీ ఇవ్వడం లేదు.

ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తక్కువ ధరకే ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ విభాగంలో ఇతర టెలికాం సంస్థలకు సంస్థ పోటీ ఇస్తోంది. కేవలం రూ.397 కే ఏడాది వ్యాలిడిటీ కలిగిన ప్లాన్​ను బీఎస్‌ఎన్‌ఎల్‌ తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఇంత తక్కువ ధరలో మరే ఇతర టెలికాం సంస్థ ఏడాది వ్యాలిడిటీ ఇవ్వడం లేదు. అయితే ఈ ప్లాన్​ కింద లభించే కాలింగ్​, డేటా ప్రయోజనాలు ఏడాది పొడవునా అందుబాటులో ఉండవు. ఈ ప్రయోజనాలు 60 రోజుల వరకు వర్తిస్తాయి. అయితే మీ సిమ్​ యాక్టివ్​లో ఉంచుకోవడానికి పదే పదే రీఛార్జ్​ చేసే తిప్పలు తప్పుతాయి. గతంలో ఈ ప్రీపెయిడ్​ ప్లాన్​ రూ.365కే అందుబాటులో ఉండేది. దీన్ని సంస్థ తాజాగా రూ.397కు సవరించింది.

Jio Plans: జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఈ ప్లాన్లతో ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్, హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌.. వివరాలివే..

బీఎస్ఎన్ఎల్ రూ .397 ప్రీపెయిడ్ ప్లాన్

బిఎస్ఎన్ఎల్ రూ.397 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కింద వినియోగదారులకు ప్రతి రోజు 2 జిబి డేటా, 100 ఎస్​ఎమ్​ఎస్​లు లభిస్తాయి. అయితే, ప్లాన్​ వ్యాలిడిటీ 365 రోజులైనప్పటికీ, ప్లాన్​ ప్రయోజనాలు మాత్రం 60 రోజుల వరకే అందుబాటులో ఉంటాయి. మొదటిసారి రీఛార్జ్ చేసుకునే కస్టమర్లకు ఉచిత పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్ (పిఆర్‌బిటి), రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, 2GB రోజువారీ హైస్పీడ్​ డేటా వస్తుంది. ఆ తర్వాత డేటా స్పీడ్​ 80 Kbpsకి తగ్గుతుంది.

ఇతర టెలికాం సంస్థలు ఏడాది వ్యాలిడిటీతో అందిస్తున్న ప్రయోజనాలు

భారతీయ టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్​–ఐడియా కూడా 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. అయితే ఈ ప్లాన్‌ల ప్రయోజనాలు ఏడాదంతా లభిస్తాయి. అంటే వీటీతో 2GB రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, 100 SMS ప్రయోజనాలను ఏడాది పొడవునా లభిస్తాయి. అదనంగా స్ట్రీమింగ్ డివైజ్‌లకు ఉచిత మెంబర్‌షిప్‌ను కూడా అందిస్తున్నాయి.

ఎయిర్‌టెల్ రూ .2498 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ప్లాన్ కింద రోజుకు 2 జిబి డేటా, అపరిమిత కాలింగ్​, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్​ 365 రోజుల వ్యాలిటిడీ కలిగి ఉంటుంది.

జియో రూ .2399 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ప్లాన్ ఏడాది వరకు అన్​లిమిటెడ్​ కాలింగ్​తో పాటు 2 జిబి రోజువారీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనాలను అందిస్తుంది. అదనంగా జియో యాప్స్​కు కాంప్లిమెంటరీ సబ్​స్క్రిప్షన్​ ఇస్తుంది.

వొడాఫోన్​ రూ. 2595 ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్–ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్‌తో ఏడాది పాటు 2GB రోజువారీ డేటా, రోజూ 100 ఎస్ఎంఎస్​లు, అన్‌లిమిటెడ్ కాలింగ్​ ప్రయోజనాలు లభిస్తాయి. వీటితో పాటు వారాంతపు డేటా రోల్‌ఓవర్ డేటా ప్రయోజనాలను కూడా ఇస్తుంది. ఈ ప్లాన్‌తో ప్రీమియం జీ5 సబ్​స్క్రిప్షన్​, వి మూవీస్​ టివి వంటి వాటికి యాక్సెస్‌ లభిస్తుంది.

బిఎస్‌ఎన్‌ఎల్ రూ. 1999 ప్రీపెయిడ్ ప్లాన్

బిఎస్‌ఎన్‌ఎల్‌లో రూ.1999కు వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్​ అందిస్తుంది. ఈ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ కింద 3GB రోజువారీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్, 100 SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్​ 365 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. 60 రోజుల పాటు బిఎస్‌ఎన్‌ఎల్ టివి కంటెంట్‌తో పాటు ఏడాది పాటు ఎరోస్ నౌ OTT ప్రయోజనాలను ఇస్తుంది. ప్రతిరోజు 3జీబీ డేటా అయిపోయిన తర్వాత డేటా స్పీడ్​ 80 Kbpsకి తగ్గిపోతుంది. ఈ ప్లాన్ కింద అన్​లిమిటెడ్​ సాంగ్​ ఛేంజ్​ ఆప్షన్లతో పాటు ఉచిత బిఎస్ఎన్ఎల్ ట్యూన్లను కూడా పొందవచ్చు.

First published:

Tags: Airtel recharge plans, BSNL, Jio

ఉత్తమ కథలు