BSNL: రూ.47 ప్రీపెయిడ్ ప్లాన్... 14GB డేటా... అదనపు బెనెఫిట్లు... పూర్తి వివరాలు ఇవీ...

రూ.47 ప్రీపెయిడ్ ప్లాన్... 14GB డేటా... అదనపు బెనెఫిట్లు (ప్రతీకాత్మక చిత్రం)

BSNL prepaid plan: మొబైల్ సర్వీస్ ఆపరేటర్లలో ఒకటైన BSNL మరో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తెచ్చింది. మరి దాని బెనెఫిట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • Share this:
    BSNL prepaid plan: ప్రభుత్వరంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)... సరికొత్త ప్రీపెయిన్ రీచార్చ్ కూపన్ తెచ్చింది. ప్రమోషనల్ ఆధారంగా కంపెనీ ఈ కూపన్ తెచ్చింది. దీని విలువ రూ.47. ఇది మార్చి 31, 2021 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ఐతే... కంపెనీ చెప్పిన దాని ప్రకారం BSNL కొత్త సిమ్ కార్డ్ తీసుకున్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. లేదేంటే ఇతర మొబైల్ ఆపరేటర్ల నుంచి BSNLకి మారిన వారికి కూడా ఇది వర్తిస్తుంది. అంటే కొత్త BSNL నంబర్‌కి మొదటి రీఛార్జ్ ఆఫర్ కింద ఇది వర్తిస్తుంది. అందువల్ల కొత్త సిమ్ తీసుకున్నా... ఆపరేటర్‌ని మార్చుకున్నా... BSNLకి వచ్చిన వారు ముందుగా ఈ కూపన్ కొనుక్కోవాల్సి ఉంటుంది.

    కొత్త కస్టమర్ల సంఖ్యను పెంచుకోవడం కోసమే BSNL ఈ కొత్త కూపన్ తెచ్చింది. ఇది ఒకసారి మాత్రమే పనిచేస్తుంది. ఎవరైనా 2 కూపన్లు కొనుక్కుంటే... మొదటి కూపన్‌కే ఆఫర్ వర్తిస్తుంది. కాబట్టి రెండో రీఛార్జి నుంచి కస్టమర్లు... కంపెనీ ఇస్తున్న రకరకాల రీచార్జ్ ఆఫర్లలో నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు.

    ఈ కొత్త కూపన్ ప్రస్తుతం చెన్నై జోన్ వరకే వర్తిస్తోంది. ఐతే... దీన్ని దేశమంతటా అమలు చేసేందుకు కంపెనీ రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఈ కూపన్ కోసం కొత్త సిమ్ కొనుక్కోవాలా... అవసరమా అనే ప్రశ్న రావచ్చు. చాలా మంది కూపన్‌ ఆఫర్లు బాగన్నాయి కాబట్టి... కొనుక్కోవచ్చు అంటున్నారు. ఎందుకంటే రూ.47కే 14GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. దాన్ని యూజర్... 28 రోజుల్లో వాడుకోవాల్సి ఉంటుంది. మిగతా ప్రైవేట్ సంస్థల ఆఫర్లతో పోల్చితే... ఈ ఆఫర్‌లో ఏ నెట్‌వర్క్‌కి అయినా... ఫ్రీ కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే రోజుకు 100 SMSలు పంపుకునే వీలుంది.

    ఇది కూడా చదవండి: ఫేస్‌బుక్‌లో యువతి ఫొటోలు పెట్టిన మహిళ అరెస్టు... తెరవెనక వివాహేతర సంబంధం హైడ్రామా

    ఎలాగైనా మార్కెట్ వాటాను పెంచుకోవాలనుకుంటున్న BSNL కొన్నాళ్లుగా సంచలన నిర్మయాలు తీసుకుంటోంది. వేగంగా స్పందిస్తోంది. ఆల్రెడీ BSNL చాలా అప్పుల్లో ఉంది. ఓవర్ ది టాప్ (OTT) కంటెంట్ ప్రొవైడర్లతో డీల్స్ కుదుర్చుకున్న BSNL... వోచర్ ప్లాన్ల ధరలను తగ్గిస్తోంది. మార్కెట్ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసుకుంటోంది.
    Published by:Krishna Kumar N
    First published: