BSNL: 100ఎంబీపీఎస్ స్పీడ్‌తో బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ ఇవే

BSNL Broadband Plans | ఎక్కువ స్పీడ్‌తో ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? బీఎస్ఎన్ఎల్ 100ఎంబీపీఎస్ స్పీడ్‌తో ప్లాన్స్ అందిస్తోంది.

news18-telugu
Updated: August 10, 2020, 2:31 PM IST
BSNL: 100ఎంబీపీఎస్ స్పీడ్‌తో బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ ఇవే
BSNL: 100ఎంబీపీఎస్ స్పీడ్‌తో బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? ఇంటికి ఇంటర్నెట్ తీసుకోవాలనుకుంటున్నారా? ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-BSNL 100ఎంబీపీఎస్ స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ అందిస్తోంది. మంత్లీ ప్లాన్‌తో పాటు ఆరు నెలలు, ఏడాది, రెండేళ్లు, మూడేళ్లకు ప్లాన్స్ అందిస్తోంది. 100ఎంబీపీఎస్ స్పీడ్ ప్లాన్స్ రూ.1,277 నుంచి మొదలవుతాయి. రూ.1,277, రూ.1,999, రూ.2,499, రూ.4,499 ప్లాన్స్ తీసుకున్నవారు 100ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ పొందొచ్చు. ఈ ప్లాన్స్‌పై వేర్వేరు బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ఏ ప్లాన్‌తో ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసుకోండి.

రూ.1,277 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న చీపెస్ట్ 100ఎంబీపీఎస్ ప్లాన్. 750 జీబీ డేటా లభిస్తుంది. ఈ డేటాను 100ఎంబీపీఎస్ స్పీడ్‌తో వాడుకోవచ్చు. డైలీ డేటా లిమిట్ లేదు. 750జీబీ లిమిట్ దాటితే స్పీడ్ 2ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. 2ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా ఉపయోగించుకోవచ్చు. దేశంలో ఏ నెట్వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.

LIC: ఎల్ఐసీ పాలసీహోల్డర్లకు గుడ్ న్యూస్... ఈ అవకాశం 2 నెలలు మాత్రమే

PM Kisan: మీ అకౌంట్‌లోకి పీఎం కిసాన్ డబ్బులు రాలేదా? కారణమిదే

బీఎస్ఎన్ఎల్ రూ.1,999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో రోజుకు 33జీబీ డేటాను 100ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఉపయోగించుకోవచ్చు. అంటే గరిష్టంగా నెలకు 1,023జీబీ డేటా వాడుకోవచ్చు. రోజులో 33జీబీ డేటా పూర్తిగా వాడిన తర్వాత స్పీడ్ 4ఎంబీపీఎస్‌కు తగ్గిపోతుంది. దేశంలో ఏ నెట్వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.

బీఎస్ఎన్ఎల్ రూ.2,499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో రోజుకు 40జీబీ డేటాను 100ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఉపయోగించుకోవచ్చు. రూ.1,999 ప్లాన్‌తో పోలిస్తే రోజుకు 7 జీబీ డేటా ఎక్కువ లభిస్తుంది. గరిష్టంగా నెలకు 1,240 జీబీ డేటా వాడుకోవచ్చు. రోజులో 40జీబీ డేటా పూర్తిగా వాడిన తర్వాత స్పీడ్ 4ఎంబీపీఎస్‌కు తగ్గిపోతుంది. దేశంలో ఏ నెట్వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.

బీఎస్ఎన్ఎల్ రూ.4,499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో రోజుకు 55జీబీ డేటాను 100ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఉపయోగించుకోవచ్చు. గరిష్టంగా నెలకు 1,705 జీబీ డేటా వాడుకోవచ్చు. రోజులో 55జీబీ డేటా పూర్తిగా వాడిన తర్వాత స్పీడ్ 4ఎంబీపీఎస్‌కు తగ్గిపోతుంది. దేశంలో ఏ నెట్వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.
Published by: Santhosh Kumar S
First published: August 10, 2020, 2:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading