news18-telugu
Updated: May 28, 2020, 3:46 PM IST
BSNL Plan: బీఎస్ఎన్ఎల్ నుంచి రూ.2 ధరకే ప్లాన్
(ప్రతీకాత్మక చిత్రం)
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-BSNL కస్టమర్లకు శుభవార్త. అన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ వెలిడిటీని పెంచుకోవడానికి రూ.2 ధరకే ప్రత్యేకంగా ఓ ప్లాన్ ప్రకటించింది బీఎస్ఎన్ఎల్. ఇప్పటివరకు వేలిడిటీ ఎక్స్టెన్షన్ ప్లాన్ ధర రూ.19 ఉండగా ఆ ప్లాన్ ధరను భారీగా తగ్గించింది. రూ.2 రీఛార్జ్ చేస్తే మూడు రోజులు వేలిడిటీ పెంచుకోవచ్చు. అంటే మీ ప్లాన్ వేలిడిటీ ఇవాళ అయిపోతుందనుకుంటే రూ.2 రీఛార్జ్ చేస్తే చాలు... ప్రస్తుతం ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్‌ను మరో మూడు రోజులు వాడుకోవచ్చు. ఈ ప్లాన్‌లో ఇతర బెనిఫిట్స్ ఏవీ ఉండవు. కేవలం వేలిడిటీ పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇంతకముందు వేలిడిటీ ఎక్స్టెన్షన్ కోసం రూ.19 రీఛార్జ్ చేయాల్సి ఉండేది. రూ.19 రీఛార్జ్ చేస్తే ప్రస్తుతం ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్‌కు 30 రోజుల వేలిడిటీ అదనంగా లభించేది. అన్ని రోజులు కాకుండా తక్కువ రోజులు వేలిడిటీ కావాలనుకునేవారు రూ.2 రీఛార్జ్ చేయొచ్చు.
మరోవైపు బీఎస్ఎన్ఎల్ రెండు క్వార్టర్లీ, ఒక యాన్యువల్ ప్లాన్స్‌ని ప్రకటించింది. రంజాన్ సందర్భంగా రూ.786 ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్‌లో 30 జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 90 రోజులు. ఈ ప్లాన్ జూన్ 21 వరకే. దీంతో పాటు రూ.699 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించింది. ఇందులో రోజుకు 500 ఎంబీ డేటా లభిస్తుంది. ఏ నెట్‌వర్క్‌కైనా అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. ఇక యాన్యువల్ ప్లాన్ రూ.2399 రీఛార్జ్ చేస్తే వేలిడిటీ 600 రోజులు లభిస్తుంది. రోజూ 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ లాంటి బెనిఫిట్స్ ఉంటాయి.
ఇవి కూడా చదవండి:
SBI: ఎస్బీఐలో ఈ స్కీమ్‌తో ఎక్కువ లాభం... ఎలాగో తెలుసుకోండి
SBI: ఎస్బీఐలో లోన్ తీసుకున్న కస్టమర్లకు గుడ్ న్యూస్
SBI Scheme: ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ప్రతీ నెల డబ్బులు చేతికొస్తాయి
Published by:
Santhosh Kumar S
First published:
May 28, 2020, 3:46 PM IST