భారత ప్రభుత్వానికి చెందిన టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-BSNL రూ.199 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాల్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఏ నెట్‌వర్క్‌కైనా కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 250 నిమిషాలు మాత్రమే లభిస్తాయి. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. వేలిడిటీ 30 రోజులు. ఇప్పటికే ఉన్న PV 186 ప్రీపెయిడ్ ప్లాన్‌ని రీప్లేస్ చేస్తూ రూ.199 ప్లాన్ ప్రకటించింది బీఎస్ఎన్ఎల్. రూ.186 ప్లాన్‌లో వేలిడిటీ 28 రోజులు లభిస్తే రూ.199 ప్లాన్‌లో వేలిడిటీ 30 రోజులు. అయితే రూ.186 ప్లాన్ 2021 జనవరి 1 నుంచి లభించదు. కొత్త ప్లాన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఇప్పటికే రిలయెన్స్ జియోలో రూ.249 ప్లాన్ ఉంది. రోజూ 2జీబీ డేటా చొప్పున 28 రోజులకు 56జీబీ డేటా లభిస్తుంది. డేటా మొత్తం ఉపయోగిస్తే స్పీడ్ 64కేబీపీఎస్‌కు తగ్గుతుంది. రోజూ 2జీబీ డేటాతో పాటు జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. నాన్ జియో నెట్‌వర్క్స్‌కి కాల్ చేయడానికి 1000 నిమిషాలు ఉచితంగా లభిస్తాయి. రోజూ 100 ఎస్ఎంఎస్లు ఉచితం. జియో యాప్స్ సబ్స్క్రిప్షన్స్ ఉచితంగా లభిస్తుంది.
Smartphones under Rs 15000: కొత్త ఫోన్ కొనాలా? రూ.15,000 లోపు బెస్ట్ 10 స్మార్ట్‌ఫోన్స్ ఇవే
Flipkart Big Saving Days sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 24 స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్
ఇక ఎయిర్‌టెల్‌లో రూ.298 ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజూ 2జీబీ డేటా, లభిస్తుంది. వేలిడిటీ 28 రోజులు. రోజూ 100 ఎస్ఎంఎస్లు ఉచితం. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సబ్స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్, ఉచితంగా ఆన్లైన్ కోర్సులకు యాక్సెస్ లభిస్తుంది. ఫాస్ట్ ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
ULIP Plan: ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారా? యూలిప్ ప్లాన్‌తో లాభాలివే
Paytm: పేటీఎంలో డబ్బులు పంపుతున్నారా? ఈ గుడ్ న్యూస్ మీకోసమే
ఇక వొడాఫోన్ ఐడియా-Vi లో రూ.199 రీఛార్జ్ చేస్తే రోజూ 1జీబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ లోకల్, నాన్ లోకల్ కాల్స్ ఉచితం. రోజూ 100ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. వేలిడిటీ 24 రోజులు. వీఐ మూవీస్, టీవీ యాక్సెస్ లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AIRTEL, Airtel recharge plans, BSNL, Jio, Reliance Jio