BSNL: గుడ్ న్యూస్... ఆంధ్రప్రదేశ్‌లో బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ ప్లాన్ ప్రారంభం

BSNL Bharat Fiber 200 Mbps Broadband Plan | ఇప్పటికే తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ 200 ఎంబీపీఎస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఆంధ్రప్రదేశ్‌లోని యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్లాన్ బెనిఫిట్స్ తెలుసుకోండి.

news18-telugu
Updated: August 6, 2020, 2:34 PM IST
BSNL: గుడ్ న్యూస్... ఆంధ్రప్రదేశ్‌లో బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ ప్లాన్ ప్రారంభం
BSNL: గుడ్ న్యూస్... ఆంధ్రప్రదేశ్‌లో బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ ప్లాన్ ప్రారంభం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారికి శుభవార్త. ఎక్కువ స్పీడ్‌తో ఇంటర్నెట్ కోరుకునేవారి కోసం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-BSNL భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఆంధ్రప్రదేశ్‌లో లాంఛ్ చేసింది. 1500GB CS55 పేరుతో 200ఎంబీపీఎస్ ప్లాన్‌ను అందిస్తోంది. ఇప్పటికే ఈ ప్లాన్ భారతదేశంలోని పలు సర్కిల్స్‌లో ఉంది. ప్రమోషన్‌లో భాగంగా ఈ ఏడాది ప్రారంభంలో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఈ ప్లాన్ ప్రారంభించింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్లాన్ ఇన్నాళ్లూ లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాలకు ఈ ప్లాన్‌ను పొడిగించింది బీఎస్ఎన్ఎల్. బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ 1500GB CS55 ప్లాన్ తీసుకున్నవారికి 200ఎంబీపీఎస్ స్పీడ్‌తో డేటా లభిస్తుంది. గరిష్టంగా 1500జీబీ డేటా వాడుకోవచ్చు. ఈ లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 2ఎంబీపీఎస్‌కు తగ్గిపోతుంది. ఈ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.7,777 మాత్రమే... మేడ్ ఇన్ ఇండియా మొబైల్ ఫీచర్స్ ఇవే

Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఈ 10 స్మార్ట్‌ఫోన్లపై రూ.5,000 వరకు డిస్కౌంట్

ఈ డేటా బెనిఫిట్స్‌తో పాటు దేశంలోని ఏ నెట్వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్స్‌లోని యూజర్లు ఆరు నెలలకు, ఏడాదికి, రెండేళ్లకు, మూడేళ్లకు ఈ ప్లాన్ తీసుకోవచ్చు. సెమీ యాన్యువల్ ప్లాన్ ధర రూ.11,994, యాన్యువల్ ప్లాన్ రూ.23,988, రెండేళ్ల ప్లాన్ 47,976, మూడేళ్ల ప్లాన్ రూ.71,964 చొప్పున చెల్లించాలి. ఈ ప్లాన్ ఎంచుకునే వారికి నాలుగు నెలల వరకు కాంప్లిమెంటరీ సర్వీస్ లభిస్తుంది. తెలంగాణలో అక్టోబర్ 5 వరకు, ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 19 వరకు ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది.
Published by: Santhosh Kumar S
First published: August 6, 2020, 2:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading