80వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న BSNL... మాంద్యం ఎఫెక్ట్?

BSNL : పోటీ ప్రపంచంలో ప్రభుత్వ రంగ సంస్థలు నెట్టుకురాలేకపోతున్నాయి. ముఖ్యంగా టెలికం రంగంలో... జియో పోటీని తట్టుకొని నిలవలేకపోతున్న BSNL చివరకు ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధపడింది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 5, 2019, 8:20 AM IST
80వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న BSNL... మాంద్యం ఎఫెక్ట్?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఇలా అనే కంటే... BSNL అంటేనే ఎక్కువ మందికి తెలుస్తుంది. ఒకప్పుడు టెలికం రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ BSNL తిరుగులేని సంస్థ. ఐతే... ఎయిర్‌టెల్, ఐడియా లాంటి సంస్థలు వచ్చాక... వాటితో పోటీ పడలేకపోయింది. తాజాగా వచ్చిన రిలయన్స్ జియో... మిగతా టెలికం సంస్థలన్నింటికీ గట్టి పోటీ ఇవ్వడంతో... BSNL దాదాపు మూతపడే పరిస్థితికి వచ్చేసింది. రూ.15వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. దాంతో... ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా... వాలంటరీ రిటైర్మెంట్ స్కీం తెస్తోంది. దాదాపు 80 వేల మంది ఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విరమణ ద్వారా తొలగించబోతోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. పర్మిషన్ రాగానే తొలగించే పని మొదలుపెడతామని BSNL చీఫ్ ప్రవీణ్ కుమార్ పర్వార్ తెలిపారు.

రిటైర్మెంట్ స్కీమ్ అమలైన తర్వాత... లక్షల్లో శాలరీలు తీసుకుంటున్న సీనియర్లు చాలా మంది సంస్థ నుంచీ బయటకు వెళ్లిపోతారు. అదే సమయంలో... BSNL కొత్తగా లక్ష మందిని నియమించుకోనుంది. ఐతే... వాళ్లందరికీ తక్కువ శాలరీలే ఉంటాయి. అలాగే... మరికొంతమందిని కాంట్రాక్ట్ పద్ధతుల్లో తీసుకుంటుంది. అందువల్ల సంస్థలో నిర్వహణ భారం దాదాపు సగం తగ్గుతుంది. ఈ కారణంగా... రిటైర్మెంట్ తీసుకునేవారికి భారీగా క్యాష్ రివార్డ్ ఇస్తామని ప్రవీణ్ కుమార్ తెలిపారు.

First published: September 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>