• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • BSNL CINEMA PLUS SERVICE BUNDLED PREMIUM OTT SUBSCRIPTIONS AT JUST RS 129 PER MONTH NS GH

BSNL Cinema Plus: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు బంపర్ ఆఫర్.. కేవలం రూ.129కే ఆ నాలుగు సేవలు

BSNL Cinema Plus: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు బంపర్ ఆఫర్.. కేవలం రూ.129కే ఆ నాలుగు సేవలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన బ్రాడ్ బ్యాండ్ యూజర్లకు గుడ్న్యూస్ అందించింది. నెలకు కేవలం రూ.129 రీఛార్జ్ తో నాలుగు OTT సభ్వత్యాలను అందించే ‘సినిమా ప్లస్’ ప్యాక్ ను ప్రారంభించింది.

  • Share this:
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన బ్రాడ్ బ్యాండ్ యూజర్లకు గుడ్న్యూస్ అందించింది. నెలకు కేవలం రూ.129 రీఛార్జ్ తో నాలుగు OTT సభ్వత్యాలను అందించే ‘సినిమా ప్లస్’ ప్యాక్ ను ప్రారంభించింది. ఇటీవలి కాలంలో బీఎస్ఎన్ఎల్ తన బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లను అధికంగా కోల్పోతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఎయిర్టెల్ తన బ్రాడ్ బ్యాండ్ కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటుంది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగన బీఎస్ఎన్ఎల్ తన బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లు చేజారకుండా ఉండేందుకు, నూతన కస్టమర్లను ఆకర్షించేందుకు ‘సినిమా ప్లస్’ పేరుతో కొత్త సర్వీస్ ను ప్రారంభించింది. ‘సినిమా ప్లస్’ సర్వీసు ద్వారా అన్ని రకాల OTT సేవలు ఒకే ప్యాకేజీ కింద అందించబడతాయి. కాగా, ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం బీఎస్ఎన్ఎల్ ఇటీవల OTT యాడ్-ఆన్ ప్యాక్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇటువంటి OTT ప్యాకేజీనే బిఎస్ఎన్ఎల్ తన బ్రాడ్ బ్యాండ్ యూజర్లకు ‘సినిమా ప్లస్‘ పేరుతో అందిస్తుంది. దీనిలో ప్రాథమికంగా ‘యుప్ టివి స్కోప్ ఎంటర్టైన్మెంట్’ సర్వీస్ ను అందిస్తుంది. అందులో భాగంగా బీఎస్ఎన్ఎల్ యుప్ టీవీ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు నెలకు కేవలం రూ .129 చెల్లించి ఈ ప్యాక్ ను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.

‘సినిమా ప్లస్’ ఎంటర్టైన్మెంట్ ప్యాక్ ప్రయోజనాలు..
బిఎస్‌ఎన్‌ఎల్ సినిమా ప్లస్ ప్యాక్ ప్రస్తుతం ‘యుప్ టివి స్కోప్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్’ గా కూడా లభిస్తుంది. రూ.129 లకు లభించే ఈ ప్యాక్లో యుప్టీవీ, జీ5, సోనీలైవ్, వూట్ అనే నాలుగు ప్రీమియం OTT సభ్యత్వాలు లభిస్తాయి-. సాధారణంగా రూ. 199 ధర వద్ద లభించే ఈ ప్రయోజనాలన్నీ ప్రమోషనల్ ఆఫర్లో భాగంగా రూ .129లకే పొందవచ్చు. ఈ ప్యాక్ ప్రయోజనాల విషయానికి వస్తే.. దీని కింద 100కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లను అందించే యుప్టీవీ సభ్యత్వం, 80కి పైగా లైవ్ టివి ఛానెళ్లు, 500+ టివి సిరీస్, ఒరిజినల్ టివి షోలు, 2000కి పైగా సినిమాలను కలిగి ఉన్న ZEE5 సభ్యత్వాన్ని పొందవచ్చు. వీటితో పాటు వివిధ భాషల్లో 15+ లైవ్ టీవీ ఛానెళ్లు, 200+ సినిమాలతో కూడిన సోనీ లైఫ్ OTT సభ్యత్వాన్ని కూడా పొందవచ్చు. దీనితో పాటు 35 లైవ్ టీవీ ఛానెళ్లు, 400కు పైగా సినిమాలను కలిగి ఉన్న వూట్ OTT సభ్యత్వాన్ని కూడా పొందవచ్చు.

సభ్యత్వం ఎలా పొందాలి?
బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాండ్ బ్యాండ్ యూజర్లు సినిమా ప్లస్ ప్యాక్‌కు సబ్స్కిప్షన్ చేసుకున్న తర్వాత, యూజర్లు యుప్ టివి స్కోప్ అప్లికేషన్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యుప్ టివి స్కోప్ యాప్ ఆండ్రాయిడ్ టివి, అమెజాన్ ఫైర్‌టివి ప్లాట్‌ఫామ్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు