BSNL: బీఎస్ఎన్ఎల్ నుంచి కొత్త ప్లాన్స్... లాభాలు ఇవే

BSNL Prepaid Plans | బీఎస్ఎన్ఎల్ యూజర్లకు శుభవార్త. రూ.94, రూ.95 ధరతో మరో రెండు ప్లాన్స్‌ని ప్రకటించింది బీఎస్ఎన్ఎల్. బెనిఫిట్స్ తెలుసుకోండి.

news18-telugu
Updated: July 7, 2020, 6:01 PM IST
BSNL: బీఎస్ఎన్ఎల్ నుంచి కొత్త ప్లాన్స్... లాభాలు ఇవే
BSNL: బీఎస్ఎన్ఎల్ నుంచి కొత్త ప్లాన్స్... లాభాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-BSNL సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటించింది. రూ.94 ధరతో అడ్వాన్స్ పర్ మినిట్, రూ.95 ధరతో అడ్వాన్స్ పర్ సెకండ్ ప్లాన్స్‌ని కొత్తగా తీసుకొచ్చింది. ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసేవారికి 90 రోజుల వరకు 3జీబీ హైస్పీడ్ డేటా, 100 నిమిషాల కాల్స్ లభిస్తాయి. వీటితో పాటు పర్సనలైజ్డ్ రింగ్‌బ్యాక్ టోన్ 60 రోజుల వరకు ఉచితంగా లభిస్తుంది. రూ.94 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే పల్స్ రేట్ 60 సెకండ్లకు ఉంటుంది. రూ.95 రీఛార్జ్ చేస్తే పల్స్ రేట్ సెకండ్‌కు ఉంటుంది. 100 నిమిషాల లిమిట్ పూర్తైన తర్వాత రూ.94 ప్లాన్‌లో నిమిషానికి లోకల్ కాల్స్‌కు రూ.1, ఎస్‌టీడీ కాల్స్‌కు రూ.1.3 చొప్పున ఛార్జీలు చెల్లించాలి. రూ.95 ప్లాన్‌లో లోకల్ కాల్స్‌కు సెకండ్‌కు 2 పైసలు చెల్లించాలి. రెండు ప్లాన్స్‌పై 80 పైసల చొప్పున ఎస్ఎంఎస్ ఛార్జీలు ఉంటాయి. నేషనల్ మెసేజెస్‌కు రూ.1.2 ఛార్జీలు చెల్లించాలి.

SBI Health Policy: తక్కువ ధరకే ఎస్‌బీఐ ఆరోగ్య సంజీవని పాలసీ... లాభాలు ఇవే

SBI Rules: డబ్బులు డ్రా చేస్తున్నారా? ఎస్‌బీఐ రూల్స్ ఇవే

ఒడిషా, కేరళ సర్కిల్స్ తప్ప దేశంలోని అన్ని సర్కిల్స్‌లో ఈ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి. ప్రస్తుత బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు తమ అకౌంట్స్ నుంచి రూ.94, రూ.95 ప్లాన్స్ రీఛార్జ్ చేయొచ్చు. రూ.94 ప్లాన్ కోసం PLAN ADVANCE94, రూ.94 ప్లాన్ కోసం PLAN ADVANCE95 అనే మెసేజ్‌ను 123 నెంబర్‌కు పంపాలి.
Published by: Santhosh Kumar S
First published: July 7, 2020, 6:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading