హోమ్ /వార్తలు /బిజినెస్ /

BSNL: రూ.365 రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ... బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్

BSNL: రూ.365 రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ... బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్

BSNL: రూ.365 రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ... బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
(ప్రతీకాత్మక చిత్రం)

BSNL: రూ.365 రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ... బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ (ప్రతీకాత్మక చిత్రం)

BSNL Prepaid Plan | ఎక్కువ వేలిడిటీ కావాలనుకునేవారికి సరికొత్త ప్లాన్ ప్రకటించింది బీఎస్ఎన్ఎల్‌. ఆ ప్లాన్ వివరాలు తెలుసుకోండి.

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-BSNL యూజర్లకు శుభవార్త. సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది బీఎస్ఎన్ఎల్. రూ.365 రీఛార్జ్ ప్లాన్‌పై 365 రోజుల వేలిడిటీ పొందొచ్చు. రోజుకు 250 నిమిషాల కాల్స్, 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఉపయోగించుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ ఉపయోగిస్తే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ బెనిఫిట్స్ 60 రోజులు మాత్రమే లభిస్తుంది. మిగతా రోజులు వేలిడిటీ మాత్రమే లభిస్తుంది. మిగతా రోజుల్లో కాల్స్, డేటా ఉపయోగించుకోవాలనుకుంటే టాప్ అప్ ఓచర్లు రీఛార్జ్ చేసుకోవాలి. వేలిడిటీ ముఖ్యం అనుకునేవారికి రూ.365 రీఛార్జ్ ప్లాన్‌ ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్‌ కొన్ని రాష్ట్రాలకే పరిమితం. ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లోని యూజర్లకు కూడా ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లో మాత్రమే రీఛార్జ్ చేయాలి.

కస్టమర్లను ఆకట్టుకోవడానికి బీఎస్ఎన్ఎల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రీపెయిడ్ ప్లాన్స్‌పై వెలిడిటీని పెంచుకోవడానికి రూ.2 ధరకే ప్రత్యేకంగా ఓ ప్లాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే రూ.2 రీఛార్జ్ చేస్తే మూడు రోజులు వేలిడిటీ పెంచుకోవచ్చు. అంటే మీ ప్లాన్ వేలిడిటీ ఇవాళ అయిపోతుందనుకుంటే రూ.2 రీఛార్జ్ చేస్తే చాలు... ప్రస్తుతం ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్‌ను మరో మూడు రోజులు వాడుకోవచ్చు. ఈ ప్లాన్‌లో ఇతర బెనిఫిట్స్ ఏవీ ఉండవు.

ఇవి కూడా చదవండి:

Jio offer: జియో రూ.249 కన్నా ఎక్కువ రీఛార్జ్ చేసేవారికి ఈ ఆఫర్స్

Jio Plans: జియోలో ఏ ప్లాన్ రీఛార్జ్ చేస్తే ఎంత లాభం? తెలుసుకోండి

PAN Card: 10 నిమిషాల్లో ఉచితంగా పాన్ కార్డ్... తీసుకోండి ఇలా

First published:

Tags: BSNL, Telecom

ఉత్తమ కథలు