BSNL: ఇంటికి ఇంటర్నెట్ కావాలా? బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ఇదే

BSNL Broadband Plans | ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలనుకునేవారికి శుభవార్త. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-BSNL రూ.499 ధరతో కొత్త ప్లాన్ ప్రకటించింది.

news18-telugu
Updated: July 8, 2020, 2:25 PM IST
BSNL: ఇంటికి ఇంటర్నెట్ కావాలా? బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ఇదే
BSNL: ఇంటికి ఇంటర్నెట్ కావాలా? బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? మీ పిల్లలకు ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయా? ఇంట్లోకి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-BSNL సరికొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రకటించింది. రూ.499 ధరతో కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్ తీసుకున్నవారికి 20ఎంబీపీఎస్ స్పీడ్‌తో 100 జీబీ డేటా ఇస్తోంది. ఈ లిమిట్ దాటితే స్పీడ్ 20 ఎంబీపీఎస్ నుంచి 2 ఎంబీపీఎస్‌కు తగ్గిపోతుంది. డౌన్‌లోడ్, అప్‌లోడ్ లిమిట్ లేదు. ఈ ప్లాన్ ఎంచుకున్నవారికి ఉచిత ఈమెయిల్ ఐడీ, 1జీబీ స్టోరేజ్ స్పేస్ ఇవ్వనుంది బీఎస్ఎన్ఎల్. అంతేకాదు... భారతదేశమంతా లోకల్, ఎస్‌టీడీ కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చు. ఐఎస్‌డీ కాల్ సర్వీస్ కావాలంటే యూనిట్‌కు రూ.1.20 చొప్పున చెల్లించాలి. బీఎస్ఎన్ఎల్ రూ.499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను మంత్లీ బేసిస్‌పై తీసుకోవచ్చు. దీంతో పాటు ఏడాదికి, 24 నెలలకు, 36 నెలలకు కూడా డ్యూరేషన్ ఎంచుకోవచ్చు. యాన్యువల్ ప్లాన్ ఎంచుకునే వారికి ఒక నెల అదనంగా సర్వీస్ లభిస్తుంది. 24 నెలలు ఎంచుకుంటే 2 నెలలు, 36 నెలలు ఎంచుకునేవారికి 4 నెలలు అదనంగా ఉచిత సర్వీస్ లభిస్తుంది.
Published by: Santhosh Kumar S
First published: July 8, 2020, 2:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading