హోమ్ /వార్తలు /బిజినెస్ /

BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్... రోజుకు రూపాయి మాత్రమే

BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్... రోజుకు రూపాయి మాత్రమే

BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్... రోజుకు రూపాయి మాత్రమే
(ప్రతీకాత్మక చిత్రం)

BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్... రోజుకు రూపాయి మాత్రమే (ప్రతీకాత్మక చిత్రం)

BSNL New Plan | మీరు బీఎస్ఎన్ఎల్ యూజరా? మంచి ప్లాన్ కోసం చూస్తున్నారా? సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించింది బీఎస్ఎన్ఎల్. వివరాలు తెలుసుకోండి.

బీఎస్ఎన్ఎల్ యూజర్లకు శుభవార్త. సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించింది భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-BSNL. 365 రోజులకు రూ.365 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించింది. అంటే ఒక రోజుకు రూ.1 చొప్పున 365 రోజులకు రూ.365 చెల్లిస్తే చాలు. రూ.365 రీఛార్జ్ చేసినవారికి అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ రోజుకు 250 నిమిషాలు వస్తాయి. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. అంతేకాదు... రోజూ 100 ఎస్ఎంఎస్‌లు కూడా వాడుకోవచ్చు. అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. ఈ బెనిఫిట్స్ అన్నీ కేవలం 60 రోజులు మాత్రమే. అంటే 60 రోజులు మాత్రమే వాయిస్, డేటా, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ పొందొచ్చు. ఒకసారి ఫ్రీ వాయిస్ కాల్ లిమిట్ ముగిసిన తర్వాత బేస్ ప్లాన్ టారిఫ్ ప్రకారం ఛార్జీలు ఉంటాయి. ఇక 2జీబీ డేటా వాడుకున్న తర్వాత స్పీడ్ 80కేబీపీఎస్‌కు తగ్గుతుంది. పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్ ఆఫర్ కూడా ఉంది.

Oppo F17 Pro: న్యూ ఇయర్ ఆఫర్... ఒప్పో ఎఫ్17 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్

Vivo Y51: భారీ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరాతో వివో వై51 రిలీజ్

మొదట ఈ ప్లాన్‌ను కేరళలో ప్రకటించింది బీఎస్ఎన్ఎల్. ఆ తర్వాత మరికొన్ని రాష్ట్రాల్లో అందిస్తోంది. అందులో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ కూడా ఉంది. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని యూజర్లు ఈ ప్లాన్ ఉపయోగించుకోవచ్చు. అస్సాం, బీహార్-జార్ఖండ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, కేరళ, కోల్‌కతా-పశ్చిమ బెంగాల్, నార్త్ ఈస్ట్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్-చత్తీస్‌గఢ్, ఒడిషా, పంజాబ్, రాజస్తాన్, తమిళనాడు-చెన్నై, యూపీ-ఈస్ట్, యూపీ-వెస్ట్ సర్కిల్స్‌లోని యూజర్లు ఈ ఆఫర్ పొందొచ్చు.

రూ.365 ప్లాన్‌తో పాటు రూ.2,399 ప్లాన్‌ను కూడా ప్రకటించింది బీఎస్ఎన్ఎల్. రూ.2,399 రీఛార్జ్ చేస్తే రోజూ 250 నిమిషాలు వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. ఎలాంటి డేటా లభించదు. డేటా అవసరం లేదనుకునేవారికి ఇది బెస్ట్ ప్లాన్. రూ.1499 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాల్స్ వస్తాయి. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. 24 జీబీ డేటా వస్తుంది.

Moto G 5G: రూ.6,000 లోపే 5జీ స్మార్ట్‌ఫోన్... కాసేపట్లో సేల్

రోజూ 3జీబీ డేటా కావాలా? ఈ Jio, Airtel, Vi ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి తెలుసుకోండి

ఇక ఇప్పటికే 100 రోజుల వేలిడిటీతో రూ.106, రూ.107 ప్లాన్స్‌ని కూడా ప్రకటించింది బీఎస్ఎన్ఎల్. రూ.106 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 100 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 100 నిమిషాల వాయిస్ కాల్స్ లభిస్తాయి. 3జీబీ డేటా వాడుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ 60 రోజులు ఉచితం. రూ.107 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 100 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 100 నిమిషాల వాయిస్ కాల్స్ లభిస్తాయి. 3జీబీ డేటా వాడుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ 60 రోజులు ఉచితం.

First published:

Tags: BSNL, Telecom

ఉత్తమ కథలు